iDreamPost

బంగ్లాదేశ్ లో ఘోర రైలు ప్రమాదం.. 15 మంది మృతి!

బంగ్లాదేశ్ లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు రైళ్లు ఢీ కొని దాదాపు 15 మంది మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ఈ ఘటనతో ఆ దేశ రైల్వే శాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

బంగ్లాదేశ్ లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు రైళ్లు ఢీ కొని దాదాపు 15 మంది మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ఈ ఘటనతో ఆ దేశ రైల్వే శాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

బంగ్లాదేశ్ లో ఘోర రైలు ప్రమాదం.. 15 మంది మృతి!

బంగ్లాదేశ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రెండు రైళ్లు ఢీ కొని దాదాపు 15 మంది మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ఈ ఘటనతో ఆ దేశ రైల్వే శాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అసలేం జరిగిందంటే? బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో సోమవారం ఘోర రైలు ప్రమాదం జరిగింది. మధ్యాహ్న సమయంలో బయలు దేరిన ఓ ప్యాసింజర్ రైలు ఎదురుగా ఉన్న ఓ గూడ్స్ రైలును ఢీ కొట్టింది. దీంతో ప్రయాణికులు అంతా ఒక్కసారిగా భయంతో రైలు నుంచి బయటకు పరుగులు తీశారు. కొందరు ప్రయాణికులు వెంటనే స్పందించి పోలీసులకు, రైల్వే అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

అయితే ఈ ప్రమాదంలో దాదాపు 15 మంది చనిపోగా, ఎంతో మంది తీవ్రంగా గాయపడ్డట్లు సమాచారం. అధికారులు గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకుని మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే ఈ ఘటనతో రైల్వే శాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇక ఉన్నతాధికారులు వెంటనే అప్రమత్తమై ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇంతే కాకుండా ప్రమాదానికి అసలు కారణం ఏంటి? రెండు రైళ్లు ఎలా ఢీ కొన్నాయని ఆరా తీస్తున్నారు. ఇదే ఘటన ఇప్పుడు ఢాకాలో తీవ్ర విషాదంగా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి