iDreamPost

Rohit Sharma: గెలవాలంటే ఫిఫ్టీలు, సెంచరీలు అక్కర్లేదు.. రోహిత్ శర్మ ఆసక్తికర కామెంట్స్

బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించిన తర్వాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. మ్యాచ్ లు గెలవాలంటే 100లు, 50లు కొట్టాల్సిన అవసరం లేదన్నాడు హిట్ మ్యాన్. మరి రోహిత్ ఇలా ఎందుకన్నాడు? ఆ వివరాల్లోకి వెళితే..

బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించిన తర్వాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. మ్యాచ్ లు గెలవాలంటే 100లు, 50లు కొట్టాల్సిన అవసరం లేదన్నాడు హిట్ మ్యాన్. మరి రోహిత్ ఇలా ఎందుకన్నాడు? ఆ వివరాల్లోకి వెళితే..

Rohit Sharma: గెలవాలంటే ఫిఫ్టీలు, సెంచరీలు అక్కర్లేదు.. రోహిత్ శర్మ ఆసక్తికర కామెంట్స్

టీ20 వరల్డ్ కప్ టైటిల్ దిశగా దూసుకెళ్తోంది టీమిండియా. ఈ మెగాటోర్నీలో ఆడిన అన్ని మ్యాచ్ ల్లో విజయాలు సాధించి.. ప్రత్యర్థులకు సవాల్ విసురుతోంది. సూపర్ 8లో కూడా వరుసగా రెండు విజయాలు సాధించి.. గ్రూప్ 1లో టేబుల్ టాపర్ గా ఉంది. ఇక రేపు(జూన్ 24)న ఆస్ట్రేలియాను ఢీకొనబోతోంది. ఇక తాజాగా బంగ్లాదేశ్ పై 50 పరుగుల తేడాతో విజయం సాధించిన తర్వాత రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. మ్యాచ్ గెలవాలంటే.. 50, 100లు కొట్టాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. ఇంకా రోహిత్ ఏమన్నాడంటే?

టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా జైత్రయాత్ర కోనసాగుతోంది. వరుసగా విజయాలు సాధిస్తూ.. టైటిల్ దిశగా సాగుతోంది. తాజాగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన కెప్టెన్ రోహిత్ శర్మ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ మాట్లాడుతూ..”ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాలంటే దూకుడుగా ఆడాల్సిందే. ఇప్పటికే ఈ విషయం నేను చాలా సార్లు చెప్పాను. టీమ్ లో ప్రతీ ఒక్క ప్లేయర్ అద్భుతంగా ఆడారు. పరిస్థితులకు తగ్గట్లుగా వారు రాణించారు. అయితే ఈ మ్యాచ్ లో గాలి ఎక్కువగా వీచింది. 8 మంది బ్యాటర్లతో బరిలోకి దిగడం మాకు కలిసొచ్చింది. అందరూ బాగా బ్యాటింగ్ చేయడంతో.. ప్రత్యర్థి ముందు 197 పరుగుల భారీ టార్గెట్ ను ఉంచగలిగాం. ఇక టీ20ల్లో మ్యాచ్ లు గెలవాలంటే ఫిఫ్టీలు, హండ్రెడ్స్ చేయనక్కర్లేదు” అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

Hardik Pandya

ప్రత్యర్థిపై బౌలర్లపై ఒత్తిడి తీసుకొస్తే.. పరుగులు వాటంతట అవే వస్తాయని, పాండ్యా బ్యాటింగ్ లో మెరిస్తే.. మా టీమ్ దే పై చేయి అవుతుందని గత మ్యాచ్ లోనే చెప్పానని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నాడు రోహిత్ శర్మ. పాండ్యా లోయర్ ఆర్డర్, మిడిలార్డర్ ప్లేయర్లతో కలిసి పరుగులు చేస్తాడు, బౌలర్ గానూ జట్టుకు అతడు అత్యంత కీలకమైన ప్లేయర్ అంటూ హార్దిక్ పై ప్రశంసలు కురిపించాడు హిట్ మ్యాన్. ఇక ఫుల్ జోష్ లో ఉన్న టీమిండియా తన నెక్ట్స్ మ్యాచ్ లో(జూన్ 24) పటిష్టమైన ఆస్ట్రేలియాతో తలపడబోతోంది. మరి టీ20 మ్యాచ్ లు గెలవాలంటే 100లు, 50లు కొట్టాల్సిన పనిలేదన్న రోహిత్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి