iDreamPost
android-app
ios-app

విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. త్వరలోనే టీడీపీలో చీలిక

  • Published Oct 02, 2023 | 1:30 PM Updated Updated Oct 02, 2023 | 1:30 PM
  • Published Oct 02, 2023 | 1:30 PMUpdated Oct 02, 2023 | 1:30 PM
విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. త్వరలోనే టీడీపీలో చీలిక

రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి రోజు రోజుకు దిగ జారిపోతుంది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన వారుసుడు చినబాబు లోకేష్‌ల మీద రోజుకో కేసు నమోదవుతుంది. అటు చూస్తే టీడీపీకి దిశా నిర్దేశం చేయగల నేతలు ఎవరు కనిపించడం లేదు. చంద్రబాబు అత్యాశ, మోసపూరిత ధోరణి కారణంగా నేడు టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రసుత్తం టీడీపీని ముందుండి నడిపించే పెద్ద దిక్కు కరువయ్యారని ఆపార్టీ నేతలు, కార్యకర్తలే వాపోతున్నారు. ఇదిలా ఉండగా.. వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీపై హాట్‌ కామెంట్స్‌ చేశారు. త్వరలోనే ఆ పార్టీ రెండు ముక్కలుగా చీలి పోవచ్చు అంటూ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అవినీతి కేసులో జైలుకు వెళ్లినా… ఆ పార్టీ నేతలు పెద్దగా పట్టించుకోవడంలేదంటూ విజయసాయి రెడ్డి ట్వీట్‌ చేశారు. ప్రస్తుత పరిస్థితి ఆ పార్టీ దయనీయస్థితికి అద్దం పడుతోందని ఎద్దేవా చేశారు. అంతేకాదు.. త్వరలోనే తెలుగుదేశం పార్టీ రెండు, మూడు ముక్కలుగా చీలిపోయేందుకు రెడీగా ఉందంటూ ట్వీట్‌ చేశారు విజయసాయిరెడ్డి. 40 సంవత్సరాలుగా టీడీపీకి మద్దతిస్తున్న బలమైన వ్యాపార వర్గంలో కూడా బాబు అరెస్ట్‌ తర్వాత.. పునరాలోచన మొదలైందన్నారు. చంద్రబాబు దోపిడీలను తామెందుకు సమర్థించాలని ఆ వ్యాపార వర్గంలో ఆలోచన మొదలైందంటూ విజయసాయి రెడ్డి ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఇది వైరలవుతోంది.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş