iDreamPost

YSRCP Plenary 2022 వైఎస్‌ జగన్‌ మాస్‌ లీడర్‌, ఉద్దండ నాయకులకే గొంతు ఎండిపోయేలా చేశారు

YSRCP Plenary 2022 వైఎస్‌ జగన్‌ మాస్‌ లీడర్‌, ఉద్దండ నాయకులకే గొంతు ఎండిపోయేలా చేశారు

వైఎస్సార్‌ అందరివాడని, కోట్ల మంది హృదయాల్లో సజీవంగా ఉన్నారని వైఎస్‌ విజయమ్మ అన్నారు. ఇచ్చిన మాట నుంచి, ప్రజల అభిమానం నుంచి వైఎస్సార్‌సీపీ పుట్టిందని, ఎన్నో కష్టాలను ఎదుర్కొని నిలిచామని వైఎస్‌ విజయమ్మ అన్నారు. అన్యాయంగా కేసులు పెట్టారు, వేధించారు, అధికార శక్తులన్నీ జగన్‌పై విరుచుకుపడ్డా బెదరలేదు. జగన్‌ ఓర్పు, సహనంతో ఎంతో ఎత్తుకు ఎదిగార‌ని ప్ర‌శంసించారు. వైఎస్‌ జగన్‌ మాస్‌ లీడర్‌. యువతకు రోల్‌ మోడల్‌. మీ అందరి ప్రేమ సంపాదించిన జగన్‌ను చూసి, నేను గర్వపడుతున్నా. ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని వైఎస్‌ విజయమ్మ అన్నారు.

గ్రామ సచివాలయాలు, జగనన్న అమ్మ ఒడి, రైతు భరోసా కేంద్రాలు, పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన జ‌గ‌న్, పాలనలో విప్లవాలు తెచ్చారని విజయమ్మ అన్నారు. జగన్‌ చెప్పినవే కాదు. చెప్పనవీ కూడా చేస్తున్నారు. హామీలన్నీ అమలు చేశాం కాబట్టే, ఇంటింటికీ ఎమ్మెల్యేలు వెళ్తున్నార‌ని వైఎస్‌ విజయమ్మ చెప్పారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి