iDreamPost
android-app
ios-app

త్వరలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లోకి టిల్లు స్క్వేర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

  • Published Mar 28, 2024 | 7:32 PM Updated Updated Mar 28, 2024 | 7:32 PM

థియేటర్ లో సినిమాలు రిలీజ్ కాకాముందే ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ఆయా సినిమాల డిజిటల్ రైట్స్ ను కొనుగోలు చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా థియేటర్ రిలీజ్ కు సిద్ధంగా ఉన్న సినిమా టిల్లు స్క్వేర్. ఈ సినిమా డిజిటల్ రైట్స్ భారీగా అమ్ముడుపోయినట్లు సమాచారం.

థియేటర్ లో సినిమాలు రిలీజ్ కాకాముందే ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ఆయా సినిమాల డిజిటల్ రైట్స్ ను కొనుగోలు చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా థియేటర్ రిలీజ్ కు సిద్ధంగా ఉన్న సినిమా టిల్లు స్క్వేర్. ఈ సినిమా డిజిటల్ రైట్స్ భారీగా అమ్ముడుపోయినట్లు సమాచారం.

  • Published Mar 28, 2024 | 7:32 PMUpdated Mar 28, 2024 | 7:32 PM
త్వరలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లోకి టిల్లు స్క్వేర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో సినిమాలు, సిరీస్ లు చేస్తున్న సందడి ఇప్పుడు అందరికి తెలిసిందే. అయితే, థియేటర్ లో సినిమాలు రిలీజ్ అయిన తర్వాత ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతూ ఉంటాయి. ఇక ఇప్పుడు థియేటర్ లో సినిమాలు రిలీజ్ కాకముందే ఆయా సినిమాల డిజిటల్ రైట్స్ ముందుగానే భారీ ధరల్లో అమ్ముడు పోతున్నాయి. ఈ క్రమంలో తాజాగా రిలీజ్ కు సిద్ధంగా ఉన్న సినిమా “టిల్లు స్క్వేర్”. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా బజ్ క్రియేట్ అయింది. మార్చి 29 న ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ క్రమంలో చిత్ర బృందం అంతా కూడా మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. అయితే, ఈ సినిమా డిజిటల్ రైట్స్ భారీగా అమ్ముడుపోయినట్లు సమాచారం.

సిద్ధు జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లు సినిమా తెలుగు ప్రేక్షకులలో ఎంత క్రేజ్ సంపాదించుకుందో అందరికి తెలిసిందే. టీ టౌన్ లో టిల్లు క్యారక్టర్ ఐకానిక్ గా మారిపోయింది. దీనితో మేకర్స్ ఈ సినిమా సెకండ్ పార్ట్ కు శ్రీకారం చుట్టారు. ఈ సినిమాలో సిద్దుకు జోడిగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన సినిమా ట్రైలర్ తో ఆడియన్సులో సూపర్ హిట్ బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా మీద వస్తున్న హైప్ కు తగినట్లే ఈ సినిమా ప్రమోషన్స్ కూడా భారీగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో టిల్లు స్క్వేర్ డిజిటల్ రైట్స్ భారీగా అమ్ముడుపోయినట్లు సమాచారం. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట‍్‍ఫామ్ ‘నెట్‍ఫ్లిక్స్’ సొంతం చేసుకుంది. ఇక థియేట్రికల్ రన్ పూర్తయిన తర్వాత ఈ సినిమా స్ట్రీమింగ్‍కు వస్తుంది.అయితే, ఈ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ ను థియేటర్ లో మాత్రం అసలు మిస్ కాకూడదు.

ఇక సిద్ధు జొన్నలగడ్డ మరొకసారి.. తన నటనతో అందరిని తనవైపు తిప్పుకునేలా చేశాడు.ఇక అతనితో జత కట్టిన అనుపమ గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే అనుపమ గురించి రకరకాల కామెంట్స్, డిస్కషన్స్ సోషల్ మీడియాలో జరుగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించిన వీడియోలో కూడా నెట్టింట షికార్లు చేస్తున్నాయి. కాగా ఈ సినిమాలో మురళీధర్ గౌడ్, ప్రిన్స్ సెసిల్, ప్రణీత్ రెడ్డి కల్లెమ్ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయినా ఈ సినిమాపై ఇక విడుదల తర్వాత ఇంకా ఎటువంటి టాక్ సంపాదించుకుంటుందో వేచి చూడాలి. మరి, టిల్లు స్క్వేర్ డిజిటల్ రైట్స్ భారీ ధరలకు అమ్ముడు పోయిన విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomtarafbet girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis