Dharani
Dharani
పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో జరిగిన వైఎస్సార్ నేతన్న నేస్తం నిధుల విడుదల తర్వాత జరిగిన సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. పవన్‌కు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. దత్తపుత్రుడు అమ్మాయిలతో అక్రమ సంబంధం పెట్టుకుంటారు.. అమ్మాయిలను లోబర్చుకుని, వారిని పెళ్లి చేసుకొని, నాలుగేళ్లు కాపురం చేసి వదిలేయడం అంటూ విరుచుకుపడ్డారు. పైగా ఒకరితో వివాహబంధంలో ఉంటూ ఇంకొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంటారంటూ పవన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు . పవన్ లాంటి క్యారెక్టర్ లేని వాళ్లు.. వాలంటీర్లను విమర్శించడం ఏంటని ప్రశ్నించారు సీఎం జగన్.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘వాలంటీర్లు ప్రజలకు ఎంతో గొప్ప సేవలు అందిస్తున్నారు. ఎండ, వాన, వరదలను లెక్క చేయకుండా పని చేస్తున్నారు. ఉదయాన్నే తలుపు తట్టి మంచి చెడులు అడిగే వాళ్ల గురించి ఇలా మాట్లాడటం దారుణం. ప్రజలకు ఎంతో మేలు చేస్తోన్న వాలంటీర్ల గురించి.. చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు, సొంత పుత్రుడు, బావమరిది చేస్తోన్న వ్యాఖ్యలు చూస్తే ఏమానాలో అర్థం కావడం లేదు. వాలంటీర్ల గురించి మాట్లాడే వీళ్ల క్యారెక్టర్ ఎలాంటిదో అందరికి తెలుసు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
‘‘దత్తపుత్రుడేమో.. ఒకరితో వివాహ బంధంలో ఉంటూ మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకోవడం… అమ్మాయిలను లోబరుచుకొని పెళ్లి చేసుకోవడం.. వదిలేయడం …మళ్ళీ పెళ్లి చేసుకోవడం వదిలేయడం ఆయన పని. ఇంకొకరు పట్టపగలు మందు తాగుతూ పదిమంది అమ్మాయిలతో స్విమ్మింగ్ ఫూల్లో డాన్సులు చేస్తాడు. మరో వ్యక్తి అమ్మాయి కనపడితే ముద్దు అయినా పెట్టాలి.. లేదా కడుపైనా చేయాలనంటాడు. ఇది చాలదన్నట్లు 75 ఏళ్ల ముసలాయన అంటాడు.. బావా మీరు సినిమాల్లో చేశారు.. నేను నిజంగా చేసానని చెబుతూ తాము చేసిన వెధవ పనుల గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు. ఇలాంటి క్యారెక్టర్ లేని వాళ్లా వాలంటీర్ల గురించి మాట్లాడేది’’ అంటూ ఘాటు వాఖ్యలు చేశారు సీఎం జగన్.