SNP
ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20లో సిరీస్‌లో యంగ్ టీమిండియా అదరగొడుతోంది. ఓపెనర్ జైస్వాల్ కూడా సూపర్ ఫామ్‌లో ఆకట్టుకుంటున్నాడు.. అయితే.. రెండో టీ20లో విజయం తర్వాత అతను ఓ ఆటగాడికి క్షమాపణలు చెప్పినట్లు వెల్లడించాడు. ఆ విషయం ఏంటో పూర్తిగా తెలుసుకుందాం..
ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20లో సిరీస్‌లో యంగ్ టీమిండియా అదరగొడుతోంది. ఓపెనర్ జైస్వాల్ కూడా సూపర్ ఫామ్‌లో ఆకట్టుకుంటున్నాడు.. అయితే.. రెండో టీ20లో విజయం తర్వాత అతను ఓ ఆటగాడికి క్షమాపణలు చెప్పినట్లు వెల్లడించాడు. ఆ విషయం ఏంటో పూర్తిగా తెలుసుకుందాం..
SNP
ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటికే విశాఖపట్నం వేదికగా జరిగిన తొలి టీ20లో మంచి విజయం సాధించిన సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని యంగ్ టీమిండియా.. ఆదివారం తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కూడా ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో.. ఐదు టీ20ల సిరీస్‌లో 2-0 ఆధిక్యం పొందింది. అయితే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాపార్డర్‌లోని ముగ్గురు ఆటగాళ్లు హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ సూపర్ బ్యాటింగ్‌తో దుమ్మురేపారు. అయితే.. ఈ మ్యాచ్ తర్వాత యశస్వి మాట్లాడుతూ.. రుతురాజ్ గైక్వాడ్‌కు క్షమాపణలు చెప్పినట్లు వెల్లడించాడు.
తొలి మ్యాచ్‌లో 8 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 23 పరుగులు చేసిన జైస్వాల్.. ఈ మ్యాచ్‌లో ఏకంగా ఫాస్ట్ ఫిఫ్టీతో ఆకట్టుకున్నాడు. కేవలం 25 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సులతో 53 రన్స్ చేసిన అదరగొట్టాడు. ముఖ్యంగా సీన్ అబాట్ బేసిన ఇన్నింగ్స్ 4వ ఓవర్‌లో అయితే వరుసగా మూడు ఫోర్లు, రెండు సిక్సులు బాది 24 పరుగులు పిండుకున్నాడు. ఇంతమంచి ఇన్నింగ్స్ ఆడిన జైస్వాల్.. రుతురాజ్‌కు ఎందుకు సారీ చెప్పాడని ఆలోచిస్తున్నారా? అందుకు కారణం ఆస్ట్రేలియాతో వైజాగ్‌లో జరిగిన తొలి మ్యాచ్. ఆ మ్యాచ్‌లో జైస్వాల్ తప్పిదంతో రుతురాజ్ ఒక్క బాల్ కూడా ఆడకుండా రనౌట్ రూపంలో డైమండ్ డక్ అయిన విషయం తెలిసిందే.
రుతురాజ్ రనౌట్‌కు తానే కారణం అని, తన తప్పిదంతోనే రుతు అవుట్ అయ్యాడని జైస్వాల్ ఒప్పుకున్నాడు. ఆ విషయంపై రుతు భాయ్‌కి తాను సారీ చెప్పానని వెల్లడించాడు. అయితే.. రుతు భాయ్ ఎంతో ఉన్నత వ్యక్తిత్వం ఉన్న వాడని, ఇలాంటి తప్పులు ఆటలో జరుగుతుంటాయని తనతో చెప్పిట్లు జైస్వాల్ పేర్కొన్నాడు. రుతు భాయ్ తనను ఎంతో సపోర్ట్ చేస్తూ ఉంటాడంటూ జైస్వాల్ తెలిపాడు. సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఒక యంగ్ ప్లేయర్ తప్పిదానికి తాను బలైనా కూడా రుతురాజ్ ఎంతో హుందాగా వ్యవహరించిన తీరుపై అప్పుడే ప్రశంసలు కురిశాయి. ఇప్పుడు జైస్వాల్ చెప్పిన తర్వాత.. రుతురాజ్‌పై క్రికెట్ అభిమానులు మరింత అభిమానం కురిపిస్తున్నారు. టీమ్‌లో ఇలాంటి వాతావరణం ఉండటంతో ఎంతో మంచిదని అంటున్నారు. మరి జైస్వాల్.. రుతురాజ్‌కు సారీ చెప్పడం, దానికి అతను రియాక్ట్ అయిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Jaiswal said “Rutu Bhai is so humble, I told sorry to him after the run-out & he replied that it will happen in games – he supports me a lot”. pic.twitter.com/ZpMdr6CLVp
— Johns. (@CricCrazyJohns) November 26, 2023
Selfish Yashasvi Jaiswal
Last time Ruturaj Gaikwad sacrificed his wicket for him
Yashasvi know that Ruturaj is his direct competitor for opening spot thats why he deliberately runs him out#RuturajGaikwad#Jaiswal pic.twitter.com/Mx8CZj5Sbh— mufaddal vohra (@msd3455) November 24, 2023