iDreamPost

’12th Fail’ రియల్ హీరో ఇతనే.. ఫెయిల్యూర్ నుండి IPS ఎలా అయ్యారంటే..?

మనుషులపై ప్రభావం చూపే మాధ్యమం సినిమా. మంచైనా, చెడైనా. ఎంతో మంది నిజ జీవిత గాథలను, యదార్థ సంఘటనలు వెండితెరపైకి తీసుకు వస్తుంది మూవీ. ఇప్పుడు ఓ మూవీ అందరి ప్రశంసలు పొందడంతో పాటు స్ఫూర్తివంతంగా నిలుస్తుంది. అదే 12th ఫెయిల్ అనే సినిమా

మనుషులపై ప్రభావం చూపే మాధ్యమం సినిమా. మంచైనా, చెడైనా. ఎంతో మంది నిజ జీవిత గాథలను, యదార్థ సంఘటనలు వెండితెరపైకి తీసుకు వస్తుంది మూవీ. ఇప్పుడు ఓ మూవీ అందరి ప్రశంసలు పొందడంతో పాటు స్ఫూర్తివంతంగా నిలుస్తుంది. అదే 12th ఫెయిల్ అనే సినిమా

’12th Fail’ రియల్ హీరో ఇతనే.. ఫెయిల్యూర్ నుండి IPS ఎలా అయ్యారంటే..?

నిజ జీవిత కథల ఆధారంగా అనేక సినిమాలు తెరకెక్కాయి. కొన్ని స్ఫూర్తివంతగా నిలుస్తుంటాయి. చర్చించుకునేలా చేస్తాయి. ఇప్పుడు అలాంటి ఓ మూవీ 12th ఫెయిల్. ఒక ఫెయిల్యూర్ స్టూడెంట్ ఐపీఎఎస్‌గా ఎలా మారాడు అనేదే కథ. గత ఏడాది థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ ఇటీవల ఓటీటీలో సందడి చేస్తోంది. మోస్ట్ వాచబుల్ అండ్ ఇన్‌స్పిరేషనల్‌ సినిమాగా నిలిచింది. విధు వినోద్ చోప్రా తెరకెక్కించిన ఈ చిత్రం ప్రశంసలు అందుకుంది. ఈ మూవీలో హీరోగా నటించిన విక్రాంత్ మాస్సే నటనకు ఫిదా అయ్యారు ప్రేక్షకులు. దేశంలోనే అత్యంత టఫెస్ట్ పరీక్షల్లో ఒకటైన యుపీఎస్సీ ప్రవేశ పరీక్షకు సిద్దమవుతున్న లక్షలాది మంది విద్యార్థులు ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ చిత్రం ద్వారా చూపించాడు దర్శకుడు.

పేదరికం నుండి ఐపీఎస్‌గా ఎదిగిన మనోజ్ కుమార్ శర్మ ప్రయాణాన్ని ఈ చిత్రం ద్వారా చూపించారు. అనుగాగ్ పాఠక్ రాసిన నవల నుండి ఈ మూవీని ఆధారంగా తీసుకున్నారు. ఐఏఎస్,ఐపీఎస్, ఐఎఫ్ఎస్ కావాలని చాలా మందికి ఉంటుంది. దీనికి అత్యంత ప్రతిష్టాత్మకమైన, కష్టతరమైన సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. దీనికి కోచింగ్ సెంటర్లు లేనిదే సాధ్యం కాదూ. చంబల్‌లో జీవిత లక్ష్యమంటూ లేని ఓ కుర్రాడు..ఐపీఎస్ అయ్యేందుకు ఎలాంటి పరిణామాలు దారి తీశాయి.. 12th ఫెయిల్ అయిన అతడు ఐపీఎస్ అధికారిగా ఎలా మారాడు. అతడు కోచింగ్ సెంటర్‌లో ప్రేమించిన అమ్మాయి శ్రద్ధా జోషి ఐఆర్ఎస్ అవ్వడం వెనుక ఎంత కృషి చేసింది ఈ మూవీ కథ.

12th fail movie real story couple photos

ఈ మూవీలో మనోజ్ క్యారెక్టర్లతో విక్రాంత్ మాసే నటించగా.. శ్రద్ధా జోషి పాత్రలో మేథా శంకర్ నటించారు. ఇప్పుడు ఈ మూవీ హిట్ కొట్టడంతో.. ఈ రియల్ హీరో ఎవరూ అంటూ నెట్టింట్లో సెర్చ్ చేస్తున్నారు. ఈ జంట ప్రస్తుతం ట్రెండింగ్‌లో నిలుస్తోంది. ఆ రియల్ హీరో మనోజ్ కుమార్ శర్మ వాస్తవ స్టోరీ ఇది. 1977లో మధ్యప్రదేశ్‌లోని బిల్‌గావ్ అనే గ్రామంలో పేద కుటుంబంలో పుట్టాడు మనోజ్ శర్మ. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ.. కడుపు నిండా తినలేని దయనీయ స్థితి. ఇంటికి సరైన కప్పు లేని కుటుంబంలో కష్టాలు, కడగళ్లు చూశాడు మనోజ్. అతడికి ఒక సోదరి, సోదరుడు ఉన్నారు. మనోజ్ చదివినా కూడా అత్తెసరు మార్కులే వచ్చేవి. అతను 12వ తరగతి ఫెయిల్ కావడంతో కష్టాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అయితే ఓ సంఘటన అతడిని ఐపీఎస్ చదవాలని నిర్దేశించేలా చేస్తుంది. అయితే అనుకున్నంత సులువు కాదూ ఐపీఎస్ అయిపోవడం.

అందుకు సివిల్ సర్వీస్ పరీక్షలు రాయాలని తెలుసుకున్నాడు. కోచింగ్ తీసుకోవాల్సి ఉంటుందని తెలిసి ఢిల్లీ బాట పట్టాడు. ఇంటి ఆర్థిక పరిస్థితి తెలిసిన అతడు..తన సంపాదనతోనే ఈ పరీక్షలకు ప్రిపేర్ కావాలనుకున్నాడు. టెంపో డ్రైవర్, లైబ్రరి ఫ్యూన్, ఓ డాగ్ వాకర్ ఇలా వచ్చిన పనిని చేసి.. ఆ డబ్బులతో ప్రిపేర్ అయ్యాడు. లైబర్రీలో ప్యూన్ గా పనిచేస్తున్నప్పుడు ఎంతో మంది జీవిత చరిత్రలు చదివి స్ఫూర్తి పొందాడు. జీవిత సత్యాలు తెలుసుకున్నాడు. ఇక సివిల్ సర్వీసుల్లో మూడు సార్లు విఫలమయ్యాడు. అయినా సరే ఓటమిని అంగీకరించలేదు అతడు. నాల్గవ సారి ఆల్ ఇండియా ర్యాంక్ 121 సాధించాడు. ఇప్పుడు ముంబయి పోలీసు విభాగంలో అదనపు కమిషనర్‌గా పనిచేస్తున్నాడు.

12th fail movie real story couple photos

తనతో పాటు కోచింగ్ సెంటర్‌లో పరిచమైన శ్రద్దా జోషి.. ఐఆర్ఎస్‌గా ఎన్నికైంది. 2005లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కుమారుడు మానస్ శర్మ. కూతురు చియా ఉన్నారు. శ్రద్ధా జోషి శర్మ 1979న జన్మించారు. ఉత్తర ప్రదేశ్‌లోని అల్మోరా (ప్రస్తుతం ఉత్తరాఖండ్) బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి. శ్రద్ధా బాగా చదువుతుంది. తన 12వ బోర్డు పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో 13వ ర్యాంక్‌ను సాధించారు. అంతేకాకుండా ఆయుర్వేద వైద్యం, శస్త్రచికిత్సలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది. ఆమె కొన్నాళ్ల పాటు డాక్టర్‌గా పనిచేశారు. శ్రద్ధ ప్రస్తుతం మహారాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (MTDC), ముంబయి మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి