Somesekhar
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో దుమ్మురేపుతున్నాడు 23 ఏళ్ల ఓ కుర్రాడు. ఆకాశమేహద్దుగా చెలరేగుతూ ప్రత్యర్థికి వణుకు పుట్టిస్తున్నాడు. ఇలాంటి ప్లేయర్ టీ20 వరల్డ్ కప్ లో ఆడటానికి సిద్దంగా లేడని చెప్పుకొచ్చాడు యువరాజ్ సింగ్. మరి దానికి కారణం ఏంటో చూద్దాం.
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో దుమ్మురేపుతున్నాడు 23 ఏళ్ల ఓ కుర్రాడు. ఆకాశమేహద్దుగా చెలరేగుతూ ప్రత్యర్థికి వణుకు పుట్టిస్తున్నాడు. ఇలాంటి ప్లేయర్ టీ20 వరల్డ్ కప్ లో ఆడటానికి సిద్దంగా లేడని చెప్పుకొచ్చాడు యువరాజ్ సింగ్. మరి దానికి కారణం ఏంటో చూద్దాం.
Somesekhar
టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు సంపాదించడమే లక్ష్యంగా టీమిండియా యువ క్రికెటర్లు ఈ ఐపీఎల్ సీజన్ లో చెలరేగిపోతున్నారు. మరీ ముఖ్యంగా కొందరు అన్ క్యాప్డ్ ప్లేయర్లు సృష్టిస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు. సిక్సులు, ఫోర్లతో ప్రత్యర్థి బౌలర్లకు వణుకు పుట్టిస్తున్నారు. ఇక ఈ సీజన్ లో పరుగుల వరదపారిస్తున్న ఓ చిచ్చరపిడుగుపై హాట్ కామెంట్స్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్. అతడు ఎంతగా బాదినా గానీ టీ20 వరల్డ్ కప్ లో చోటు కష్టమే అని పేర్కొన్నాడు. మరి యువీ అలా అనడానికి రీజన్ ఏంటి? అసలా ప్లేయర్ ఎవరు? చూద్దాం పదండి.
ఈ ఐపీఎల్ సీజన్ లో యంగ్ టీమిండియా ప్లేయర్లు దుమ్మురేపుతున్నారు. మరీ ముఖ్యంగా అన్ క్యాప్డ్ ప్లేయర్లు అదరహో అనిపిస్తున్నారు. అందులో ఓ చిచ్చరపిడుగు పేరే అభిషేక్ శర్మ. ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఇతడు పవర్ ప్లేలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఫోర్లు, సిక్సర్లతో బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న తీరుకు క్రికెట్ లెజెండ్సే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్ ల్లో 288 పరుగులు చేశాడు. అందులో ఓ అర్దసెంచరీ ఉంది. అతడి స్ట్రైక్ రేట్ 218 కావడం విశేషం.
ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతున్న ప్లేయర్లలో పవర్ ప్లేలో అత్యంత డేంజరస్ బ్యాటర్ ఎవరంటే? చాలా మంది అభిషేక్ పేరే చెబుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇక తన పవర్ హిట్టింగ్ ఆటతో జూనియర్ యువరాజ్ గా కితాబు అందుకుంటున్నాడు అభిషేక్. ఇతడు యువీ శిష్యుడని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆ విషయం అందరికీ తెలిసిందే. అయితే తన ఆటతీరుతో టీ20 వరల్డ్ కప్ లో చోటు కోసం ఆశలు పెట్టుకున్నాడు ఈ 23 ఏళ్ళ కుర్రాడు. కానీ అది జరిగే పనికాదంటున్నాడు అభిషేక్ గురువు యువరాజ్ సింగ్.
టీ20 వరల్డ్ కప్ లో ప్లేస్ పై యువీ మాట్లాడుతూ..”అభిషేక్ శర్మ ఆల్ మోస్ట్ టీ20 వరల్డ్ కప్ టీమ్ లో చోటు వరకు వచ్చాడు. కానీ అతడిప్పుడే ఈ మెగాటోర్నీలో ఆడేందుకు సిద్దంగా లేడని నేను భావిస్తున్నాను. ప్రపంచ కప్ తర్వాత టీమిండియాకు ఆడేందుకు రెడీగా ఉండాలి. దానిపైనే అభిషేక్ ఫొకస్ పెట్టాలి” అని యువరాజ్ సింగ్ తన శిష్యుడిపై కామెంట్స్ చేశాడు. అయితే ఐపీఎల్ లో ఉన్న ఫ్రీ నెస్.. ఇంటర్నేషనల్ మ్యాచ్ లకు వచ్చేసరికి వేరే తీరుగా ఉంటాయని, వాటికి అలవాటు పడి, ఒత్తిడిని తట్టుకుంటేనే అక్కడ రాణించగలడనే ఉద్దేశంలో యువీ ఈ వ్యాఖ్యలు చేశాడు. మరి తన శిష్యుడిపై యువరాజ్ చేసిన వ్యాఖ్యలు మీకేవిధంగా అనిపించాయో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Yuvraj Singh said “Abhishek Sharma is almost there but I don’t think he is ready for the World Cup right now – after WC, he should be prepared to play for India & that is what he should focus on”. [Cricbuzz] pic.twitter.com/Ex95boBu2R
— Johns. (@CricCrazyJohns) April 26, 2024