iDreamPost

బ్రిటన్‌ పార్లమెంట్‌ ఎన్నికల బరిలో నిలిచిన తెలుగోడు!

పలు దేశ రాజకీయాల్లోనూ తెలుగు వారు..తమ ప్రత్యేకను చాటుకుంటున్నారు. తాజాగా మరో తెలుగు వ్యక్తి విదేశాల్లో సత్తాచాటారు. బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల బరిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి నిలిచారు.

పలు దేశ రాజకీయాల్లోనూ తెలుగు వారు..తమ ప్రత్యేకను చాటుకుంటున్నారు. తాజాగా మరో తెలుగు వ్యక్తి విదేశాల్లో సత్తాచాటారు. బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల బరిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి నిలిచారు.

బ్రిటన్‌ పార్లమెంట్‌ ఎన్నికల బరిలో నిలిచిన తెలుగోడు!

ప్రపంచం వ్యాప్తంగా తెలుగులో ఉన్నారు. అన్ని దేశాల్లో తెలుగువారు కనిపిస్తున్నే ఉంటారు. అంతేకాక విదేశాల్లో తమదైన ప్రతిభతో తెలుగు ఖ్యాతిని పెంచుతుంటారు. ఇప్పటికే అనేక మంది తెలుగు వారు వివిధ సంస్థల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలానే పలు దేశ రాజకీయాల్లోనూ తెలుగు వారు..తమ ప్రత్యేకను చాటుకుంటున్నారు. తాజాగా మరో తెలుగు వ్యక్తి విదేశాల్లో సత్తాచాటారు. బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల బరిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి నిలిచారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

బ్రిటన్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఉదరు నాగరాజు నిలిచారు. బ్రిటన్ లోని ప్రధాన పార్టీల్లో ఒకటైనా లేబర్‌ పార్టీ నుంచి నాగరాజు ఎన్నికల్లో  పోటీ చేస్తున్నారు. నార్త్‌ బెడ్‌ ఫోర్డ్‌ షైర్‌ లేబర్‌ పార్టీ తమ పార్లమెంటరీ అభ్యర్థిగా నాగరాజు పేరు ప్రకటించింది. నార్త్‌ బెడ్‌ ఫోర్డ్‌ షైర్‌ బౌండరీ కమిషన్‌ సూచనతో కొత్తగా ఏర్పడ్డ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నికల బరిలో నిలిచారు.

ఎలక్టో రల్‌ కాల్కులస్‌ ప్రకారం.. ఆ నియోజకవర్గంలో లేబర్‌ పార్టీ గెలవబోతుందన్న అంచనాలు ఉన్నాయి. మధ్యతరగతి కుటుంబం నుంచి బ్రిటన్ వెళ్లిన నాగరాజు.. అక్కడ అంచలంచలుగా ఎదిగారు. ఇప్పుడు యూకే బరిలో నాగరాజు దిగారు. శనిగరం గ్రామానికి చెందిన హనుమంతరావు, నిర్మలాదేవి దంపతులకు ఉదరు నాగరాజు జన్మించారు. నాగరాజుకు చిన్నప్పటి నుంచే కష్టపడే తత్వం కలిగి ఉన్నారు. అలానే చదువుల్లో కూడా ఎప్పుడు ముందు ఉన్నారు. అలా కష్టపడే తత్వం ఉన్న నాగరాజు ఉదరు అంచెలంచలుగా ఎదిగారు.

బ్రిటన్‌లోనియూనివర్సిటీ కాలేజీ అఫ్‌ లండన్‌లో అడ్మినిస్ట్రేషన్ లో పీజీ చేశారు. ఐ పాలసీ ల్యాబ్స్‌ అనే థింక్‌ట్యాంక్‌ను నాగరాజు  స్థాపించారు. అంతర్జాతీయ వక్తగా, రైటర్ గా మంచి పేరు  పొందారు. అక్కడ పొలిటికల్  అంశాలపై దశాబ్దకాలంగా ప్రచారం చేయడంతో అక్కడి ప్రజల్లో పట్టు సాధించారు. స్థానిక పరిస్థితులను బట్టి ఉదరు నాగ రాజు కూడా బ్రిటన్‌ పార్ల మెంట్‌ ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి