iDreamPost

బ్యాంకులకి RBI ఆదేశం! ఇక మీ ఖాతాల్లోకి డబ్బులు పడబోతున్నాయి! చెక్ చేసుకోండి!

  • Published Apr 30, 2024 | 4:34 PMUpdated Apr 30, 2024 | 4:34 PM

ప్రస్తుత కాలంలో లోన్ కావాలంటే కొన్ని బ్యాంకుల నుంచి అదనపు ఛార్జీలను కూడా ఎక్కువగా ఛార్జీలను విధించడం చేస్తుంటారు. కానీ, లోన్ తీసుకొనే సమయంలో మాత్రం ఆ విషయాలేవీ కస్టమర్లకు చెప్పరు. తీరా తీసుకునే సమయంలో వివిధ రకాల ఛార్జీలను చెబుతూ లోన్ అమౌంట్ లో కట్ చేస్తుంటారు.ఇక అలాంటి సమస్యలన్నింటికి చెక్ పెడుతూ.. లోన్ తీసుకునే వారికి ఇప్పుడు ఆర్బీఐ మంచి శుభవార్త అందింది.

ప్రస్తుత కాలంలో లోన్ కావాలంటే కొన్ని బ్యాంకుల నుంచి అదనపు ఛార్జీలను కూడా ఎక్కువగా ఛార్జీలను విధించడం చేస్తుంటారు. కానీ, లోన్ తీసుకొనే సమయంలో మాత్రం ఆ విషయాలేవీ కస్టమర్లకు చెప్పరు. తీరా తీసుకునే సమయంలో వివిధ రకాల ఛార్జీలను చెబుతూ లోన్ అమౌంట్ లో కట్ చేస్తుంటారు.ఇక అలాంటి సమస్యలన్నింటికి చెక్ పెడుతూ.. లోన్ తీసుకునే వారికి ఇప్పుడు ఆర్బీఐ మంచి శుభవార్త అందింది.

  • Published Apr 30, 2024 | 4:34 PMUpdated Apr 30, 2024 | 4:34 PM
బ్యాంకులకి RBI ఆదేశం! ఇక మీ ఖాతాల్లోకి డబ్బులు పడబోతున్నాయి! చెక్ చేసుకోండి!

ప్రస్తుత కాలంలో ఎవరు ఏ పని చేయాలన్న అంతా డబ్బుతో ముడిపడి ఉంటుంది. డబ్బు లేనిదే ఏపని కూడా చేయడానికి సాధ్యపడదు. ముఖ్యంగా.. ఏదైనా వ్యాపారం చేయాలనుకున్న, సొంతింటి కలను నెరవేర్చుకోవలి అనుకున్న, వాహనాలు కొనుగో చేయడానికైనా అందుకు సరిపడ నగదు ప్రతి ఒక్కరి దగ్గర ఉండకపోవచ్చు. అందుకోసం చాలామంది ఎంతో కొంత రుణాన్ని బ్యాంకుల నుంచి పొందుతుంటారు. ఈ క్రమంలోనే బ్యాంకులురుణ గ్రహితకు చెందిన అన్ని డాక్యుమెంట్స్ ను సరిచూసుకుని లోన్స్ మంజూరు చేస్తూ.. లోన్స్ ను అందిస్తుంటాయి. అంతేకాకుండా.. ఈ లోన్ కావాలంటే కొన్ని బ్యాంకుల నుంచి అదనపు ఛార్జీలను కూడా ఎక్కువగా ఛార్జీలను విధించడం చేస్తుంటారు. కానీ, లోన్ తీసుకొనే సమయంలో మాత్రం ఆ విషయాలేవీ కస్టమర్లకు చెప్పరు. తీరా తీసుకునే సమయంలో వివిధ రకాల ఛార్జీలను చెబుతూ లోన్ అమౌంట్ లో కట్ చేస్తుంటారు.ఇక అలాంటి సమస్యలన్నింటికి చెక్ పెడుతూ.. లోన్ తీసుకునే వారికి ఇప్పుడు ఆర్బీఐ మంచి శుభవార్త అందింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ప్రస్తుతం లోన్ కావాలంటే బ్యాంకుల నుంచి అదనపు ఛార్జీలను తీసుకుంటూ ఎక్కువగా వేధించడం చూస్తుంటాం. అయితే లోన్ కావలని అని అడిగే సమయంలో.. ఈ రూల్స్ అన్నీ చెప్పరు. తీరా తీసుకునే సమయంలో వివిధ రకాల ఛార్జీలను చెబుతూ.. లోన్ అమౌంట్ లో కట్ చేస్తుంటారు. అయితే ఇలా అన్యాయంగా లోన్ అమౌంట్స్ పేరుతో కస్టమర్ల నుంచి చాలాా ఎక్కువ మోతాదులో ఛార్జీలను కట్ చేస్తున్నవారికి ఆర్బీఐ తాజాగా ఓ ప్రకటన జారీ చేసింది. ఇప్పటి వరకు లోన్ల పేరుతో అధికంగా వసూలు చేసే నగదును తిరిగి ఇచ్చేయాలని ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించింది. అలాగే ఈ రకంగా వ్యవహరిస్తున్న బ్యాంకుల తీరుపై ఆందోళన వ్యక్తం చేసింది.అయితే తాజాగా ఆర్బీఐ చేసిన ఈ అదేశాల మేరకు…ఈ విధానం ద్వారా లోన్ తీసుకున్న వారికి, తీసుకోవాలని అనుకుంటున్న వారికి భారీ ఊరట లభించనుంది.

ముఖ్యంగా 2003 నుంచి తన నియంత్రణ పరిధిలోని పలు సందర్భాల్లో ఆర్బీఐ మార్గదర్శకాలను జారీ చేసింది. అంతేకాకుండా.. రుణాన్ని మంజూరు చేసే బ్యాంక్ లు ఈ మర్గదర్శకాలను పాటించాలని సూచిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే ఆర్ఈలు లోన్ ల పంపిణీ విధానం, వడ్డీ విధింపు, ఇతర ఛార్జీలను సమీక్షించాలని స్పష్టం చేసింది. కాగా, దీనికి అనుగుణంగా మార్పులు చేయాలని కోరింది.  అలాగే ఎవరికైనా లోన్ మంజూరు అయిన తేదీ నుంచి వడ్డీని లెక్కిస్తున్నట్లు కూడా ఆర్బీఐ గమనించినట్లు తెలిపింది. ఇక ఈ లోన్ పంపిణీ నుంచి వడ్డీ లెక్కించాల్సింది ముందే వసూలు చేయడాన్ని తప్పు పట్టింది. కాగా, ఇలా అన్యాయంగా వసూలు చేసిన వడ్డీలు, ఇతర ఛార్జీలను తిరిగి ఇచ్చేయలని ఆర్బీఐ తెలిపింది. దీంతో పాటు  బ్యాంకులు కూడా తప్పకుండా వీటిని పాటించాలని ఆదేశించింది. మరీ, లోన్ తీసుకునే వారికి ఆర్బీఐ అందించిన శుభవార్త పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి