iDreamPost
android-app
ios-app

Yashasvi Jaiswal: అండర్సన్‌కు చుక్కలు చూపించిన జైస్వాల్‌! ఒకే ఓవర్‌లో..

  • Published Feb 17, 2024 | 4:56 PM Updated Updated Feb 17, 2024 | 4:56 PM

టీమిండియా యంగ్ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ ఇంగ్లాండ్ దిగ్గజ బౌలర్ జేమ్స్ అండర్సన్ ను బెంబేలెత్తించాడు. రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ లో ఏకంగా..

టీమిండియా యంగ్ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ ఇంగ్లాండ్ దిగ్గజ బౌలర్ జేమ్స్ అండర్సన్ ను బెంబేలెత్తించాడు. రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ లో ఏకంగా..

Yashasvi Jaiswal: అండర్సన్‌కు చుక్కలు చూపించిన జైస్వాల్‌! ఒకే ఓవర్‌లో..

యశస్వీ జైస్వాల్.. అతి తక్కువ కాలంలోనే టీమిండియాలో కీలక ప్లేయర్ గా ఎదిగాడు ఈ బక్కపలచని ప్లేయర్. అద్భుతమైన ఆటతీరుతో మూడు ఫార్మాట్స్ లో ప్లేస్ దక్కించుకుని ముందుకుసాగుతున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో ఐకానిక్ ఆటతో అందరి ప్రశంసలు దక్కించుకుంటున్నాడు. రెండో టెస్ట్ లో కెరీర్ లో తొలి ద్విశతకం సాధించిన ఈ చిచ్చరపిడుగు.. జట్టుకు తిరుగులేని విజయాన్ని అందించాడు. ప్రస్తుతం రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ లో రెండో ఇన్నింగ్స్ లో సెంచరీతో చెలరేగాడు జైస్వాల్. మరీ ముఖ్యంగా ఇంగ్లాండ్ సీనియర్ బౌలర్ అయిన అండర్సన్ కు చుక్కలు చూపాడు.

రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ లో టీమిండియా యంగ్ ప్లేయర్ యశస్వీ జైస్వాల్ దుమ్మురేపుతున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో నిరాశపరిచిన ఈ యువ ఆటగాడు.. రెండో ఇన్నింగ్స్ లో మాత్రం చెలరేగిపోయాడు. ఇంగ్లాండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ.. సెంచరీతో స్కోర్ బోర్డ్ ను పరుగులు పెట్టిస్తున్నాడు. ఇక ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ సీనియర్ బౌలర్ జేమ్స్ అండర్సన్ బౌలింగ్ లో దంచికొట్టాడు జైస్వాల్. అండర్సన్ వేసిన ఇన్నింగ్స్ 27వ ఓవర్ లో యశస్వీ జైస్వాల్ చెలరేగాడు. ఈ ఓవర్లో వరుసగా 6, 4, 4 బాది సీనియర్ బౌలర్ కు చుక్కలు చూపాడు. ఎలాంటి బెరుకూ లేకుండా.. అనుభవం ఉన్న బౌలర్ పై ఎదురుదాడికి దిగిన తీరు అమోఘం.

ఈ ఓవర్ లో మూడో బంతిని డీప్ బ్యాక్ వర్డ్ స్వేయర్ లెగ్ లో జైస్వాల్ సిక్స్ కొట్టిన తీరు చూసితీరాల్సిందే. ఇక నెక్ట్స్ బాల్ నే థర్డ్ మ్యాన్ దిశగా ఫోర్ బాదాడు. ఆ తర్వాత కూడా పుల్ షాట్ ఆడి బౌండరీ తరలించాడు. దీంతో బిక్క మెుఖం వేశాడు దిగ్గజ బౌలర్.  ఈ క్రమంలోనే 122 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సులతో శతకం బాదాడు. మరి ఇంగ్లాండ్ దిగ్గజ బౌలర్ అండర్సన్ కు చుక్కలు చూపించిన యశస్వీ జైస్వాల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: Cheteshwar Pujara: వృద్ధ బ్యాటర్ అన్నారు.. రన్ మెషిన్ గా మారాడు..రంజీల్లో దడదడలాడిస్తున్న పుజారా!