Venkateswarlu
Venkateswarlu
సెప్టెంబర్ నెల మొదలైన నాటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పునఃప్రారంభం అయ్యాయి. ఆగస్టు నెలలో రెండు, మూడు సార్లు మాత్రమే పడ్డ వర్షం. ఈ నెలలో దంచి కొడుతోంది. గత ఐదారు రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయం అవుతున్నాయి. ఇక, మెట్రో పాలిటన్ సిటీల్లో వర్షాల కారణంగా జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ కష్టాలు అల్లాడిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో విశాఖపట్నం వాతావరణ శాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది. రానున్న మరో ఐదు రోజులు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఉపరితల ఆవర్తనం ఛత్తీష్‌ఘడ్ మీద కేంద్రీకృతమై ఉందని, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ద్రోణి కారణంగా వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్రల్లో కొన్నిచోట్ల, రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఇక, తెలంగాణలోని సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, ఆదిలాబాద్, కుమురం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. శని, ఆదివారాల్లో పలు జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది. మరి, మరో ఐదు రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అలర్ట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.