SNP
ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ జైస్వాల్ డబుల్ సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. అయితే.. 22 ఏళ్లకే ఇన్ని ఘనతలు సాధించాడా అంటూ అతని పాత రికార్డులు గురించి తెలుసుకుంటూ క్రికెట్ లోకం ఆశ్చర్యపోతుంది. అవేంటో ఇప్పుడు మనమూ తెలుసుకుందాం..
ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ జైస్వాల్ డబుల్ సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. అయితే.. 22 ఏళ్లకే ఇన్ని ఘనతలు సాధించాడా అంటూ అతని పాత రికార్డులు గురించి తెలుసుకుంటూ క్రికెట్ లోకం ఆశ్చర్యపోతుంది. అవేంటో ఇప్పుడు మనమూ తెలుసుకుందాం..
SNP
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది క్రికెట్ టౌన్‌గా మారిపోయాడు. విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో సంచలన బ్యాటింగ్ ప్రదర్శనతో ఏకంగా డబుల్ సెంచరీతో చెలరేగాడు. జట్టు మొత్తం విఫలమైనా.. తానొక్కడే ఇంగ్లండ్‌కు వ్యతిరేకంగా నిలబడి.. ఇంగ్లండ్ వర్సెస్ జైస్వాల్‌లా మ్యాచ్‌ను కొనసాగించాడు. రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ వంటి స్టార్లు పరుగులు చేయలేక అవుటై పిచ్‌పై.. ఎలా ఆడాలో చూపిస్తూ.. ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోస్తూ.. 209 పరుగులు చేసి ఇండియాకు మంచి స్కోర్ అందించాడు. అయితే.. ఈ క్రమంలోనే జైస్వాల్ గత రికార్డులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కేవలం 22 ఏళ్ల కుర్రాడు ఇన్ని ఘనతలు సాధించాడా అంటూ క్రికెట్ లోకం నివ్వెరపోతోంది. అవేంటో ఇప్పుడు చూద్దాం..
2023లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌తో జైస్వాల్ టెస్టు క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆడిన తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. తాజాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. తొలి మ్యాచ్‌లో ఇండియా ఓడిపోయినా.. జైస్వాల్ తొలి ఇన్నింగ్స్‌లో 80 పరుగులు చేసి రాణించాడు. ఇప్పుడు ఏకంగా డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఇలా ఓ 22 ఏళ్ల కుర్రాడు.. దాదాపు 20 ఏళ్ల అనుభవం ఉన్న అండర్సన్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఆడుతున్న తీరు చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. అలాగే అతను దేశవాళి క్రికెట్‌లో సాధించిన రికార్డుల గురించి విని నివ్వెరపోతున్నారు.
మంచినీళ్లు తాగినంత సులువుగా జైస్వాల్‌కు సెంచరీలు, డబుల్ సెంచరీలు చేయడం అలవాటు. మంచి స్టార్ట్ లభిస్తే.. దాన్ని బిగ్ స్కోర్‌గా మలుస్తూ ఉంటాడు. ఆ క్రమంలోనే.. ఫస్ట్ క్రికెట్‌లో డబుల్ సెంచరీ, లిస్ట్-ఏ క్రికెట్‌లో డబుల్ సెంచరీ, ఇప్పుడు అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించాడు. అలాగే అండర్ 19 వరల్డ్ కప్ టోర్నీలో సెంచరీ, రంజీల్లో సెంచరీ, ఇరానీ కప్‌లో సెంచరీ, దులీప్ ట్రోఫీలో సెంచరీ, విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీ, ఇండియా-ఏ తరఫున సెంచరీ, ఐపీఎల్‌లో సెంచరీ, అరంగేట్రం టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ, అంతర్జాతీయ టీ20ల్లో సెంచరీ.. ఇలా ఆడిన ప్రతిదాంట్లో సెంచరీ కచ్చితంగా ఉంది. ఈ రికార్డులు చూసి.. మాజీ క్రికెటర్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక వన్డే క్రికెట్‌లోకి అరంగేట్రం చేసి.. అందులో సెంచరీ చేయడమే ఒక్కటే మిగిలి ఉంది. వీలైనంత త్వరలోనే అది కూడా జరిగిపోతుందని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. మరి ఇలా ప్రొఫెషనల్ క్రికెట్‌లోకి వచ్చినప్పటి నుంచి సెంచరీల మోత మోగిస్తూ.. టీమిండియా ఫ్యూచర్ స్టార్‌గా మారుతున్న జైస్వాల్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Double hundred in FC
Double hundred in list A
Double hundred in Test
Hundred in U-19 WC
Hundred in Ranji
Hundred in Irani Cup
Hundred in Duleep Trophy
Hundred in Vijay Hazare
Hundred in India A
Hundred in IPL
Hundred in Test debut
Hundred in T20IJaiswal is just 22 years old 🫡 pic.twitter.com/LxeRrZKGNW
— Johns. (@CricCrazyJohns) February 3, 2024