iDreamPost

రూ.3 వేల జీతం నుండి 250 కోట్ల టర్నోవర్ కంపెనీకి యజమానురాలిగా

మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని నిరూపించింది ఆ మహిళ. కేవలం చదువు, ఉద్యోగంతో సరిపెట్టుకోలేదు ఆమె. వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించి.. పది మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగింది. మూడు వేల రూపాయల జీతం నుండి

మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని నిరూపించింది ఆ మహిళ. కేవలం చదువు, ఉద్యోగంతో సరిపెట్టుకోలేదు ఆమె. వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించి.. పది మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగింది. మూడు వేల రూపాయల జీతం నుండి

రూ.3 వేల జీతం నుండి  250 కోట్ల టర్నోవర్ కంపెనీకి యజమానురాలిగా

‘అనుకుంటే కానిది ఏమున్నది.. మనిషనుకుంటే కానిదీ ఏమున్నది’ అని ప్రముఖ సినీ లిరిసిస్ట్ కులశేఖర్ అనుకున్నట్లుగా.. కొండనైనా పిండి చేయగల సత్తా మనిషి మాత్రమే ఉంది. ‘పట్టుదలతో చేస్తే సమరం.. తప్పుకుండా నీదే విజయం’అవుతుంది. ఇది పురుషుల విషయంలోనే కాదూ స్త్రీలకు వర్తిస్తుంది. ఈ రోజుల్లో చాలా మంది మహిళలు వంటగదికే పరిమితం కావడం లేదు. తమ స్వంత కాళ్లపై తాము నిలబడాలని, కుటుంబానికి ఆసరాగా, చేదోడు వాదోడుగా నిలవాలని భావిస్తున్నారు. అమ్మాయిలు ఉద్యోగాల చేయడమే కాదూ.. వివిధ రంగాల్లో ఉన్నత స్థాయిలకు చేరుకుంటున్నారు. అలాగే అక్కడే ఆగిపోకుండా స్వయం శక్తిగా ఎదగాలన్న ప్రయత్నాలు చేస్తున్నారు. పది మందికి ఉద్యోగాలిచ్చే కంపెనీలను ఏర్పాటు చేసి.. నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

మహిళలు ఉద్యోగాలే కాదూ.. వ్యాపారం చేయగలరు అని నిరూపించిన నారీ మణుల్లో ఒకరు స్నేహా రాకేష్. ఆమె ఒక యువ పారిశ్రామిక వేత్త. మూడు వేల జీతం నుండి మొదలైన ఆమె కెరీర్.. రూ. 250 కోట్ల కంపెనీని స్థాపించే స్థాయికి ఎదిగింది. జీవితంలో ఏదో సాధించాలన్న పట్టుదలతో ఉన్న ఆమె.. అనుకున్న స్థాయికి చేరింది. స్నేహా కంప్యూటర్ సైన్సులో డిప్లొమా చేసి ఉద్యోగంలో చేరింది. ఆమె తొలి జీతం రూ. 3 వేలు. అయితే చదివిన చదువుకు చేస్తున్న ఉద్యోగానికి పొంతన లేకపోవడంతో స్నేహా కాస్త నిరాశకు గురైంది. ఇంగ్లీషు సరిగా రాకపోవడంతో వేరో ఉద్యోగాలకు వెళ్లలేని పరిస్థితి. దీంతో ఆమె ఇంగ్లీషు భాషపై పట్టు సాధించింది. అనంతరం చదువుకుంటూనే.. బిటెక్ పూర్తి చేసింది. ఇవ్వన్నీ కూడా ఊరికనే సాధ్యం కాలేదు. కష్టాల కడలిని ఈదుకుంటూనే ఒడ్డుకు చేరింది.

ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం నుండి వచ్చిన ఆమె.. పట్టుదలతో విజయ సోపానాలను పేర్చుకుంది.  2012 నుండి ఆమె తన వ్యాపారాన్ని మొదలు పెట్టింది. తాను దాచుకున్న డబ్బుతో పాటు కొన్ని బ్యాంకుల నుండి రుణాలను తీసుకుని Akarmaxs Tech Private Limited కంపెనీని స్థాపించింది. ఆమెకు మరికొంత మంది తోడ్పాటును అందించారు. ఈ కంపెనీ సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్, డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్‌తో పాటు మరిన్ని సేవలు అందిస్తూ ఉంటుంది. ఒక్కో మెట్టు ఎక్కుతూ.. ఈ సంస్థ పలు దేశాల్లో తన సేవలను విస్తరించింది. బెంగళూరు, దుబాయ్, సింగపూర్, లండన్ వంటి ప్రధాన నగరాల్లో సేవలు అందిస్తోంది ఈ కంపెనీ. ఈ కంపెనీ తరుఫున సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తోంది స్నేహ. మూడు వేల జీతం తీసుకున్న స్థాయి నుండి రూ. 250 కంపెనీకి యజమానురాలిగా మారడం వెనుక ఆమె కష్టం, కృషి, అకుంఠిత దీక్ష ఉన్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి