Dharani
నడి రోడ్డు మీద దేశ ప్రధాన మంత్రిపై ఓ దుండగుడు కాల్పులకు తెగ బడ్డాడు. ఈ దాడిలో ప్రధాని కడుపులోకి బుల్లెట్ దూసుకుపోయింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఆ వివారలు..
నడి రోడ్డు మీద దేశ ప్రధాన మంత్రిపై ఓ దుండగుడు కాల్పులకు తెగ బడ్డాడు. ఈ దాడిలో ప్రధాని కడుపులోకి బుల్లెట్ దూసుకుపోయింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఆ వివారలు..
Dharani
నేటి కాలంలో నేరాలు దారుణంగా పెరుగుతున్నాయి. చిన్నాచితకా కారణాలకే దారుణాలకు పాల్పడుతున్న వారి సంఖ్య బాగా పెరుగుతోంది. సామాన్యుల మీదనే కాక సెలబ్రిటీలు.. ఏకంగా దేశ ప్రధానుల మీద కూడా దాడులకు తెగ బడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా దారుణం చోటు చేసుకుంది. దేశ ప్రధానిపై కాల్పులు జరిపాడు ఓ దుండగుడు. ఈ ఘటనలో ఓ బుల్లెట్ ఆయన కడుపులోకి దూసుకెళ్లింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని.. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారని అధికారులు తెలిపారు. ప్రధానిపై కాల్పులకు తెగ బడిన దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. దాడికి గల కారణాలు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు.
ఈఘటన స్లోవేకియాలో జరిగింది. ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో మీద కాల్పులకు తెగ బడ్డాడు ఓ దుండగుడు. ఈ దాడిలో ప్రధాని కడుపులోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ప్రస్తుతం ఆయన చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇక ప్రధాని కేబినెట్ భేటీలో పాల్గొని బయటికి వస్తుండగా.. ఈ దారుణం చోటు చేసుకుంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. రాబర్డ్‌ని ఆస్పత్రికి తరలించారు. అంతేకాక పీఎంపై కాల్పులు జరిపిన దుండగుడిని.. భద్రతా సిబ్బంది అక్కడే అదుపులోకి తీసుకున్నారు. దుండగుడు జరిపిన కాల్పుల ధాటికి.. ఓ బుల్లెట్ ప్రధాని కడుపులోకి దూసుకెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రాబర్ట్ ఫికో పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
బుధవారం హాండ్లోవాలో నిర్వహించిన మంత్రి వర్గ సమావేశానికి హాజరైన రాబర్ట్ ఫికో.. తిరిగివస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. మాటు వేసిన దుండగుడు ప్రధాని బయటకు రాగానే.. వరుసగా కాల్పులు జరిపాడు. ఈ క్రమంలో ఓ బుల్లెట్ రాబర్ట్ ఫికో కడుపులోకి దూసుకుపోయింది. ఈ ఘటనను స్లోవేకియా అధ్యక్షుడు జుజానా కాపుటోవా తీవ్రంగా ఖండించారు. రాబర్ట్ ఫికో త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. స్లోవేకియా రాజధాని బ్రెటిస్లావాకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాండ్లోవా నగరంలోని హౌస్ ఆఫ్ కల్చర్ భవనం బయట ఈ సంఘటన చోటు చేసుకోవడం గమనార్హం.
ప్రధాని రాబర్ట్ ఫికోపై కాల్పులు జరిపినట్లు తెలియడంతో.. వెంటనే స్పందించిన అధికారులు హెలికాప్టర్‌ను పంపించి ఆయనను ఆస్పత్రికి తరలించారు. హాండ్లోవాలోని ఆస్పత్రికి తీసుకెళ్లిన సమయంలో రాబర్ట్ ఫికో స్పృహలోనే ఉన్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. వరుసగా కాల్పులు జరపడం తాను చూసినట్లు ఓ ప్రత్యక్ష సాక్షి వెల్లడించాడు. ప్రస్తుతం అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంద.ఇ
SLOVAKIA
Prime Minister Robert Fico has been shot in an assassination attempt.
Fico recently said that he considers himself to be Catholic. pic.twitter.com/3wJyXzMdFp
— Catholic Arena (@CatholicArena) May 15, 2024