iDreamPost

గజపతినగరంలో TDPకి జనసేన ఝలక్..?

నిత్యం ఏపీ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఎన్నికల హడావుడి లేకున్నా ఆ స్థాయిలోనే ఇక్కడి రాజకీయం ఉంటుంది. తాజాగా టీడీపీ, జనసేన పొత్తుతో.. అనేక ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

నిత్యం ఏపీ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఎన్నికల హడావుడి లేకున్నా ఆ స్థాయిలోనే ఇక్కడి రాజకీయం ఉంటుంది. తాజాగా టీడీపీ, జనసేన పొత్తుతో.. అనేక ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

గజపతినగరంలో TDPకి జనసేన ఝలక్..?

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం చాలా రసవత్తరంగా ఉంది. ముఖ్యంగా టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంపై అందరిలో ఆసక్తి పెరిగింది. ఇదే సమయంలో ఎంతమంది కలిసొచ్చిన తాము ఒంటరిగానే పోటీ చేస్తామని అధికార వైసీపీ స్పష్టం చేసింది. ఇక టీడీపీ, జనసేన రాష్ట్ర స్థాయి నేతలు భాగానే ఉన్నా.. క్షేత్ర స్థాయిలో ఆశించిన స్థాయిలో ఇరు నేతలు కలవడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఇలాంటి సమయంలో పొత్తులో భాగంగా సీట్లు ఎలా పంచుకుంటారు, ఎలా కలిసి ముందుకెళ్తారనేది.. అందరిలో వ్యక్తమవుతున్న సందేహం. ఇలాంటి తరుణంలో విజయనగరం జిల్లాలో టీడీపీకి జనసేన నేతలు ఝలక్ ఇస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

రాష్ట్ర రాజకీయాల్లో విజయనగరం జిల్లాలకు ప్రత్యేక స్థానం ఉంది. అందులో గజపతినగరం నియోజకవర్గం చాలా కీలకమైనది. అలాంటి గజపతినగరంలో టీడీపీ నేతలకు జనసేన నుంచి భారీ ఝలక్ తప్పదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ సీటు కోసం జనసేన గట్టిగా పట్టుబడుతుందనే టాక్ వినిపిస్తోంది. పొత్తు పెట్టుకోక ముందు నుంచి  గజపతినగరం మీద జనసేన ఆసక్తిని చూపిస్తోందని టాక్.

ఉమ్మడి విజయనగరంలో జిల్లాలో 9 స్థానాలకు గాను 3 స్థానాల్లో  జనసేన పోటీ చేయాలని భావిస్తుందని ప్రచారం అయితే సాగుతోంది.  వాటిలో గజపతినగరం ఒకటనే టాక్ వినిపిస్తోంది. ఇక టీడీపీలో చూస్తే రెండు వర్గాలుగా పార్టీ విడిపోయిందని స్థానికంగా టాక్ వినిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పల నాయుడు గజపతినగరం నుంచి 2014లో పోటీ చేసి గెలిచారు. అయితే 2019లో బొత్స అప్పలనర్సయ్య చేతిలో ఓడిపోయారు. అయితే 2024 ఎన్నికల్లో మరోసారి ఇక్కడి నుంచి పోటీ చేయాలని అప్పల నాయుడు భావిస్తున్నారంట.

అంతేకాక టీడీపీలోని మరో కీలక నాయకుడు కూడా ఈ సారీ పోటీకి తాను రెడీగా ఉన్నారని చెబుతున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ వర్గ పోరులో జనసేన సీటుని పొత్తులో భాగంగా కొట్టుకొని పోయేలా ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. కారణం.. ఇటీవలే జనసేనలో మాజీ మంత్రి పడాల అరుణ చేరారు. ఆమె కూడా గజపతినగరం సీటును ఆశిస్తున్నారని తెలుస్తోంది. అయితే జనసేన అధిష్టానం మాత్రం వెలమ సామాజిక వర్గానికి చెందిన నేతను  ఇన్ ఛార్జీగా నియమించింది. దీంతో ఆయనకే ఈ టికెట్ అనే ప్రచారం కూడా జరగుతోంది.

గజపతినగరంలో సామాజిక సమీకరణలు చూస్తే కాపు, వెలమ డామినేషన్ ఉంది. దీంతో జనసేన అభ్యర్ధికి రెండు సామాజిక వర్గాలు ఉపయోపడేలా ఈ ఎంపిక జరిగిందని అంటున్నారు. గజపతినగరం జనసేనకే అని ప్రచారం మొదలైంది. దాంతో టీడీపీలో వర్గ పోరు కాస్తా జనసేన తీర్చేస్తుందా అన్న  అనుమానలు తమ్ముళ్ళు వ్యక్తం చేస్తున్నారుట. మరి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలిజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి