iDreamPost
android-app
ios-app

రూ.55 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. నిమిషంలో బ్యాటరీ ఫుల్.. సూపర్ ఫీచర్స్

  • Published Nov 27, 2023 | 11:08 AMUpdated Nov 27, 2023 | 11:08 AM

నేటి కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. మీరు కూడా ఈవీ కొనాలనే ఆలోచనలో ఉంటే.. మీకొక శుభవార్త. కేవలం 55 వేల రూపాయలకే ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులోకి వచ్చింది. పూర్తి వివరాలు మీకోసం...

నేటి కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. మీరు కూడా ఈవీ కొనాలనే ఆలోచనలో ఉంటే.. మీకొక శుభవార్త. కేవలం 55 వేల రూపాయలకే ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులోకి వచ్చింది. పూర్తి వివరాలు మీకోసం...

  • Published Nov 27, 2023 | 11:08 AMUpdated Nov 27, 2023 | 11:08 AM
రూ.55 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. నిమిషంలో బ్యాటరీ ఫుల్.. సూపర్ ఫీచర్స్

కాలుష్యాన్ని తగ్గించడం కోసం.. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల భారం నుంచి కాపాడుకోవడం కోసం నేటి కాలంలో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వైపు మళ్లుతున్నారు. కేంద్రం కూడా వీటి వాడకాన్ని పెంచడం కోసం అనేక రాయితీలు ప్రకటిస్తుండగా.. కంపెనీలు కూడా అదే దారిలో పయనిస్తున్నాయి. వినియోగదారులను ఆకట్టుకోవడం కోసం అనేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. అందుబాటు ధరలోనే.. అత్యద్భుతమైన ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. ఇక మరో టెంప్టింగ్ ఆఫర్ ప్రకటించింది ఓ కంపెనీ. కేవలం 55 వేల రూపాయలకే ఎలక్ట్రిక్ స్కూటర్ని అందుబాటులోకి తీసుకువస్తుంది. ఇక ఫీచర్లైతే అద్భుతంగా ఉన్నాయి. కేవలం నిమిషంలోనే బ్యాటరీ ఫుల్ అవుతుంది. మరి ఇంతకు ఏ కంపెనీ దీన్ని మార్కెట్లోకి తీసుకువస్తుంది.. మిగతా ఫీచర్లు ఏంటి అంటే..

బజాజ్ ఆటో కంపెనీ కేవలం 55 వేల రూపాయిలకే యూలు విన్ అనే ఎలక్ట్రిక్ స్కూటర్ ని మార్కెట్లోకి తీసుకువస్తుంది. యులు కంపెనీ వీటిని కస్టమర్లకు అందిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు రిజిస్ట్రేషన్ సైతం అవసరం లేదు. పైగా డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేకుండానే ఈ బైక్‌పై దూసుకెళ్లొచ్చు. పైగా దీనికి కీలెస్ ఎంట్రీ ఆప్షన్ ఉంది. అంతేకాక కేవలం ఒక్క నిమిషంలోనే ఫుల్ బ్యాటరీ లభిస్తుంది. ఇంట్లో చార్జింగ్ పెట్టుకోవాల్సిన పని లేదు. డెన్స్ నెట్‌వర్క్ ద్వారా మీరు మీ బ్యాటరీ స్వాపింగ్ లొకేషన్ తెలుసుకోవచ్చు. ఫోన్ కనెక్టివిటీ కూడా ఉంటుంది. ఇది రెడ్, వైట్ రెండు కలర్ ఆప్షన్‌లో లభిస్తోంది.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మీరు రూ.999తో బుక్ చేసుకోవచ్చు. ఈజీ ఈఎంఐ ఆప్షన్ లభిస్తుంది. నెలవారీ ఈఎంఐ రూ. 1999 నుంచి మొదలవుతోంది. అయితే ముందుగా డౌన్ పేమెంట్ రూ. 9999 కట్టాల్సి ఉంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు అని తెలిపారు తయారీదారులు. ఒక్కసారి చార్జ్ చేస్తే 60 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. బ్యాటరీ ఛార్జింగ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ రూ. 499 నుంచి ప్రారంభం అవుతున్నాయి. అలాగే రూ. 699, రూ. 899 ప్లాన్స్ కూడా ఉన్నాయి. ప్లాన్ ఆధారంగా మీకు లభించే బెనిఫిట్స్ మారతాయి.

ఒక వేళ మీరు 699 ప్లాన్ తీసుకుంటే.. మీకు ఉచిత 300 కిలోమీటర్ల బెనిఫిట్ లభిస్తుంది. దీనితో పాటు మిగతా అన్ని ప్రయోజనాలు లభిస్తాయి. అదే రూ. 899 ప్లాన్ అయితే 600 కిలోమీటర్ల వరకు ఉచితంగానే జర్నీ చేయొచ్చు. ఇంకా ఇతర బెనిఫిట్స్ కూడా పొందవచ్చని యూలు కంపెనీ తెలిపింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి