iDreamPost

టెన్త్ పాసైన వారికి ఏడాదికి 5 లక్షల జీతం!.. ట్రైనింగ్ ఇచ్చి జాబిస్తున్న కంపెనీ

మీరు మంచి వేతనంతో ఉద్యోగాలు పొందాలనుకుంటే ఇదే మంచి ఛాన్స్. పదోతరగతి పాసైన వారికి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్న కంపెనీ. వెంటనే అప్లై చేసుకోండి. ఏడాదికి 5 లక్షల జీతం అందుకోవచ్చు.

మీరు మంచి వేతనంతో ఉద్యోగాలు పొందాలనుకుంటే ఇదే మంచి ఛాన్స్. పదోతరగతి పాసైన వారికి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్న కంపెనీ. వెంటనే అప్లై చేసుకోండి. ఏడాదికి 5 లక్షల జీతం అందుకోవచ్చు.

టెన్త్ పాసైన వారికి ఏడాదికి 5 లక్షల జీతం!.. ట్రైనింగ్ ఇచ్చి జాబిస్తున్న కంపెనీ

చదువు పూర్తైందంటే చాలు చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతుంటారు. మరికొంత మంది ప్రైవేట్ రంగంలో స్థిరపడేందుకు రెడీ అవుతుంటారు. చదువుకున్న ప్రతి ఒక్కరికీ గవర్నమెంట్ ఉద్యోగం రావడమంటే సాధ్యమయ్యే పనికాదు. ఇటీవల ప్రభుత్వాలు సైతం యువతకు ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపడుతున్నాయి. ఇదే విధంగా ప్రముఖ లాజిస్టిక్స్ సంస్థ అయిన ఢిల్లీవెరీ సంస్థ నిరుద్యోగులకు ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు సిద్ధమవుతోంది. టెన్త్ క్లాస్ పాసైతే చాలు ఢిల్లీవెరీ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌తో హామీతో కూడిన ఉపాధిని పొందొచ్చు. అంతేకాదు ఏడాదికి రూ. 5 లక్షల జీతం అందుకోవచ్చు.

ఇందులో ఎలా చేరాలంటే?

ఢిల్లీవెరీ సంస్థ పదో తరగతి పాసైన వారికి మూడు వారాలు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. పది అర్హత ఉండి 21 నుండి 32 సంవత్సరాల మధ్య వయస్సు ఉండి, ఇంగ్లీష్, గణితంపై పట్టు ఉంటే ఈ అవకాశం అస్సలు వదులుకోవద్దు. ఢిల్లీవెరీ సంస్థ స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం ద్వారా మీరు ఉద్యోగం పొంది లైఫ్ లో స్థిరపడడానికి ఇది గొప్ప అవకాశం. టీమ్ లీడ్, అసిస్టెంట్ టీమ్ లీడ్, మేనేజర్ వంటి ఉద్యోగాలను కల్పిస్తారు. దేశ వ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది ఢిల్లివేరీ సంస్థ. ఈ ఏడాదికి సంబంధించి జూన్ 3 నుంచి ట్రైనింగ్ స్టార్ట్ అవబోతోంది. ఛండీగడ్, చెన్నై, ముంబై, పాట్నాలో శిక్షణ ఇవ్వనున్నారు. ట్రైనింగ్ అనంతరం ఉద్యోగంలో చేరే వారికి ఏడాదికి 2.5 నుంచి 5 లక్షల వరకు జీతం అందుకోవచ్చు.

ఢిల్లివేరి సంస్థ అందించే శిక్షణ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోదలిచిన వారు మే 03 2024 వరకు చేసుకోవచ్చు. రిజస్ట్రేషన్ ఫీజు 399 చెల్లించాల్సి ఉంటుంది. 03 జూన్ నుంచి 22 జూన్ వరకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ముందుగా అప్లై చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆన్ లైన్ పరీక్ష , సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహించి ఉద్యోగం కల్పించనుంది. మరి మీరు కూడా ఢిల్లీవేరి సంస్థ అందించే శిక్షణ ద్వారా ఉద్యోగం పొందాలనుకుంటే https://www.delhivery.com/ను సందర్శించి వెంటనే అప్లై చేసుకోండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి