iDreamPost

నోబెల్ వరల్డ్ రికార్డ్ లో చోటు సంపాదించుకున్న 6 నెలల బాలుడు

నోబెల్ వరల్డ్ రికార్డ్ లో చోటు సంపాదించుకున్న 6 నెలల బాలుడు

6 నెలల బుడతడికి నోబెల్ వరల్డ్ రికార్డ్ లో చోటు.. అవును, మీరు విన్నది నిజమే. కేవలం ఆరు నెలల వయసులోనే ఆ చిన్నారి నోబెల్ వరల్డ్ రికార్డ్ లో చోటు సంపాదించుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఆ బాలుడి ప్రతిభ వీడియోను పరిశీలించిన నోబెల్ వరల్డ్ రికార్డ్ నిర్వాహకులు ఈ బుడ్డోడికి ఆన్ లైన్ లో అవార్డును అందించారు. ఆ అవార్డు రావడంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు ఆనందంతో మురిసిపోతున్నారు. ఇంతకు ఆ బుడ్డోడు చేసింది ఏంటి? ఎందుకు ఆ చిన్నారికి నోబెల్ వరల్డ్ రికార్డ్ నిర్వాహకులు అవార్డును ప్రకటించారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఈ ఆర్టికల్ చదవాల్సిందే.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని వైఎస్ఆర్ కడప జిల్లా పొద్దుటూరు పరిధిలోని శాస్త్రినగర్ ప్రాంతం. ఇక్కడే పవన్ కుమార్-సౌమ్య దంపతులు నివాసం ఉంటున్నారు. వీళ్లు గత ఆరు నెలల కిందట ఓ మగ బిడ్డ జన్మనిచ్చారు. కొడుకు పుట్టడంతో ఆ దంపతులు ఎంతో మురిసిపోయారు. ఇక అప్పటి నుంచి ఆ కుమారుడి పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకుని పెంచుకుంటున్నారు. అయితే, ఆ బోడ్డోడికి పండ్లు, జంతువులు, కూరగాయాలు, పక్షులు, వాహనాలు వంటివి చూడగానే గుర్తు పట్టేలా ఆమె తల్లి ట్రైనింగ్ ఇచ్చింది. దీంతో ఆ బుడ్డోడు వాటి ఫొటోలు చూడగానే వాటిని ఠక్కున గుర్తిస్తున్నాడు.

ఇదంతా ఆ బాలుడి తల్లిదండ్రులు వీడియో తీసుకున్నారు. ఇక అదే వీడియోను ఈ నెల 19న నోబెల్ వరల్డ్ రికార్డ్ కు నిర్వాహకులకు పంపించారు. వాళ్లు ఆ వీడియోను నిశితంగా పరిశీలించి ఆ బుడ్డోడి ప్రతిభను గుర్తించారు. అనంతరం నోబెల్ వరల్డ్ రికార్డ్ నిర్వాహకులు ఆన్ లైన్ లో ఈ నెల 29న ఆ బుడ్డోడికి అవార్డును పంపారు. దీంతో ఈ బాలుడి టాలెంట్ కు అంతా ఫిదా అవుతున్నారు. 6 నెలల బాలుడు నోబెల్ వరల్డ్ రికార్డ్ లో చోటు సంపాదించుకోవడంతో వారి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు నోళ్లు తెరుస్తున్నారు. 6 నెలల వయసులోనే నోబెల్ వరల్డ్ రికార్డ్ లో చోటు సంపాదించుకున్న ఈ బుడతడి టాలెంట్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: షాకింగ్ ఘటన: 7 నెలల బాలుడి కడుపులో 2 కిలోల పిండం!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి