iDreamPost

IPL మొదలై నేటికి 17 ఏళ్లు! ఆ రోజే మెక్‌కల్లమ్ అనే విధ్వంసం RCBని చీల్చి చెండాడింది!

  • Published Apr 18, 2024 | 4:25 PMUpdated Apr 18, 2024 | 4:25 PM

IPL, Brendon Mccullum; ప్రస్తుతం ఐపీఎల్‌లో చాలా భారీ భారీ ఇన్నింగ్స్‌లు నమోదు అవుతున్నాయి. కానీ, తొలి మ్యాచ్‌లో జరిగిన ఓ విధ్వంసం గురించి తెలుసుకుంటే.. ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఆర్సీబీ వెన్నులో వణుకుపుట్టించిన ఆ మ్యాచ్‌ గురించి, ఆ ఆటగాడి గురించి.. అసలు ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌ గురించి.. ఐపీఎల్‌కు 17 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా తెలుసుకుందాం..

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌.. ప్రపంచ క్రికెట్‌ గతి మార్చేసిన లీగ్‌. 17 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు.. అంటే 2008 ఏప్రిల్‌ 18న పురుడుపోసుకుంది. అప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ లాంటి దేశాల్లో ఫ్రాంచైజ్‌ క్రికెట్‌ కొనసాగుతున్న తరుణం, ఇండియాలో ఇండియన్ క్రికెట్‌ లీగ్‌(ఐసీఎల్‌) ప్రారంభమైన తర్వాత.. బీసీసీఐ ఐపీఎల్‌ను ప్రారంభించింది. క్యాష్‌ రిచ్‌ లీగ్‌గా ఆటగాళ్లపై కోట్ల వర్షం కురిపించడమే కాకుండా ఎంతో మంది యువ క్రికెటర్లను ప్రపంచానికి పరిచయం చేసింది. ఎన్నో వివాదాలు, వినోదాలు, క్రికెట్‌ అద్భుతాలు అంతా కలిపి ఐపీఎల్‌. నేటితో 17 ఏళ్ల పూర్తి చేసుకున్న ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌తోనే ప్రపంచానికి ఎలాంటి లీగ్‌ పరిచయం అయిందో.. ప్రపంచ క్రికెట్‌ను ఏలేందుకు ఒక లీగ్‌ రాబోతుందని చాటి చెప్పిన మ్యాచ్‌ అది.

ఐపీఎల్‌ ఆరంభ మ్యాచ్‌ కావడంతో అందరి దృష్టి ఆ మ్యాచ్‌పై పడింది. 2008 ఏప్రిల్‌ 18న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో.. సౌరవ్‌ గంగూలీ కెప్టెన్సీలోని కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌, రాహుల్‌ ద్రవిడ్‌ కెప్టెన్సీలోని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్‌ మొదలైంది. కేకేఆర్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. జహీర్‌ ఖాన్‌, ప్రవీన్‌ కుమార్‌, కల్లీస్‌, కామెరున్‌ వైట్‌ లాంటి హేమాహేమీ బౌలర్లు ఉన్న ఆర్సీబీ బౌలింగ్‌ లైనప్‌ను తొలి మ్యాచ్‌లోనే కేకేఆర్‌ ఓపెనర్‌ బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ చీల్చిచెండాడు. ఐపీఎల్‌ అంటే ఇలా ఉంటుందా అని ప్రపంచ మొత్తం బిత్తరపోయేలా విధ్వంస సృష్టించాడు. కేవలం 78 బంతుల్లో 10 ఫోర్లు, 13 సిక్సులతో ఏకంగా 158 పరుగులు చేసి.. ఐపీఎల్‌కు అద్భుతమైన స్టార్ట్‌ ఇచ్చాడు. ఆ ఒక్క ఇన్నింగ్స్‌తో ఐపీఎల్‌కు తొలి మ్యాచ్‌ నుంచే తిరుగులేని క్రేజ్‌ను తెచ్చిపెట్టింది.

అయితే.. ఆ రోజు మెక్‌కల్లమ్‌ సృష్టించిన విధ్వంసానికి బలమైంది మాత్రం ఆర్సీబీనే. 222 పరుగులు సమర్పించుకున్న ఆర్సీబీ.. బ్యాటింగ్‌లో కేవలం 82 పరుగులకే కుప్పకూలింది. అప్పటి నుంచి ఇప్పటి ఆర్సీబీకి ఆ భయం అలాగే పట్టుకుంది. ఇప్పటికీ ఆర్సీబీ కప్పు కొట్టేలేకపోతుందంటే.. అందుకే లీగ్‌ ఆరంభ మ్యాచ్‌లో మెక్‌కల్లమ్‌ ఇచ్చిన షాకే కారణమనే చాలా మంది క్రికెట్‌ అభిమానులు నమ్ముతుంటారు. అయితే.. ఐపీఎల్‌ లాంటి లీగ్‌కు ఎలాంటి స్టార్ట్‌ అయితే కావాలో అలాంటి స్టార్ట్‌ను అందించిన ఘనత మాత్రం మెక్‌కల్లమ్‌కే దక్కుతుంది. అతను ఆడిన ఇన్నింగ్స్‌తో ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఇండియా వైపు తిరిగి చూసింది. ప్రతి ఏడాది రెండు నెలలు ఐపీఎల్‌ కోసం ఇండియాకు క్యూ కట్టేలా చేసిన విధ్వంసం అది. మరి ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌లో మెక్‌కల్లమ్‌ సృష్టించిన కల్లోలం గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి