iDreamPost

భారత్ ని భయపెడుతున్న జూమ్ యాప్

భారత్ ని భయపెడుతున్న జూమ్ యాప్

కరోనా వైరస్ మహమ్మారిలా ప్రపంచం అంతా కమ్మేయడంతో తప్పని పరిస్థితుల్లో ప్రజారోగ్యం దృష్టిలో ఉంచుకుని ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ ని ప్రకటించాయి. దీంతో ప్రపంచంలోని మెజారిటీ కంపెనీలు తమ ఉత్పత్తి కుదేలవ్వకుండా చూసుకునేందుకు ఉద్యోగులకి వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఇచ్చాయి. ఆదునిక డిజిటల్ ప్రపంచంలో ఇది ఒక అతి పెద్ద ప్రయోగంగా పలు సర్వే సంస్థలు వెల్లడించాయి. ఇక వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగులతో కమ్మ్యునికేట్ అవ్వటానికి గ్రూప్ డిస్క్షన్స్ కి, క్లైంట్ మీటింగులకు అత్యదిక కంపెనీలు పలు వీడియో కాన్ఫరెన్స్ సాఫ్ట్ వేర్లను ఉపయోగిస్తున్నాయి. అందులోను ముఖ్యంగా అత్యదిక కంపెనీలు జూమ్ అనే వీడియో కాన్ఫరెన్స్ సాఫ్ట్వేర్ ని ఉపయోగిచడం మొదలుపెట్టాయి.

యాప్ అన్నీ అనే సంస్థ చేసిన ఒక సర్వే ప్రకారం గడచిన ఒక్క మార్చ్ నెలలోనే 62 మిలియన్ల మంది వీడియో చాట్ అప్లికేషన్లు డౌన్లోడ్ చేసుకున్నారని వెల్లడించింది , అందులోను జూమ్ యాప్ గడచిన ఏడాదితో పొలిస్తే ఈ ఏడు మొదటి త్రైమాసికం లోనే ఒక్క అమెరికాలోనే 17శాతం అధికంగా వాడుతునట్టు చెప్పుకొచ్చింది. లాక్ డౌన్ వలన ఇంతలా ప్రయోజనం పొందిన జూం యాప్ ఉపయోగం పై ప్రస్తుతం నీలి నీడలు అలుముకున్నాయి. ఈ యాప్ వాడటం సెక్యురిటి పరంగా అంత శ్రేయస్కరం కాదని తమ దగ్గరకు వచ్చిన కంప్లైంట్స్ ఆదారంగా బోస్టన్ డివిజన్ యఫ్.బి.ఐ సంస్థ వెల్లడించారు. మసాచుసెట్స్ నగరంలో ఈ యాప్ ద్వారా స్కూల్ క్లాసులు నిర్వహిస్తుండగా ఆ చాట్లోకి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అసభ్యకరమైన ఫోటోలు వీడియోలు పోస్టు చేయడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ స్కూల్ యాజమాన్యం తమకి ఫిర్యాదు చేసినట్టు యఫ్.బి.ఐ సంస్థ వెల్లడించడంతో ఒక్కసారిగా ప్రపంచం ఉల్లిక్కిపడింది.

వృత్తి పరంగా తమ ఉద్యోగులతో , ఆహ్లాదంగా తమ స్నేహితులతో ఈ యాప్ ద్వారా అప్పటి వరకు కాంటాక్ట్ అయిన వారి భయాందోళనలను దృష్టిలో పెట్టుకుని జర్మనీ , సింగపూర్, తైవాన్, ఆస్ట్రేలియా లాంటి దేశాలు ఈ అప్లికేషన్ ను తమ దేశాల్లో బ్యాన్ చేశాయి. గూగుల్ లాంటి సంస్థలు తమ ఉద్యోగులను ఈ అప్లికేషన్ ను వాడకూడదు అని నిబందనలను పెట్టింది. సెక్యురిటి పరంగా ఈ అప్లికేషన్ లో అనేక లోపాలు ఉండటంతో హ్యాకర్లు అత్యంత సులువుగా ఈ అప్లికేషన్ ను హ్యాక్ చేసి కంపెనీలకు సంభందించిన కీలకమైన డేటాను తస్కరించి వాటితో పాటు 5 లక్షల ఎకౌంట్లను , హోస్ట్ కీస్ ను హ్యాకర్లు డార్క్ వెబ్ లో అమ్మకానికి పెట్టినట్టు బ్లీపింగ్ కంప్యుటర్స్ సంస్థ తమ రిపోర్టులో వెల్లడించింది.

డార్క్ వెబ్ అంటే ఏంటి ?

ఇంటర్నెట్ 3 రకాలుగా ఉంటుంది – సర్ఫెస్ వెబ్, డీప్ వెబ్, డార్క్ వెబ్ – మనకి ఉన్న సర్చ్ ఇంజన్స్ ( గూగుల్, యాహో, బింగ్ ) అన్ని సర్ఫేస్ వెబ్ కిందకు వస్తాయి, అంటే పబ్లిక్ గా అందరూ చూడగలిగేవి సర్ఫేస్ వెబ్ కిందకు వస్తాయి. ఇది మొత్తం ఇంటర్నెట్ లో కేవలం 4% మాత్రమే మిగతా 96% ఇంటర్నెట్ ఈ డీప్ అండ్ డార్క్ వెబ్ లో ఉంటాయి. ఇక డీప్ వెబ్ అంటే ఎవ్వరు గూగుల్ లాంటి సర్చ్ ఇంజన్స్ లో సర్చ్ చేసి చూడలేని ఇన్ఫర్మేషన్ – ఉదాహరణకి, మన మెయిల్ బాక్స్ , గూగుల్ డ్రైవ్ లాంటివి . పూర్తిగా మన వ్యక్తిగత లాగిన్ ఐడి , పాస్ వర్డ్ ని ఉపయోగించి మాతమే చూడగలం. మన అనుమతి లేకుండా వీటిలో ఉన్న ఇంఫర్మేషన్ వేరే వాళ్ళు చూడలేరు. ఈ డీప్ వెబ్ లో పూర్తిగా మన పర్సనల్ డీటెయిల్స్ మాత్రమే ఉంటాయి

ఇక డార్క్ వెబ్ విషయానికి వస్తే దీనినే “డార్క్ నెట్” అని కూడా అంటారు, డీప్ వెబ్ లో చిన్న పార్ట్ మాత్రమే డార్క్ నెట్ – ఇందులో పూర్తిగా ఇల్లీగల్ పనులే జరుగుతాయి – అక్రమ అయుదాల, మనుషుల అవయవాల, హ్యుమన్ ట్రాఫికింగ్ లాంటివి గురవుతాయి – అమేజాన్ లాంటి షాపింగ్ సైట్లలో వంట సామాన్లు అమ్మినట్టు మనుషుల్ని అమ్మేస్తారు – ఇక్కడ పూర్తిగా మాఫియా రాజ్యం ఏలుతుంది. పొరపాటున ప్రభుత్వం దగ్గర ఉండవలసిన డేటా ప్రయివేటు వ్యకుల దగ్గరికి చేరి అక్కడనుండి అతి సులభంగా ఈ డార్క్ వెబ్ వాళ్ళ దగ్గరికి చేరితే, ఈ ఇన్ఫర్మేషన్ ఆదారంగా మన క్రెడిట్ కార్డ్లు , డెబిట్ కార్డ్లు, పాస్పోర్టులు క్లోన్ చేసి అనేక అసాంఘిక కార్యకలాపాలకి వాడే అవకాశం ఉంది, వారి దగ్గరకి చేరిన మన సమాచారంతో మన ఆర్ధిక స్థితిగతులు అంచనా వేసి కిడ్నాపులు, హత్యలు, ఆడపిల్లలని అపహరించి అక్రమ రవాణ చేసే అవకాశం కూడా ఉంది. వీరి చేతికి మన వ్యక్తిగత సమాచారం దొరికితే మన జీవితం తలకిందులు అయినట్టే.

భారత్ లో జూమ్ యాప్

లాక్ డౌన్ నేపద్యంలో అని దేశాలతోపాటు భారత్ లో సింహబాగం కంపెనీలు కూడా ఈ యాప్ ని విరివిగా ఉపయోగించడం అందులోను కేంద్ర ప్రభుత్వ శాఖలు, కొన్ని రాష్ట్ర ప్రభుత్వ శాఖలు తమ మీటింగులకి, ప్రెస్ మీట్లకు ఈ అప్లికేషన్ ని ఉపయోగించుకున్న ఈ సమయంలో సెక్యురిటి పరంగా ఈ యాప్ అంత సురక్షితం కాదని వార్తలు వస్తున్న నేపద్యంలో భారత్ లోని కంప్యుటర్ ఎమర్జన్సీ రెస్పాన్స్ టీం దీని గురించి పరిశోధన చేసి ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్ట్ లేని జూమ్ యాప్ వాడటం వలన సైబర్ దాడులు జరిగే అవకాశమే ఎక్కువ ఉన్నదని తమ నివేదికలో స్పష్టం చేయడంతో భారత ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఉచితంగా ఈ యాప్ ను ఉపయోగించే వారి సర్వర్లు చైనా ఆదీనంలో ఉండటంతో భారత్ లోని కంపెనీలు ముఖ్యంగా ప్రభుత్వ శాఖలు ఈ యాప్ ని వాడటం దేశ భద్రతకే ముప్పు వాటిల్లే అవకాశాలు ఉండటంతో కేంద్ర హోం శాఖ ఈ అప్లికేషన్ ను భారత్ లోని ఏ ప్రభుత్వ శాఖ వాడవద్దు అని ఆదేశాలు జారీచేసింది.

ప్రపంచంలో మొట్టమొదట ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రమోట్ చేసింది నేనే అని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ఆంద్రప్రదేశ్ లో ఈ యాప్ వాడకం పై విరివిగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే ప్రెస్ మీట్ లో కూడా ప్రభుత్వం జూమ్ యాప్ వాడుకుని సత్ఫలితాలు పొందాలని హితబోద కూడా చేశారు. అయితే భారత ప్రభుత్వమే ఈ యాప్ వాడటం సురక్షితం కాదు అని చెబుతున్న ఈ సందర్భంలో కూడా ప్రపంచంలోని ఉన్న తెలుగువారితో ఇంటరాక్షన్ అనే పేరుతో నేడు సాయంత్రం 5కి ఈ జూమ్ యాప్ ద్వారానే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశ భద్రతకే ముప్పు తెచ్చే ఇటువంటి అప్లికేషన్లను ప్రతిపక్షనేత ప్రమోట్ చేయడమే కాకుండా ఇంకా వాడుతూ ఉండటం శోచనీయం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి