iDreamPost

26 నుంచి వైఎస్సార్‌ సీపీ బస్సు యాత్ర ప్రారంభం!

అక్టోబర్‌ 26వ తేదీ నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఒకేసారి బస్సు యాత్రలు ప్రారంభం కానున్నాయి.

అక్టోబర్‌ 26వ తేదీ నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఒకేసారి బస్సు యాత్రలు ప్రారంభం కానున్నాయి.

26 నుంచి వైఎస్సార్‌ సీపీ బస్సు యాత్ర ప్రారంభం!

మరికొన్ని నెలల్లో ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 175 నియోజకవర్గాల్లో విజయమే లక్ష్యంగా వైఎస్సార్‌ సీపీ ప్రణాళికలు రచిస్తోంది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఈ నాలుగున్నర ఏళ్లలో చేసిన అభివృద్ది, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ మేరకు త్వరలో సామాజిక సాధికార యాత్ర పేరిట ఓ బస్సు యాత్రను చేపట్టనుంది.

అక్టోబర్‌ 26వ తేదీ నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఒకేసారి బస్సు యాత్రలు ప్రారంభం కానున్నాయి. ఉత్తరాంధ్రలోని ఇచ్ఛాపురం నుంచి.. కోస్తాంధ్రలోని తెనాలి నుంచి.. రాయలసీమలోని సింగనమల నుంచి బస్సు యాత్రలు ప్రారంభం అవుతాయి. బస్సు యాత్రం ద్వారా ఈ నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, సంక్షేమాలపై ప్రచారం చేయనున్నారు. అన్ని వర్గాల ప్రజలకు సీఎం జగన్‌ చేసిన మేలును వివరించనున్నారు.

స్థానిక ఎమ్మెల్యేలు, సమన్వయ కర్తల ఆధ్వర్యంలో బస్సు యాత్రలు ప్రారంభం కానున్నాయి. బస్సు యాత్ర సందర్భంగా ప్రతీ మూడు ప్రదేశాల్లో ఓ సభ నిర్వహించనున్నారు. 175 నియోజకవర్గాల్లో విజయమే లక్ష్యంగా ఈ బస్సు యాత్ర సాగనుంది. ఈ యాత్రకు అన్ని వర్గాల ప్రజలనుంచి తప్పకుండా మద్దతు లభించనుంది. మరి, 175 నియోజకవర్గాల్లో విజయమే లక్ష్యంగా వైఎస్సార్‌ సీపీ  త్వరలో చేపట్టనున్న సామాజిక సాధికార యాత్రపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి