iDreamPost

Success Story: యూఎస్ లో జాబ్ వదిలాడు.. డెయిరీ ఫామ్‌తో కోట్లు సంపాదిస్తున్నాడు!

  • Published Mar 28, 2024 | 7:57 PMUpdated Mar 28, 2024 | 7:57 PM

హైదరాబాద్ కు చెందిన ఓ యువకుడు ప్రముఖ ఐటీ కంపెనీ అయిన ఇంటెల్ లో జాబ్ ను వదులుకుని.. డెయిరీ ఫామ్ పెట్టి సక్సెస్ అయ్యాడు. మరి, ఈ యువకుడు ఏంటి .. ఎలా సక్సెస్ అయ్యాడు అనే విషయాలను తెలుసుకుందాం.

హైదరాబాద్ కు చెందిన ఓ యువకుడు ప్రముఖ ఐటీ కంపెనీ అయిన ఇంటెల్ లో జాబ్ ను వదులుకుని.. డెయిరీ ఫామ్ పెట్టి సక్సెస్ అయ్యాడు. మరి, ఈ యువకుడు ఏంటి .. ఎలా సక్సెస్ అయ్యాడు అనే విషయాలను తెలుసుకుందాం.

  • Published Mar 28, 2024 | 7:57 PMUpdated Mar 28, 2024 | 7:57 PM
Success Story: యూఎస్ లో జాబ్ వదిలాడు.. డెయిరీ ఫామ్‌తో కోట్లు సంపాదిస్తున్నాడు!

భారతదేశంలో ప్రతి ఏటా డిగ్రీలు పూర్తి చేసుకుని లక్షల్లో విద్యార్థులు బయటకు వస్తున్నారు. వారిలో ఎంతో మంది వారి జీవితంలో ఎదో సాధించాలనే తపనతో బ్రతుకుతూ ఉంటారు, ఈ క్రమంలో తమకు నచ్చినా నచ్చకపోయినా కుటుంబ పరిస్థితుల కారణంగా ఉద్యోగాలు చేసేవారు కొందరు. తమ లక్ష్యాలను అణచివేసుకుంటూ .. ఆర్ధిక స్థితిగతులు మార్చుకోవడం కోసం అడుగులు వేసేవారు మరికొందరు. ఉన్నత చదువులు కోసం అమెరికా, ఆస్ట్రేలియా పయనించేవారు ఇంకొందరు. కానీ, వారందరిలో చాలా తక్కువ మంది మాత్రమే జీవితంలో రిస్క్ చేసి .. వారి మీద వారికి ఉన్న నమ్మకంతో .. ఓ నిర్ణయాన్ని తీసుకుని .. ఆ నిర్ణయం దిశగా అడుగులు వేసి.. విజయాన్ని సాధిస్తారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఓ రియల్ లైఫ్ స్టోరీ కూడా ఇటువంటిదే. హైదరాబాద్ కు చెందిన ఓ యువకుడు ప్రముఖ ఐటీ కంపెనీ అయిన ఇంటెల్ లో జాబ్ ను వదులుకుని.. డెయిరీ ఫామ్ పెట్టి సక్సెస్ అయ్యాడు. మరి, ఈ యువకుడు ఏంటి .. ఎలా సక్సెస్ అయ్యాడు అనే విషయాలను తెలుసుకుందాం.

జాబ్ వదిలేసి మరి డైరీ ఫార్మ్ ను రన్ చేస్తున్న ఆ యువకుడి పేరు కిషోర్ ఇందుకూరి. హైదరాబాద్ కు చెందిన ఈ యువకుడు ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి . ఇతని తండ్రి నరసింహరాజు, మహీంద్రా & మహీంద్రాలో 25 సంవత్సరాలు ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. అతని తల్లి ఓ గృహిణి, అతని తమ్ముడు ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేశాడు. కిషోర్ ఇందుకూరి తన 10వ తరగతిని నలంద విద్యాలయ ఉన్నత పాఠశాలలో పూర్తి చేసి, ఇంటర్ ను లిటిల్ ఫ్లవర్ జూనియర్ కళాశాల నుంచి పూర్తి చేశారు. ఇక ఆ ఆ తర్వాత ఐఐటీ ఖరగ్‌పూర్‌లో కెమిస్ట్రీలో బీఎస్సీ పట్టా పొందారు. ఆ తర్వాత ఉన్నత చదువులు కోసం యూఎస్ఏ వెళ్లి.. అక్కడ మసాచుసెట్స్ విశ్వవిద్యాలయంలో పాలిమర్ సైన్స్‌లో తన పీహెచ్‌డీ కంప్లీట్ చేశారు. అనంతరం అక్కడే ప్రముఖ ఐటీ కంపెనీ అయినా ఇంటెల్ లో ఉద్యోగంలో చేరారు.

kishore-indukuriఅతను ఉద్యోగం చేస్తున్న సమయంలోనే.. తాను చేసే ఉద్యోగం ఏ మాత్రం సంతృప్తిని ఇవ్వకపోవడంతో.. అనేక వ్యాపారాలను మొదలుపెట్టాడు. జీఆర్ఈ, టోఫెల్ కోసం ట్యూషన్స్ చెప్పడం. కూరగాయల సాగు చేసే సంస్థను స్థాపించడం.. ఇలా రెండేళ్ల పాటు అనేక వ్యాపారాలలో కోటి రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టాడు. ఇక ఆ తర్వాత పరిశ్రమ నిపుణుల సలహా మేరకు 20 ఆవులను కొనుగోలు చేసి.. 2012లో ఓ సిడ్ డైరీ ఫార్మ్ ను ప్రారంభించాడు. అయితే, ఇతను అందరిలా పాలు కేంద్రానికి పోయకుండా.. డైరెక్ట్ గా వినియోగదారులకే అమ్మడం ప్రారంభించాడు. పైగా డైరీలో అన్ని పనులు కూడా ఇతనే చేసేవాడు.. పాలు పితకడం నుంచి వాటి గడ్డి వేయడం వరకు ప్రతి పని ఇతనే దగ్గరుండి చూసుకునేవాడు.

ఈ క్రమంలో మెల్లగా అతని వ్యాపారం రోజు రోజుకి పెరుగుతూ వచ్చింది. అతడు ఇప్పుడు హైదరాబాద్‌లో అతి పెద్ద ప్రైవేట్ పాల సరఫరాదారులలో ఒకటిగా మారాడు ఇక ఇప్పుడు ఈయన కంపెనీలో దాదాపు 100 పశువులున్నాయి. 2020, 2021లో కంపెనీ వార్షిక టర్నోవర్ రూ. 44 కోట్లు ఉండగా.. 2021,2022లో ఇది రూ. 64.5 కోట్లుగా మారింది. మరి అంత ఉన్నత చదువులు చదివి కూడా.. ఏ మాత్రం తక్కువగా భావించకుండా.. అసలు నైపుణ్యం లేని డైరీ వ్యాపారంలో అడుగుపెట్టి.. 44 కోట్ల వార్షిక ఆదాయంతో సిడ్ డెయిరీ ఫామ్‌తో సక్సెస్ అయినా.. హైదరాబాద్ కు చెందిన కిషోర్ ఇందుకూరిపై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి