iDreamPost
android-app
ios-app

విచిత్ర ఆరోపణలు: సినిమాల్లో నీతులు.. బయట బూతులా బాలయ్యా: YCP

  • Published Nov 23, 2023 | 2:38 PM Updated Updated Nov 23, 2023 | 2:38 PM

కోలీవుడ్‌ సీనియర్‌ నటి, తమిళ్‌ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ విచిత్ర చేసిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా వైసీపీ చేసిన ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..

కోలీవుడ్‌ సీనియర్‌ నటి, తమిళ్‌ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ విచిత్ర చేసిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా వైసీపీ చేసిన ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..

  • Published Nov 23, 2023 | 2:38 PMUpdated Nov 23, 2023 | 2:38 PM
విచిత్ర ఆరోపణలు: సినిమాల్లో నీతులు.. బయట బూతులా బాలయ్యా: YCP

కోలీవుడ్‌ సీనియర్‌ నటి, తమిళ్ బిగ్‌బాస్‌ సీజన్‌ 7 కంటెస్టెంట్‌ విచిత్ర.. క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి చేసిన కామెంట్స్‌ తమిళ్‌ ఇండస్ట్రీలోనే కాక.. దక్షిణాది అన్ని మూవీ పరిశ్రమల్లో సంచలనం రేపుతున్నాయి. ఇక విచిత్రను వేధింపులకు గురి చేసింది హీరో నందమూరి బాలకృష్ణే అంటూ మీడియా కోడై కూస్తుంది. పలు ఇంగ్లీష్‌ వెబ్‌సైట్లు కూడా విచిత్రను వేధింపులకు గురి చేసిన హీరో నందమూరి బాలకృష్ణే అంటూ వార్తలు ప్రచురించాయి. ఇక తాజాగా ఈ ఆరోపణలపై వైసీపీ స్పందించింది. విచిత్ర చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ ట్విట్టర్ వేదికగా పార్టీ అఫిషియల్ పేజ్‌ నుంచి ఓ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఇది వైరలవుతోంది.

విచిత్ర ఆరోపణల మీద స్పందిస్తూ.. బాలయ్య మీద సెటైర్లు వేస్తూ.. ఆయన సినిమాలోని డైలాగ్‌నే వాడుతూ.. వైసీపీ విమర్శలు చేసింది. ‘‘స్త్రీ లేకపోతే జననం లేదు.. గమనం లేదు.. సృష్టిలో జీవం లేదు.. అంటూ తన సినిమాల్లో గొప్పగా సూక్తులు చెప్పే నందమూరి బాలకృష్ణ.. 2001లో భలేవాడివి బాసు సినిమా షూటింగ్ సమయంలో తమిళ నటి విచిత్రని లైంగికంగా వేధించాడట. ఈ విషయాన్ని బిగ్‌బాస్‌లో స్వయంగా విచిత్రనే వెల్లడించింది. గతంలో అమ్మాయిలు, నర్సుల గురించి కూడా బాలయ్య చాలా అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. మహిళలను చులకనగా చూస్తూ కించపరచడం టీడీపీ నాయకులకి పరిపాటిగా మారిపోయింది’’ అంటూ వైసీపీ ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఇక గతంలో బాలయ్య.. మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అమ్మాయి కనిపిస్తే ముద్దయినా పెట్టాలి.. లేదంటే కపడుపు చేయాలంటూ ఓ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్లో బాలయ్య చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా విచిత్ర చేసిన ఆరోపణల నేపథ్యంలో వాటిని మరోసారి ప్రస్తావిస్తున్నారు నెటిజనులు. అయితే వైసీపీ చేసిన ట్వీట్‌పై టీడీపీ నేతలు స్పందిస్తూ.. కౌంటర్‌గా కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఇరు పార్టీల మద్దతుదారుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.

ఇక బిగ్‌బాస్‌ టాస్క్‌లో భాగంగా విచిత్ర మాట్లాడుతూ.. ఓ టాలీవుడ్‌ టాప్‌ హీరో.. కనీసం తన పేరు కూడా అడక్కుండానే.. తన గదికి రమ్మనాడని.. అలా వెళ్లనందుకు సినిమా షూటింగ్‌ సమయంలో తనకు నరకం చూపారని చెప్పుకొచ్చింది. అంతేకాక సినిమా షూటింగ్‌ సమయంలో కావాలనే కొందరు తనను అసభ్యంగా తాకారని.. దీని గురించి ఫిర్యాదు చేస్తే.. తననే కొట్టారని..ఈ అంశం మీద పోలీసులు, కోర్టు ఎక్కడికి వెళ్లినా.. యూనియన్‌లో ఫిర్యాదు చేసినా తనకు ఫలితం దక్కలేదని తెలిపింది. ఈ సంఘటన తర్వాత తాను సినిమాలకు పూర్తిగా దూరమయ్యానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళ్‌, మలయాళీ భాషల్లో సిరీయల్స్‌లో నటిస్తోంది.

jojobet girişgamdomCasibomjojobetJojobet Girişjojobet güncel giriş