iDreamPost

వెఎస్సార్‌సీపీ అధ్యక్షుడు.. చంద్రబాబు …!!

వెఎస్సార్‌సీపీ అధ్యక్షుడు.. చంద్రబాబు …!!

వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ (వైఎస్సార్‌సీపీ) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. ఇదేమిటి తప్పుగా రాశారనుకుంటున్నారా..? కాదు..! మీరు చదువుతున్నది నిజమే. ఇదేమిటని ఆశ్చర్యపోతున్నారా..? వినడానికి కొంత ఎబ్బెట్టుగా ఉన్న వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు చంద్రబాబే తమ పార్టీ అధ్యక్షుడని అంటున్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఇలా చంద్రబాబే తమ అధ్యక్షుడని ఎందుకు అనుకుంటున్నారు..? అసలు ఏమి జరిగింది..? చంద్రబాబు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడుగా ఎప్పుడు అయ్యారనుకుంటున్నారా..? ఇక.. ఆలస్యం చేయకుండా మీకు అసలు విషయం చెప్పాల్సిందే. ఈ సస్పెన్స్‌కు తెరదించాల్సిందే.

ఈ రోజు బీసీజీ కమిటీ నివేదికపై చంద్రబాబు మీడియా సమావేశంలో వైఎస్సార్‌సీపీ పార్టీ తనదే, ఆ పార్టీకి అధ్యక్షుడుని, లేదా గౌరవ అధ్యక్షుడిని తానేనన్నట్లుగా మాట్లాడారు. విశాఖ జిల్లా ఇన్‌చార్జిగా విజయసాయిరెడ్డి ఎవరని..? ఆయన్ను జిల్లా ఇన్‌చార్జిగా ఎలా పెడతారని ప్రశ్నించారు. ఎంపీని జిల్లా ఇన్‌చార్జిగా ఎలా పెడతారని ప్రశ్నించిన చంద్రబాబు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు అడ్డంగా దొరికిపోయారు. సందుదొరికితే సరిచివదిలిపెట్టే వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు సోషల్‌ మీడియాలో చంద్రబాబును ఓ ఆట ఆడుకుంటున్నారు. మరో వైపు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు. తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అంటూ ఎద్దేవా చేస్తున్నారు. తమకు పదవులు కావాలని, పార్టీలో ముఖ్యమైన పదవులు కోసం త్వరలో చంద్రబాబును కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ కోసం నారా లోకేష్‌ను సంప్రదించాలని వారిలోవారు వేళాకోళం ఆడుకుంటున్నారు. ప్రభుత్వంలో ముఖ్యమైన పదవి కోసం సీఎంకు సిఫార్సు చేయించుకుందామని పలువురు నేతలు సెటైర్లు వేస్తున్నారు.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాలను విజయసాయి రెడ్డి ఆది నుంచి పర్యవేక్షిస్తున్నారు. విశాఖలో జరిగే ప్రతి కార్యక్రమం ఆయన దగ్గరుండి నిర్వహిస్తున్నారు. ఇటీవల సీఎంకు స్వాగతం పలికే కార్యక్రమాన్ని కూడా భారీ స్థాయిలో నిర్వహించారు. ఎంపీగా, పార్లమెంటరీ పార్టీ నేతగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విజయసాయి రెడ్డి ఆది నుంచి పార్టీకి విశాఖ జిల్లా వ్యవహారాలను చక్కబెడుతున్నారు.

విజయసాయి రెడ్డి విశాఖ జిల్లా ఇన్‌చార్జి గా ఉంటూ అక్కడ భూముల వ్యవహారాలన్నీ చక్కబెడుతున్నారని చంద్రబాబు ప్రధాన ఆరోపణ. అయితే జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనుకుని చంద్రబాబు.. విజయసాయి రెడ్డి ఎవరు..? జిల్లా ఇన్‌చార్జిగా ఎంపీని ఎలా పెడతారని ప్రశ్నించి వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలుకు టార్గెట్‌ అయ్యారు.

విశాఖ జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా తూర్పుగోదావరి జిల్లా వాసి, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు గత ఏడాది అక్టోబర్‌ నుంచి కొనసాగుతున్నారు. అంతకు ముందు మార్కెటింగ్‌ శాఖ మంత్రి మోపీదేవి వెంకటరమణ విశాఖ ఇన్‌చార్జి మంత్రి బాధ్యతలు నిర్వర్తించారు. అయితే అక్టోబర్‌లో జిల్లా ఇన్‌చార్జిలను సీఎం జగన్‌ మార్చారు. మోపీదేవిని విశాఖ నుంచి తూర్పుగోదావరికి మార్చి ఆ స్థానంలో కురసాలను నియమించారు. అది తెలియని చంద్రబాబు ఇన్‌చార్జిగా ఎంపీ అయిన విజయసాయిరెడ్డిని ఎలా పెడతారంటూ ప్రశ్నించి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులకు బుక్కయ్యారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి