iDreamPost

టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీల వెల్లడి! ఎప్పటి నుంచి అంటే?

10th Advanced Supplementary Exams: తెలంగాణ పదవ తరగతి పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 30, మంగళవారం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో సెక్రటరీ బుర్రా వెంకటేశం ఉదయం 11 గంటలకు రిలీజ్ చేశారు.

10th Advanced Supplementary Exams: తెలంగాణ పదవ తరగతి పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 30, మంగళవారం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో సెక్రటరీ బుర్రా వెంకటేశం ఉదయం 11 గంటలకు రిలీజ్ చేశారు.

టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీల వెల్లడి! ఎప్పటి నుంచి అంటే?

తెలంగాణలో టెన్త్ విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫలితాలు ఈ రోజు (ఏప్రిల్ 30) న రిలీజ్ అయ్యాయి. ఉదయం 11 గంటలకు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఫలితాలు విడుదల చేశారు. పదవ తరగతి పరీక్షలకు మొత్తం 5,05,813 మంది విద్యార్థులు హాజరు కాగా.. వారిలో 4,94,207 మంది విద్యార్థులు రెగ్యులర్ గా, 11,606 మంది విద్యార్థులు ప్రైవేంట్ గా హాజరయ్యారు. పదవ తరగతి పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థుల ఎలాంటి నిరుత్సాహం పడాల్సిన అవసరం లేదని.. సప్లమెంటరీ ఎగ్జామ్ రాసి మంచి మార్కులు సాధించుకోవచ్చని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ తెలిపారు. ఈ క్రమంలోనే పదవ తరగతి విద్యార్ధులకు గుడ్ న్యూస్ చెప్పారు. వివరాల్లోకి వెళితే..

తెలంగాణ టెన్త్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు వచ్చాయ్. జూన్ 3 నుంచి 13 వరకు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం టైం టేబుల్ రిలీజ్ చేశారు. తాజాగా వెల్లడైన టెన్త్ ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు మే 16వ తేదీలోపు వారు చదువుకున్న పాఠశాలల్లో పరీక్ష ఫీజు చెల్లించాలని కోరారు. అలాగే.. మార్కుల రీ కౌంటింగ్, రీ వేరిఫికేషన్ కోసం ఈ రోజు నుంచి 15 రోజుల్లోగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. రీ కౌంటింగ్ కి రూ.500, రీ వెరిఫికేషన్ కు రూ.1000 ఫీజు చెల్లించాలని ఆయన తెలపారు.

ఈ ఏడాది 3927 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయని బుర్రా వెంకటేశం స్పష్టం చేశారు. అలాగే ఈ విద్యాసంవత్సరానికి 6 పాఠశాలు సున్నా శాతం ఫలితాలు వచ్చాయని అన్నారు. రాష్ట్రంలో నిర్మల్ జిల్లా అన్ని జిల్లాల కన్నా 99.5 శాతం ఉత్తీర్ణత సాధించి ప్రథమ స్థానంలో ఉంది. అలాగే వికారాబాద్ జిల్లా అన్ని జిల్లాల కన్నా తక్కువ 65.10 శాతం సాధించి చివరి స్థానంలో ఉందన్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ గురుకుల పాఠశాల విద్యార్థుల్లో 98.71 శాతం ఉత్తీర్ణత నమోదు అయ్యింది. ఫెయిల్ అయిన విద్యార్థులు నిరుత్సాహ పడకుండా.. సమయాన్ని వృధా చేయకుండా బాగా ప్రిపేర్ అయి మంచి మార్కులు తెచ్చుకోవాలని ఆయన కోరారు.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి