iDreamPost

పిల్లల కోసం రెండో పెళ్లి.. నిండు గర్భవతి అని కూడా చూడకుండా..

తనను ఎందుకు సరిగా పట్టించుకోవటం లేదని ఆ భార్య.. భర్తను నిలదీయటమే పాపంగా మారిపోయింది. అలా నిలదీసినందుకు నిండు గర్భవతి అని కూడా చూడకుండా దారుణానికి ఒడిగట్టాడు.

తనను ఎందుకు సరిగా పట్టించుకోవటం లేదని ఆ భార్య.. భర్తను నిలదీయటమే పాపంగా మారిపోయింది. అలా నిలదీసినందుకు నిండు గర్భవతి అని కూడా చూడకుండా దారుణానికి ఒడిగట్టాడు.

పిల్లల కోసం రెండో పెళ్లి.. నిండు గర్భవతి అని కూడా చూడకుండా..

మనుషుల్లో రోజు రోజుకు నేర ప్రవృత్తి పెరిగిపోతోంది. కొంతమంది ఏది మంచి ఏది చెడు అన్న సంగతి కూడా మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. దారుణమైన పనులు చేస్తున్నారు. తాజాగా, ఓ వ్యక్తి రెండో భార్య తనను ఇబ్బంది పెడుతోందని దారుణానికి పాల్పడ్డాడు. నిండు గర్భవతని కూడా చూడకుండా హత్య చేశాడు. ఈ దారుణ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉమ్మడి విజయ నగరం జిల్లా బాడంగి మండలం కోటిపల్లికి చెందిన రామారావు అనే వ్యక్తికి 2019కు ముందు ఓ పెళ్లి అయింది.

మొదటి భార్య నుంచి సంతానం కలగకపోవటంతో రామారావు రెండో పెళ్లి చేసుకున్నాడు. 2019లో అన్నపూర్ణ అనే యువతిని వివాహమాడాడు. వీరిద్దరికీ ఓ కూతురు పుట్టింది. ఆ పాపకు మౌనిక అని పేరు పెట్టారు. అయితే, పెళ్లి అయిన కొంత కాలం రామారావు, మౌనికతో బాగా ఉన్నాడు. తర్వాతి నుంచి పట్టించుకోవటం మానేశాడు. మొదటి భార్యను తన సొంత ఇంట్లో ఉంచాడు. రెండో భార్యను అద్దె ఇంట్లో ఉంచాడు. మౌనిక పుట్టిన తర్వాత సరిగా పట్టించుకోవటమే మానేశాడు.

దీంతో మౌనిక భర్తను నిలదీస్తూ వస్తోంది. ఎందుకు వేరుగా చూస్తున్నావంటూ గొడవ పడేది. తరచుగా ఇద్దరి మధ్యా ఈ విషయంలో వివాదాలు తలెత్తేవి. అన్నపూర్ణతో గొడవలు ఎక్కువ కావటంతో రామారావు విసుగుచెందాడు. ఎలాగైనా ఆమె అడ్డు తొలగించుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఆమె కడుపుతో ఉందని తెలిసి కూడా చంపటానికి ప్లాన్‌ చేశాడు. మర్డర్‌ డేట్‌, టైం ఫిక్స్‌ చేసుకున్నాడు. మర్డర్‌ చేయడానికి కొన్ని రోజుల ముందు నుంచే భార్యతో చనువుగా ఉంటూ వచ్చాడు.

ఓ రోజు సరదాగా పొలం గట్టుకు వెళదాం రా అని ఆమెను నమ్మించాడు. భర్త పన్నాగం తెలియని ఆమె అతడితో పాటు వెళ్లింది. అక్కడ ఆమెను నూతిలో తోసి చంపేశాడు. తర్వాత ఇంటికి వచ్చేశాడు. ఆమె కనిపించకపోయే సరికి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అన్నపూర్ణ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుందని అందరూ భావించారు. పోలీసులకు మాత్రం రామారావుపై అనుమానం వచ్చింది. అతడ్ని తమదైన స్టైల్లో విచారించారు. అసలు విషయం బయటపడింది. పోలీసులు అతడ్ని అరెస్ట్‌ చేశారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి