iDreamPost
android-app
ios-app

జగన్ బద్దలు కొట్టాల్సిన 10 స్థానాలు! 175 కావాలంటే ఇవే మెయిన్!

జగన్ బద్దలు కొట్టాల్సిన 10 స్థానాలు! 175 కావాలంటే ఇవే మెయిన్!

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వాతావరణం ప్రారంభమైంది. మరికొద్ది నెలల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నిక షెడ్యూల్ విడుదల కాక ముందే అధికార వైసీపీతో సహా అన్ని పార్టీలు  ఎలక్షన్ మూడ్ లోకి వెళ్లాయి. ముఖ్యంగా అధికార వైసీపీ అయితే మిగిలిన పార్టీల కంటే ముందుగానే వచ్చే ఎన్నికల సిద్ధమతుంది. 175 స్థానాల్లో గెలుపు లక్ష్యంగా వైసీపీ వ్యూహాలు రచిస్తుంది. క్షేత్ర స్థాయిలో కూడ వైసీపీకి అనుకూల పవనాలే వీస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవలే పార్టీ నేతలతో సీఎం జగన్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి కీలక సూచనలు చేశారు. అయితే 175 స్థానాల్లో వైసీపీ గెలిచే అవకాశం ఉన్నప్పటికి ఓ 10 నియోజకవర్గాల మీద ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఆ నియోజవర్గాల్లో వైసీపీ జెండా ఎగిరితే.. 175 స్థానాలు వైసీపీ ఖాతాల్లోనే అనే భావనలో ఆ పార్టీ పెద్దలు ఉన్నట్లు సమాచారం. మరి.. ఆ 10 నియోజక వర్గాలు ఏమిటి?. ఆ వివరాలు తెలుసుకుందాం..

ఆంధ్రప్రదేశ్ లో కొన్ని అసెంబ్లీ స్థానాల్లో ఏళ్లుగా టీడీపీనే విజయం సాధిస్తుంది. అలాంటి స్థానాలపై వైసీపీ  ప్రధానంగా ఫోకస్ చేసింది. వైఎస్సాఆర్ సీపీ ఫోకస్ చేసిన  అసెంబ్లీ స్థానాల్లో కుప్పం ప్రధానమైనది. ఇక్కడ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. చాలా ఏళ్లుగా ఇక్కడ టీడీపీ జెండానే ఎగురుతుంది. 2019 ఎన్నికల్లో చంద్రబాబు చాలా తక్కువ మోజార్టీతోనే గెలుపొందారు. ఇదే వైసీపీ నేతల్లో వైనాట్ 175 అనే నినాదానికి పునాది వేసింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైన కుప్పంలో వైసీపీ జెండా ఎగరాలని  ఆ పార్టీ అధిష్టానం భావిస్తుంది. అందుకు తగినట్లే స్థానిక, మున్సిపల్ ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇదే ఉత్సాహంతో 2024లో కుప్పంలో టీడీపీని  ఓడించాలని వైసీపీ గట్టిగా ఉంది.

ఇలానే హిందూపుర్ లోనూ వైసీపీ గెలవాలని చూస్తుంది. ఇక్కడ కూడా చాలా ఏళ్లుగా టీడీపీనే గెలుస్తుంది. ఈ సారి ఎలాగైన వైసీపీ జెండా ఎగరాలని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది. అందులో భాగంగానే ఇటీవలే హిందుపూర్ కి కొత్త ఇన్ ఛార్జీన్ ని మార్చారు. అలానే శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి, ఇచ్చాపురం స్థానాలు కూడా టీడీపీ బలమైన స్థానాలు. ఇక్కడ చాలా ఏళ్లుగా  టీడీపీనే విజయం సాధిస్తూ వచ్చింది. అయితే టెక్కలిలో అచ్చెన్నాయుడిని ఢీ కొట్టేందుకు దువ్వాడ శ్రీనివాస్ సిద్ధమయ్యారు. ఈ సారి ఎలాగైన అచ్చెన్నాయుడిని ఓడిస్తానని ఆయన శపథం చేశారు. అలానే ఇచ్చాపురంపై  కూడా వైసీపీ ఫోకస్ చేసింది.

మాజీ హోం మంత్రి చిన్నరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురంపై కూడా వైసీపీ దృష్టి సారించింది. ఇక్కడ కూడా ఇప్పటి వరకు వైసీపీ జెండా ఎగరలేదు. చాలా ఏళ్లుగా మండపేట, రాజమండ్రి గ్రామీణ నియోజకవర్గంలో సైతం వైసీపీ గెలుపు రుచి ఎరుగలేదు. దీంతో ఈ రెండు స్థానాల్లో కూడా కచ్చితంగా గెలిచేందుకు వైసీపీ వ్యూహాలు రచిస్తుంది. గన్నవరంలో కూడా ఇప్పటి వరకు వైసీపీ విజయం సాధించాలేదు. అయితే ఇటీవలే టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన వల్లభనేని వంశీతో ఈ సారి విజయం ఖాయం అవతుందని పొలిటికల్ కామెంట్స్ వినిపిస్తోన్నాయి.

అలానే గుంటూరు జిల్లాలోని రేపల్లె, ప్రకాశం జిల్లాలోని పర్చూరులో కూడా పార్టీ ఏర్పడిన ఇన్నేళ్లలో ఒక్కసారి కూడ విజయం సాధించలేదు. పర్చూరులో విజయం సాధించేందుకు చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ను కు బాధ్యతలు అప్పగించింది.  వీటితో పాటు విశాఖపట్నంలోని  నాలుగు నియోజకవర్గాల్లో కూడా వైసీపీ విజయం సాధించలేదు. ఇక్కడ విజయం సాధిస్తే.. మిగిలిన నియోజకవర్గాల్లో విజయం నల్లేరు మీద నడకేనని వైసీపీ అధిష్టానం భావిస్తుంది.  మరి.. ఈ పది నియోజవర్గాల్లో విజయం సాధిస్తే.. వైసీపీ 175 గెలవడం గ్యారెంటీ అని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి