iDreamPost
android-app
ios-app

వీడియో: ఇన్ స్టాగ్రామ్ రీల్స్ మోజులో పడి ప్రాణం తీసుకున్న యువకుడు!

వీడియో: ఇన్ స్టాగ్రామ్ రీల్స్ మోజులో పడి ప్రాణం తీసుకున్న యువకుడు!

సోషల్ మీడియా యుగం అందుబాటులోకి రావడంతో నేటి కాలం యువత అందులోనే కాలక్షేపం చేస్తున్నారు. మరి కొందరు మాత్రం.. టిక్ టాక్ వీడియోలు చేస్తూ రాత్రికి రాత్రే ఫేమస్ అయిన వాళ్లు కూడా లేకపోలేదు. ఇక మన దేశంలో టిక్ టాక్ బ్యాన్ కావడంతో ఇప్పుడు అందరూ ఇన్ స్టా గ్రామ్ రీల్స్ చేస్తూ ఫేమస్ అవ్వాలని భావిస్తున్నారు. అయితే అచ్చం ఇలాగే రీల్స్ మోజులో పడి ఓ 14 ఏళ్ల బాలుడు అందరూ చూస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియలో వైరల్ గా మారుతోంది.

కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ బారాబంకి ప్రాంతానికి చెందిన ఓ 14 ఏళ్ల బాలుడు ఇన్ స్టా గ్రామ్ లో రీల్స్ చేస్తుండేవాడు. అయితే ఇతడు ఇటీవల ఫర్మాన్ రైల్వే ట్రాక్‌పై రీల్ చేయాలని అనుకున్నాడు. తాను అనుకున్నట్లే స్నేహితుడిని తీసుకుని అక్కడికి వెళ్లాడు. ఇక రైలు వచ్చే సమయానికి ఆ బాలుడు రీల్ చేయబోతుండగా.. అదే రైలు ఢీకొని అందరూ చూస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడు. ఈ సీన్ చూసి అతడి స్నేహితుడు షాక్ గురయ్యాడు.

ఇదే విషయాన్ని అతడు స్నేహితుడి తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. దీంతో హుటాహటిన ఘటనా స్థలానికి చేరుకుని కుమారుడిని చూసి గుండెలు పగిలేలా ఏడ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. రీల్స్ మోజులో పడి ఇలాంటి పిచ్చి పనులు మానుకోవాలంటూ కొందరు హెచ్చరిస్తున్నారు.