iDreamPost

ఒక్కరోజు డిప్యూటీ కమిషనర్ గా 10వ తరగతి విద్యార్థి!

ఒక్కరోజు డిప్యూటీ కమిషనర్ గా 10వ తరగతి విద్యార్థి!

యాక్షన్ కింగ్ అర్జున్ నటించిన ఒకే ఒక్కడు సినిమా మన అందరికీ గుర్తే ఉంటుంది. ఇందులో అర్జున్ ఒక్క రోజు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి అందరినీ ఆకట్టుకున్నాడు. అయితే, ఈ చిత్రం అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇలాంటి అవకాశం నిజజీవితంలో నాకు కూడా వస్తే ఎంత బాగుండో అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కాగా కొందరు అధికారులు గతంలో ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి వారిని ఒక్క రోజు జిల్లా కలెక్టర్ గా అవకాశం కల్పించారు. అచ్చం ఇలాగే ఓ 10వ తరగతి విద్యార్థికి ఒక్క రోజు డిప్యూటీ కమిషనర్ గా అవకాశం కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ అవకాశం రావడంతో ఆ విద్యార్థి అధికారులకు కృతజ్ఞతలు తెలిపాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అస్సాం ప్రభుత్వం ఇటీవల ఆరోహన్ కార్యక్రమాన్ని చేపట్టింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే? మారుమూల, గ్రామీణ, నిరుపేద కుటుంబాల్లో చదువుకుంటున్న ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి.., వారిని వృత్తిపరమైన కోర్సులను అభ్యసించేలా ప్రోత్సహిస్తూ అందుకు ఆ విద్యార్థులు కష్టపడి పనిచేసే విధంగా పోత్సహించడమే ఈ పథకం లక్ష్యం. ఇందులో భాగంగానే.. ఒడిశా రాష్ట్రం శివనగర్ జిల్లా కమిషనర్ ఆదిత్య విక్రమ్ యాదవ్ బొగోటా న్యూమగురిన్ డ్యూరిటింగ్ లోని టీ గార్డెన్ కు చెందిన బాగ్యాదీప్ రాజ్ ఘర్ (16)ను ఎంపిక చేశారు. ఇక నిరుపేద కుటుంబంలో పుట్టి ఎంతో కష్టపడి చదువుకుంటున్న బాగ్యాదీప్ రాజ్ ఘర్ ను ఆరోహన్ కార్యక్రమం ద్వారా ఆ బాలుడికి ఒక్క రోజు డిప్యూటీ కమిషనర్ గా అవకాశం కల్పించారు.

దీంతో 10వ తరగతి విద్యార్థి అయిన బాగ్యాదీప్ రాజ్ ఘర్ కమిషనర్ ఆదిత్య విక్రమ్ యాదవ్ ఆధ్వర్యంలో జూలై 31న ఒక్క రోజు జిల్లా డిప్యూటీ కమిషనర్ గా డీసీసీ సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగానే బాగ్యాదీప్ రాజ్ ఘర్ వివిధ శాఖల పనితీరు గురించి క్లుప్తంగా తెలుసుకున్నాడు. అనంతరం బాగ్యాదీప్ రాజ్ ఘర్ మీడియాతో మాట్లాడుతూ.. నన్ను ఒక్క రోజు డిప్యూటీ కమిషనర్ గా ఉండటానికి సహకరించిన రాష్ట్ర ముఖ్యంత్రి, జిల్లా కమిషనర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. నేను అడ్మిస్ట్రేటివ్ ఆఫీసర్ అవ్వాలనే లక్ష్యం ఉందని, ఆ దిశగా బాగా చదువుకుని అనుకున్నది సాధిస్తానని తెలిపాడు.

ఇది కూడా చదవండి: నోబెల్ వరల్డ్ రికార్డ్ లో చోటు సంపాదించుకున్న 6 నెలల బాలుడు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి