iDreamPost

టూత్ బ్రష్ ను మింగేసిన యువతి.. తర్వాత జరిగింది ఇదే!

టూత్ బ్రష్ ను మింగేసిన యువతి. వినటానికి షాకింగ్ గా ఉన్న ఇది నిజం. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

టూత్ బ్రష్ ను మింగేసిన యువతి. వినటానికి షాకింగ్ గా ఉన్న ఇది నిజం. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

టూత్ బ్రష్ ను మింగేసిన యువతి.. తర్వాత జరిగింది ఇదే!

సాధారణంగా ప్రతి ఒక్కరి ఇళ్లలో చిన్న పిల్లలు అడుకుంటూ.. ప్రతి దాన్నీ నోట్లో పెట్టుకుంటుంటారు. అయితే, కొన్నిసార్లు నాణేలు, బొమ్మల ముక్కలు, బ్యాటరీలు, సూదులు, తాళం చెవి వంటి చిన్న చిన్న వస్తువులను పిల్లలు తెలియక మింగేస్తుంటారు. ఆ తర్వాత వారి తల్లిదండ్రులు అప్రమత్తమై పిల్లలను వైద్యుల వద్దకు తీసుకువెళ్తుంటారు. ఇక నానా తంటాలు పడి వైద్యులు వాటిని బయటకు తీస్తారు. ఇలాంటి ఘటనలు గతంలో చాలానే జరిగాయి. ఇదిలా ఉంటే.. తాజాగా అచ్చం ఇలాగే ఓ యువతి ఏకంగా టూత్ బ్రష్ నే మింగెసింది. అదేంటి..? చాక్లెట్ మింగినంతా ఈజీగా బ్రష్ మింగేయడమా విడ్డూరం కాకపోతే.., అయిన అంతా పెద్ద బ్రష్ ని ఎలా మింగిసిందని ఆశ్యర్యపోతున్నారా.!

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సహజంగా తెలిసి తెలియని వయస్సులో చాలా మంది పిల్లలు మాత్రమే ఇలాంటి ప్రమాదకరమైన పనులు చేస్తారు అనుకుంటే పొరపాటే. కొన్ని సందర్భాల్లో 20 ఏళ్ల వయసు దాటిన వారు కూడా ఇలాంటి సిల్లీ పనులతో.. చివరికి రిస్క్‌లో పడతారని తాజాగా ఒక ఘటనతో నిరూపితమైంది. అసలేం జరిగిందంటే.. ఇటివలే స్పెయిన్‌లోని గల్డకావోకు చెందిన హీజియా (21) అనే యువతి నవంబర్ 29న మాంసాహారం తినింది. అయితే మాంసం ముక్క ఆమె గొంతులో అడ్డంగా ఇరుక్కుపోయింది. దీంతో ఆ యువతికి ఊపిరాడక ఉక్కిరిబిక్కిరైపోయింది. వెంటనే.. దానిని బయటకు తీసేందుకు ప్రయత్నించింది. కానీ, ఆమె ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఈ క్రమంలో.. హీజియా టూత్ బ్రష్‌ ను ఉపయోగించి.. తన చేతితో గొంతులో ఇరుక్కుపోయిన మాంసం ముక్కను బయటకు తీయాలనుకుంది. అయితే ఈ ప్రయత్నంలోనే ఆ యువతి ఏకంగా ఆ టూత్ బ్రష్ ఆ యువతి గొంతులోకి జారుకుంది.

ఆ సమయంలో హీజియా సహాయం కోసం తన తండ్రిని పిలిచింది. అతడు తీసే ప్రయత్నం చేసినా ఫలించలేదు. దీంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. జరిగిందంతా వైద్యులకు వివరించారు. డాక్టర్లు వెంటనే ఆమెకి X-rayతీసి చూశారు. తక్షణమే హీజియాకి మత్తు ఇచ్చి సర్జన్లు దంత పరికరం సహాయంతో విజయవంతంగా గొంతులో ఇరుక్కుపోయిన ఆ టూత్ బ్రష్ తో పాటు మాంసం ముక్కను వెలికితీశారు. ఈ ప్రక్రియలో ఆ వైద్యులకు దాదాపు మూడు గంటల సమయం పట్టిందట. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే? సర్జరీ సమయంలో తనకు ఎలాంటి నొప్పి కలగలేదని హీజియా చెప్పుకొచ్చింది. కళ్లు తెరిచి చూడగా.. తన పక్కన మింగేసిన టూత్ బ్రష్‌ కనిపించిందని ఆ అమ్మాయి తెలిపింది. ప్రస్తుతం హీజియా సజావుగా ఊపిరి పీల్చుకుంటోంది. స్పెయిన్ లో చోటు చేసుకున్న ఈ వార్త ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతోంది. మరి, హీజియా చేసిన పనిపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి