iDreamPost

బహుశా.. అంటూ జగన్ చెప్పిందే ..

బహుశా.. అంటూ జగన్ చెప్పిందే ..

మొన్న ముగిసిన అసెంబ్లీ సెషన్ లో చివరి రాజధాని పై జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వివరణ ఇస్తూ బహుశా..రాష్ట్రానికి 3 రాజధానులు రావొచ్చు అన్న మాట నిజమైంది. ఇప్పటికే ఒక నిపుణుల కమిటీ వేశామని ఆ కమిటి తుది నివేదిక వారంలోపు వస్తుందని మొన్న అసెంబ్లీ లో ముఖ్యమంత్రి తెలిపారు.

జగన్ చెప్పిన విధంగానే ఈరోజు ప్రభుత్వానికి జి.యన్ రావు కమిటి తన తుది నివేదిక ను అందజేసింది. రిటైర్డ్ ఐ.ఎ.యస్ అధికారి జి.నాగేశ్వర రావు (జి.యన్ రావు) నేతృత్వంలో గత సెప్టెంబర్ 13 న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అర్బన్ ప్లానింగ్, సమగ్రాభివృద్ది మరియు అమరావతి అంశాల మీద 5 గురు సభ్యులతో కూడిన నిపుణులతో కూడిన ఈ కమిటీ రాష్ట్రం అంతా పర్యటించింది.

జియన్ రావు కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసిన ముఖ్యాంశాలు చూస్తే బహుశా 3 రాజధానులు వస్తాయోమోనంటు అంటూ జగన్ చెప్పిన విధంగానే ,

లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతి లోనే ఉంచాలని, శాసన సభ శాసన మండలి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం రాజ్ భవన్ తో పాటు కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఇక్కడే కొనసాగించాలని..

జగన్ చెప్పిన విధంగానే ఎక్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖపట్టణాన్ని చేసి సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాలు తో పాటు అదనంగా శీతాకాల లేద వేసవి కాలం లో స్వల్ప కాల అసెంబ్లీ సమావేశాలు కుడా నిర్వహించుకొవచ్చని..

జగన్ చెప్పిన విధంగానే జ్యుడిసియల్ క్యాపిటల్ గా కర్నూల్ ని చేసి హైకోర్టు ప్రధాన బెంచ్ కర్నూల్ లో నెలకొల్పి అదనంగా అమరావతి లో ఒక హైకోర్టు బెంచు విశాఖ పట్నంలో ఒక బెంచ్ నెలకొల్పాలని సూచించింది.

ఈ కమిటి అదనంగా రాష్ట్రంలో 4 ప్రాంతీయ మండళ్లు ఏర్పాటు చెయ్యాలని సూచించింది. ప్రధానంగా రాయలసీమ 4 జిల్లాలతో కూడిన రాయలసీమ మండలి, నెల్లూరు ప్రకాశం గుంటూరు కృష్ణా జిల్లాల తో కలిపి దక్షిణ కొస్తా ఒక మండలిగా ఉభయ గోదావరి జిల్లాలతో కూడిన ఒక మండలి, ఉత్తరాంధ్ర 3 జిల్లాలతో ఒక అభ్వృద్ది మండలి ఏర్పాటు చెయ్యాలని సూచించింది .

దీనితో పాటు ఈ కమిటి చాలా వరకు శివరామ కృష్ణ కమిటీ ప్రభుత్వానికి నివేదించిన అంశాలతో ఏకీభవిస్తు వాటిలో చాలావరకు తమ తుది నివేదకలొ పొందుపరిచింది. అంతేకాక వరద ముంపు ఉన్న ప్రాంతాల్లో పెద్ద పెద్ద నగరాలు, జనావాస ప్రాంతాలు ఏర్పాటు చెయ్యడం చలా ప్రమాదకరం అని హెచ్చరించింది.

ఈ కమిటి లో జియన్ రావు గారితో పాటు సభ్యులుగా న్యూ డిల్లీ కి చెందిన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చరింగ్ కి చెందిన ప్రొఫెసర్ మహావీర్, అంజలి మొహాన్ (అర్బన్ అండ్ రిజినల్ ప్లానర్), శివానంద స్వామి ( CEPT, అహ్మదాబాద్),
కె.టి రవీంద్రన్ (రిటైర్డ్ ప్రొఫెసర్, డిల్లీ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్), కె.వి అరుణా చలం(రిటైర్డ్ చీఫ్ అర్బన్ ప్లానర్, చెన్నై)లు పని చేశారు.

ఈ నిపుణుల కమిటి 6 వారాలు పాటు రాష్ట్రమంతా పర్యటించి పూర్తి స్థాయి నివేదిక ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. మరి ఈ కమిటి చేసిన సిఫార్సులను జగన్ ప్రభుత్వం ఏ విధంగా అమలు చెస్తారోనని ఇప్పుడు మీడియాతొ పాటు ప్రజలు ప్రభుత్వ నిర్ణయం కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే ప్రభుత్వం నుండి పూర్తిస్థాయి స్పష్టత రావాలంటే మాత్రం మరికొద్ది రోజులు పట్టొచ్చు.

మరి జగన్ ప్రభుత్వం జియన్ రావు కమిటి నివేదికని పూర్తి స్థాయిలో అమలు చేస్తుందా లేదా ఎమైనా మార్పులు చేర్పులు చెస్తుందో చూడాలి. ప్రభుత్వ ఉద్దేశం ఎలా ఉన్నప్పటికి దీనిపై ఒక్క గుంటూరు కృష్ణా తప్ప మిగతా తప్ప మిగతా అన్ని ప్రాంతాల ప్రజలకి ఈ కమిటి సిఫార్సులు పూర్తిగా అమోదయోగ్యంగానే ఉన్నాయి. ఈ కమిటి సిఫార్సుల పట్ల పార్టిలకతీతంగా ఆయా ప్రాంతాల ప్రజలు రాజకియ నాయకులు ఈ కమిటి సిఫార్సులను స్వాగతిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి