iDreamPost

చివరకు చంద్రబాబు వ్యవహారం ’నాన్నా పులి’ కథ లాగే అయిపోతుందా ?

చివరకు చంద్రబాబు వ్యవహారం ’నాన్నా పులి’ కథ  లాగే అయిపోతుందా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అందరిలోను ఇవే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పొద్దున లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకూ జగన్మోహన్ రెడ్డి సర్కార్ పై పదే పదే ఆరోపణలు చేస్తు, ఎల్లోమీడియాలో రాయిస్తు చంద్రబాబు కాలం గడిపేస్తున్నాడు. చంద్రబాబు చేస్తున్న ఆరోపణలైనా, ఎల్లోమీడియాలో అచ్చవుతున్న రాతలైనా అబద్ధాలే అన్న విషయం అందరికీ తెలిసిపోతోంది. ఇదే పద్దతిలో రాజకీయాలు చేసుకుంటూ పోతే చివరకు చంద్రబాబు నిజం చెప్పినా జనాలు నమ్మలేని స్ధితి తెచ్చుకుంటున్నాడు.

చంద్రబాబు వ్యవహార శైలిపై అందరికీ ’నాన్నా పులి’ కథ గుర్తుకొస్తోంది. ప్రభుత్వంలో ఒకటి జరుగుతుంటే చంద్రబాబు అండ్ తో పాటు ఎల్లోమీడియా మరోటి ప్రచారం జరుగుతోంది. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి టిడిపి, ఎల్లోమీడియా వరస ఇలాగే ఉంది. జగన్ నిర్ణయాల వల్ల మెజారిటి జనాలు హ్యాపీగా ఉన్నా చంద్రబాబు, ఎల్లోమీడియా తట్టుకోలేకపోతున్నారు. వాలంటీర్ల నియామకం, ఇసుక కొరత, ఇంగ్లీషుమీడియం, మూడు రాజధానుల ప్రతిపాదన, పేదలకు ఇళ్ళ స్ధలాల కేటాయింపు, కరోనా సంక్షోభం దగ్గర నుండి తాజాగా విద్యుత్ బిల్లులు, మడ అడవుల అంశం వరకు ఒకటే గోల.

క్షేత్రస్ధాయిలో వాస్తవాలు ఒకటైతే దాన్ని పూర్తిగా వక్రీకరించి ప్రభుత్వంపై బురద చల్లిస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబు లేకపోతే ఎల్లోమీడియా ఇదే విధంగా అసత్యాలను పదే పదే ప్రచారం చేస్తున్న విషయం అందరికీ అర్ధమైపోయింది. తాము చెబుతున్న విషయాలను జనాలు నమ్మటం లేదన్న విషయమే చంద్రబాబు, ఎల్లోమీడియా గుర్తించటానికి ఇష్టపడటం లేదు. రేపేదైనా నిజంగానే వీళ్ళు నిజం చెప్పినా జనాలు వీళ్ళెప్పుడూ ఇంతేలే అని లైటుగా తీసుకునే పరిస్ధితి వచ్చేసింది.

నిజానికి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని తరచూ చెప్పుకునే చంద్రబాబు ఏదైనా ఓ ఆరోపణ, విమర్శ చేస్తే జనాలు ఎంతో సీరియస్ గా తీసుకోవాలి. అలాంటిది అస్సలు ఏమాత్రం పట్టించుకోవటం లేదంటే కేవలం స్వయంకృతమనే చెప్పాలి. పార్టీలోని గ్రౌండ్ రియాలిటీ కానీ క్షేత్రస్ధాయిలో జనాలభిప్రాయంతో కానీ చంద్రబాబుకు కనెక్షన్ కట్టయిపోయి చాలా కాలం అయిపోయింది. అందుకనే ఎల్లోమీడియా ఏమి చెబితే అది, ఎలా చెబితే అలా నడుచుకుంటున్నాడు.

పార్టీలో నేతల అభిప్రాయాల కన్నా ఎల్లోమీడియా ప్రభావమే చంద్రబాబు మీద ఎక్కువైపోవటంతో మొన్నటి ఎన్నికల ఫలితం ఏమిటో అందరూ చూసిందే. అయినా తన తీరు మార్చుకోవటానికి చంద్రబాబు ఇష్టపడటం లేదంటే బహుశా 2024 లో కూడా మొన్నటి ఫలితమే రిపీట్ అవటానికి స్వయంగా చంద్రబాబే రంగం సిద్ధం చేస్తున్నాడా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. చూద్దాం చంద్రబాబు, ఎల్లోమీడియా పరిస్ధితి చివరకు ఎలాగైపోతుందో ?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి