iDreamPost

నాడు కానిస్టేబుల్ గా అవమానం.. నేడు Civils లో టాప్ ట్యాంకర్ గా.. ఇది కదా సక్సెస్

Prakasam: సంకల్పం గట్టిదైతే విజయం మనకు బానిస అవుతుందని ఎంతో మంది పెద్దలు చెప్పే మాట. కష్టాలను సోపానాలుగా చేసుకుని పట్టుదలతో కృషి చేస్తే విజయం నీ ముగింటకు వస్తుంది. అలానే ఓ యువకుడు చేసిన కృషికి ఫలితం దక్కింది. అంతేకాక అతడి సక్సెస్ స్టోరీ ఎంతో మందికి ఆదర్శం.

Prakasam: సంకల్పం గట్టిదైతే విజయం మనకు బానిస అవుతుందని ఎంతో మంది పెద్దలు చెప్పే మాట. కష్టాలను సోపానాలుగా చేసుకుని పట్టుదలతో కృషి చేస్తే విజయం నీ ముగింటకు వస్తుంది. అలానే ఓ యువకుడు చేసిన కృషికి ఫలితం దక్కింది. అంతేకాక అతడి సక్సెస్ స్టోరీ ఎంతో మందికి ఆదర్శం.

నాడు కానిస్టేబుల్ గా అవమానం.. నేడు Civils లో టాప్ ట్యాంకర్ గా.. ఇది కదా సక్సెస్

మనిషికి  సంకల్పం ఉంటే సాధించలేనిది అంటూ ఏమి ఉండదు. చాలా మంది తాము పేదరికంలో ఉన్నాం, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, తల్లిదండ్రులు లేరు అంటూ అనేక కారణాలు చెబుతుంటారు. ఇక ఇలాంటి కారణాలతో కొందరు లక్ష్యం వైపు అడుగులు వెయ్యకపోగా, మరికొందరు మధ్యలోనే వదిలేస్తుంటారు. ఇంకొందరు మాత్రమే లక్ష్యం సాధించడమే శ్వాసగా పెట్టుకుని కఠోర తపస్సు చేస్తారు. చివరకు విజయం సాధించి.. ప్రపంచం తన గురించి మాట్లాడుకునే చాస్తారు. ఆ జాబితాకు చెందిన వ్యక్తే ఉదయ్ కృష్ణారెడ్డి. ప్రభుత్వ పాఠశాలలో చదివి సివిల్స్ లో ర్యాంక్ సాధించాడు. మరి.. ఆయన స్టోరీ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ వంటి సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశ వ్యాప్తంగా ఎంతోమంది యువత సివిల్ సర్వీసెస్ కోసం సన్నద్ధమవుతుంటారు. సివిల్స్ సాధిస్తే కీర్తి తో పాటు దేశానికి సేవ చేయొచ్చని భావిస్తుంటారు. చాలా మంది మొదటి ప్రయత్నంలో విఫలమైనా కూడా పట్టు వదలకుండా సివిల్స్ సాధించే వరకు ఏళ్ల కేళ్లు ప్రిపేర్ అవుతుంటారు. మన దేశంలో సివిల్స్ కు ప్రాధాన్యత ఆ రేంజ్ లో ఉంటుంది. ప్రతీ ఏడు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంటుంది. సివిల్స్ సాధించాలని యువత బలమైన సంకల్పంతో ప్రిపరేషన్ సాగిస్తుంటారు. ఇలాగే ఏపీకి చెందిన ఓ యువకుడు అంకితభావంతో చదివి సివిల్స్ పరీక్షల్లో సత్తా చాటారు.

ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఊళ్లపాలెంకి చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి సివిల్ లో 780 ర్యాంక్ సాధించారు. అయితే అతడు విజయం సాధించడానికి పడిన కష్టం తెలిస్తే.. మాత్రం అందరు ఆశ్చర్య పడక మానరు. ఎంతో మంది తల్లిదండ్రులు ఉండి లక్షల్లు పోసి కోచింగ్ తీసుకున్న విజయం సాధించడంలో మాత్రం విఫలం అవుతుంటారు. కానీ కృష్ణారెడ్డిది బాల్యం అంతా కష్టాల కడలిలో సాగింది. చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. నానమ్మ దగ్గరే ఉంటూ విద్యాభ్యాసం సాగించాడు. ప్రభుత్వ స్కూలు, కాలేజీల్లో ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారు. ఆయన నానమ్మ కూరగాయలు అమ్ముతూ కృష్ణారెడ్డిని చదివించింది.

తన అమ్మ కష్టం చూసి..ఎలాగైన మంచి ఉద్యోగం పొందాలని కృష్ణారెడ్డి భావించారు. నానమ్మ, త్యాగం, కష్టాన్ని స్మరించుకుంటూ 780వ ర్యాంక్  సాధించారు ఉదయ్ కృష్ణారెడ్డి. అంతకంటే ముందు కానిస్టేబుల్ గా ఉద్యోగం సాధించాడు. అయితే 2019 సీఐ అవమానించడంతో కానిస్టేబుల్ ఉద్యోగానికి రిజైన్ చేసి సివిల్స్ వైపు మళ్లారు.  అలా మూడు సార్లు సివిల్స్ ప్రయత్న చేసి విఫలమయ్యారు. చివరకు 4వ ప్రయత్నంలే 780 ర్యాంక్ సాధించారు. ఇలా ఉదయ్ కృష్ణారెడ్డి  ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ సివిల్స్ లో ర్యాంక్ సాధించి.. ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలిచారు. మరి.. ఈ విజేతపై మీ ప్రశంసలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి