iDreamPost

Pakistan: పెళ్లి చేయమంటూ 13 ఏళ్ల బాలుడి డిమాండ్‌.. వైరల్‌ అవుతోన్న ఫొటోలు

  • Published Feb 24, 2024 | 12:33 PMUpdated Feb 24, 2024 | 12:33 PM

పాకిస్తాన్ లో జరిగిన ఓ విచిత్ర సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అక్కడ 13 ఏళ్ల బాలుడికి .. 12 ఏళ్ళ బాలికకు నిశ్చితార్థం జరిగింది. అది కూడా తల్లి తండ్రుల సమక్షంలో..

పాకిస్తాన్ లో జరిగిన ఓ విచిత్ర సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అక్కడ 13 ఏళ్ల బాలుడికి .. 12 ఏళ్ళ బాలికకు నిశ్చితార్థం జరిగింది. అది కూడా తల్లి తండ్రుల సమక్షంలో..

  • Published Feb 24, 2024 | 12:33 PMUpdated Feb 24, 2024 | 12:33 PM
Pakistan: పెళ్లి చేయమంటూ 13 ఏళ్ల బాలుడి డిమాండ్‌.. వైరల్‌ అవుతోన్న ఫొటోలు

ఒకప్పుడు బాల్య వివాహాల పేరిట 13, 14 ఏళ్ల వయసులోనే అందరికి పెళ్లిళ్లు చేసేవారు. కానీ, మారుతున్న కాలంతో వివాహ సంప్రదాయాలలో కూడా అనేక మార్పులు చోటు చేసుకుంటూ వచ్చాయి. వాటి అన్నిటి గురించి కూడా ఇప్పుడు అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు ఎవరైనా వివాహం చేసుకోవాలి అంటే.. వారికీ నిర్దిష్టమైన వయస్సు పరిమితి ఉంటుంది. కానీ, ఇప్పుడు పాకిస్తాన్ లో నిశ్చితార్థం చేసుకున్న ఓ జంట వయస్సు చెప్తే మాత్రం అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. పాకిస్తాన్ లో ఇప్పుడు ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. ఒక 13ఏళ్ల బాలుడు తనకు పెళ్లి చేస్తే కానీ, చదువుకోను అని బెదిరించడంతో.. ఆ బాలుడి తల్లితండ్రులు అతనికి ఓ అమ్మాయితో నిశ్చితార్థం చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సామజిక మాధ్యమాలలో షికార్లు చేస్తున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

సాధారణంగా 13ఏళ్ల బాలుడు చదువుకోనని మారం చేస్తే.. తల్లి తండ్రులు భయపెట్టో.. బుజ్జగించో వారిని మార్చడానికి ప్రయత్నిస్తారు. కానీ, పాకిస్తాన్ కు చెందిన ఓ బాలుడు తల్లి తండ్రులు మాత్రం.. వారి కొడుకు పెళ్లి చేస్తే కానీ, చదువుకోను అని మారం చేయడంతో.. 12 ఏళ్ల బాలికకు , 13 ఏళ్ల వారి కుమారుడికి వివాహం చేయాలని నిశ్చయించి.. నిశ్చితార్థం జరిపించారు. అయితే, ఆ నిశ్చితార్ధ వేడుకలో ఇరువురి పిల్లల తల్లితండ్రులను ప్రశ్నించగా.. వారి నిర్ణయం సరైనదే అని వాపోయారు. పైగా వారికీ కూడా అంతే చిన్న వయసులో వివాహం అయిందని. తమ పిల్లలు ఇప్పుడు ఈ వయసులో వివాహం చేసుకోవడంలో ఎటువంటి తప్పు లేదని.. స్వయంగా బాలుడి తల్లి తండ్రులే వంత పలకడంతో.. అందరు ఆశ్చర్య పోయారు. ప్రస్తుతం ఆ పిల్లల నిశ్చితార్దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇక ఆ ఫోటోలను చూసిన నెటిజన్లు.. వారిపై విమర్శలు కురిపిస్తున్నారు. ఇందుకే దేశం నాశనం అయిపోతుందని.. చదువుకోవాల్సిన వయస్సులో పెళ్లిళ్లు చేయడం సరైన పద్దతి కాదని.. వారి తల్లి తండ్రులు చేసిన పనికి.. వారిపై కేసు నమోదు చేయాలనీ.. ఇలా రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే, అసలు పాకిస్తాన్ లో పెళ్లి చేసుకోవడానికి.. కనీస వయస్సు.. మగవారికి 18, ఆడవారికి 16. కనీసం ఈ వయోపరిమితి కూడా దాటకుండానే .. ఈ నియమాలకు విరుద్ధంగా వారు ఆ పిల్లల నిశ్చితార్దాన్ని జరిపించారు. దీనితో సోషల్ మీడియాలో వారిపై విమర్శల వర్షం కురుస్తోంది. ఏదేమైనా చిన్న వయసులో పెళ్లిళ్లు చేయడం అనేది చట్టానికి విరుద్ధమైన పని. మరి, పాకిస్థాన్ లో చోటు చేసుకున్న ఈ విచిత్ర సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి