iDreamPost

ఆది పినిశెట్టి ‘శబ్దం’ మూవీ.. టీజర్ తోనే వెన్నులో వణుకు!

shabdam Movie teaser review: ఆది పినిశెట్టి మూవీ వస్తోంది అంటే మినిమం అంచనాలు ఉంటాయి. అలాంటి హీరో ఇప్పుడు ఏకంగా ఒక మంచి హారర్ కంటెట్ తో వస్తున్నాడు. ఇంకేముంది టీజర్ తోనే అంచనాలను ఆకాశానికి ఎత్తేశారు.

shabdam Movie teaser review: ఆది పినిశెట్టి మూవీ వస్తోంది అంటే మినిమం అంచనాలు ఉంటాయి. అలాంటి హీరో ఇప్పుడు ఏకంగా ఒక మంచి హారర్ కంటెట్ తో వస్తున్నాడు. ఇంకేముంది టీజర్ తోనే అంచనాలను ఆకాశానికి ఎత్తేశారు.

ఆది పినిశెట్టి ‘శబ్దం’ మూవీ.. టీజర్ తోనే వెన్నులో వణుకు!

ఆది పినిశెట్టి గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోగా, విలన్ గా, సపోర్టింగ్ యాక్టర్ గా ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించాడు. అతని లక్ష్యం మాత్రం ఆడియన్స్ కి మంచి సినిమా అందించడమే అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆది పినిశెట్టి ఎంచుకునే పాత్రలు కూడా అలాగే ఎంతో వైవిధ్యంగా ఉంటాయి. ఇప్పుడు తాజాగా అలాంటి ఒక విభిన్న కథ, వైవిధ్య భరిత సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆ మూవీ మరేదో కాదు.. శబ్దం. ఈ మూవీకి సంబంధించి తాజాగా టీజర్ ని విడుదల చేశారు. మరి.. ఆ టీజర్ ఎలా ఉంది? అసలు ఆ సినిమా కథ ఏంటో చూద్దాం.

ఆది పినిశెట్టి ఒక వైవిధ్య భరితమైన హారర్ సినిమా కాన్సెప్ట్ తో వస్తున్నట్లు అర్థమైపోతోంది. తాజాగా రిలీజ్ చేసిన శబ్ధం టీజర్ ఆకట్టుకునే విధంగానే ఉంది. పైగా టాలీవుడ్ అనే కాకుండా.. ఏ ఇండస్ట్రీలో అయినా హారర్ కంటెంట్ అనేది ఫుల్ డిమాండ్ ఉండే సబ్జెక్ట్. అలాంటి మూవీతో వస్తున్నప్పుడు ఆడియన్స్ నుంచి సపోర్ట్ అయితే ఉంటుంది. వారి అంచనాలు రీచ్ అయ్యేలా మూవీలో లైన్, ఎలిమెంట్స్ ఉంటే మాత్రం దానికి సక్సెస్ రేషియో కచ్చితంగా ఎక్కువగా ఉంటుంది. ఈ కాన్సెప్ట్ కూడా ఇంచు మించు అలాగే కనిపిస్తోంది.

ఒక పారానార్మల్ యాక్టివిటీకి శబ్దం అనే సబ్జెక్ట్ జోడించి ఫ్రెష్ కాన్సెప్ట్ తో వస్తున్నారు. ఈ మూవీ కథ విషయానికి వస్తే.. టీజర్ ప్రకారం ఒక అమ్మాయి ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్ లో ఆత్మహత్యకు పాల్పడుతుంది. ఆ అమ్మాయి మరణం చుట్టూ కొంత కథ నడిచేలా చూపించారు. అలాగే ఒక ఆత్మ ఆ ఇన్ స్టిట్యూట్ ని, అందులో ఉండే వారిని ఇబ్బంది పెడుతున్నట్లు అర్థమవుతోంది. అయితే ఆత్మ యాక్టివిటీ కేవలం శబ్ధం రూపంలోనే చూపించారు. అంటే వింత శబ్దాలతో అందరినీ ఇబ్బంది పెట్టడం. ఆ విషయంలో ఉన్న గుట్టు రట్టు చేయడానికి ఆదిపినిశెట్టిని అక్కడికి పిలుస్తారు. పారానార్మల్ యాక్టివిటీని కనుగొనడంలో ఆదిపినిశెట్టిని ఎక్స్ పర్ట్ గా చూపించి ఉండచ్చు.

అసలు కథేంటో తెలుసుకోవడానికి ఆది ప్రయత్నిస్తున్నట్లు చూపించారు. ఈ మూవీని 7జీ ఫిల్మ్స్ బ్యానర్ పై 7జీ శివ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ఆది పినిశెట్టి మాత్రమే కాకుండా లక్ష్మీ మీనన్, సిమ్రాన్, లైలా, ఎంఎస్ భాస్కర్, రాజీవ్ మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి అరివఝాగన్ దర్శకత్వం వహిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నాడు. తమన్ మార్క్ ని టీజర్ లోనే చూపించేశాడు. ఈ మూవీలో బ్యాగ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవల్లోనే ఉండేలా కనిపిస్తోంది. మరి.. శబ్దం సినిమా టీజర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి