iDreamPost

నారాయణ సంస్థల డీన్ రాసలీలల పర్వం.. పదుల సంఖ్యలో వీడియోలు..

తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద ప్రైవేటు విద్యా సంస్థల్లో ఒకటి నారాయణ. ఇక్కడ వేలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే ఇక్కడ విద్యా విధానాన్ని తట్టుకోలేక పలువురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు చూశాం. ఇప్పుడు..

తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద ప్రైవేటు విద్యా సంస్థల్లో ఒకటి నారాయణ. ఇక్కడ వేలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే ఇక్కడ విద్యా విధానాన్ని తట్టుకోలేక పలువురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు చూశాం. ఇప్పుడు..

నారాయణ సంస్థల డీన్ రాసలీలల పర్వం.. పదుల సంఖ్యలో వీడియోలు..

చదువులు చెప్పే విద్యా సంస్థలు..దేవాలయాలు. గురువులే దేవుళ్లు. కానీ నేడు విద్య వ్యవస్థలోకి కార్పొరేటీకరణ చొచ్చుకుపోయి.. విద్యా విధానంలో మార్పులు చోటుచేసుకున్నాయి. పేరు మోసిన విద్యా సంస్థలు మార్కులే కొలమానంగా భావిస్తూ.. ఉదయం 5 గంటల నుండి చదువు పేరుతో విద్యార్థులను రుద్దుతున్నారు. రాత్రి 12 వరకు పుస్తకాలు పట్టుకుని కూర్చోవాల్సిందే. దీంతో విద్యార్థులు మానసిక సంఘర్షణకు లోనై ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. అటువంటి విద్యా సంస్థల్లో ఒకటి నారాయణ. ఇక్కడ చదువుల ఒత్తిడితో బలవన్మరణానికి పాల్పడిన విద్యార్థులెందరో. అయితే ఇప్పుడు మరో అంశంతో వార్తల్లో నిలుస్తోంది. ఈ విద్యా సంస్థలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి రాసలీలు బయటకు రావడం కలకలం సృష్టిస్తోంది.

నారాయణ విద్యా సంస్థల కోర్ డీన్‌గా వ్యవహరిస్తున్నారు లింగేశ్వర రెడ్డి. జూనియర్ కాలేజీల విభాగాన్ని పర్యవేక్షిస్తుంటారు. ఈ క్రమంలోనే తన కార్యాలయంలో కొంత మంది మహిళలతో రాస క్రీడల్లో మునిగి తేలారు. అతడి కామ క్రీడలను బయట పెట్టేందుకు లింగేశ్వర్ రెడ్డి కార్యాలయంలోని స్పై కెమెరాలు అమర్చారు అక్కడి ఉద్యోగులు గోపీ కృష్ణ, నజీర్. పదుల సంఖ్యలో వీడియోలను అడ్డుపెట్టుకుని.. వాటితో అతడిని బెదిరించడం మొదలు పెట్టారు. దీంతో ఖంగుతిన్న లింగేశ్వర్ .. వారిని పిలిపించి, మాట్లాడి.. రెండు విలువైన ప్లాట్లు వారి పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. జీతాలు కూడా పెంచేందుకు హామీనిచ్చాడు. అయితే ఆ వీడియోలు డిలీట్ చేయకుండా.. వాటిని మరో ఉద్యోగి నబీ రసూల్‌కు పంపారు ఈ ఇద్దరు.

చంద్రశేఖర్, రవి శంకర్, శ్రీనివాస్ అనే వ్యక్తులకు పంపడంతో.. వీరంతా డీన్‌ను బెదిరించడం మొదలు పెట్టారు. దీంతో వారితో రాజీ కుదుర్చుకున్న లింగేశ్వర్.. కొంత డబ్బులు ఇచ్చాడు. మిగిలిన సొమ్ము ఇవ్వకపోవడంతో.. ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేశారు. దీంతో భయపడ్డ డీన్.. స్పందనలో ఎస్సీకి వినతి పత్రం ఇచ్చారు. దీంతో తాలూకా పోలీస్ స్టేషన్‌కు పిలిపించి సెల్ ఫోన్లు తీసుకుని వారి దగ్గర ఉన్న వీడియోలను డిలీట్ చేయించి వారిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. ఆయన ఆస్తులు కూడా తిరిగి లింగేశ్వర్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. తనను బ్లాక్ మెయిల్ చేసిన ఉద్యోగులను కోర్ డీన్ హైదరాబాద్‌కు బదిలీ చేయించారు. లింగేశ్వర్ స్పందనలో ఫిర్యాదు చేయడంతో నిందితులపై బైండోవర్ కేసులు నమోదు చేశారు పోలీసులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి