వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో అరంగేట్ర ఆటగాడు యశస్వీ జైస్వాల్ దుమ్మురేపాడు. విండీస్ బౌలర్లను ఓ ఆట ఆడుకుంటూ.. భారీ శతకం సాధించాడు. ఈ క్రమంలోనే 387 బంతులు ఎదుర్కొని 16 ఫోర్లు, ఓ సిక్స్ తో 171 పరుగులు చేసి వెనుదిరిగాడు ఈ నయా సంచలనం. ఇక తొలి మ్యాచ్ లోనే సెంచరీ చేయడం ద్వారా ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు జైస్వాల్. ఇక తన తొలి టెస్ట్ సెంచరీ గురించి తాజాగా స్పందించాడు. ఎమోషనల్ అవుతూ.. తన డెబ్యూ సెంచరీని వారికి అంకితం ఇస్తున్నట్లు తెలిపాడు. మరి జైస్వాల్ తన శతకాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడో ఇప్పుడు తెలుసుకుందాం.
వెస్టిండీస్ పై భారీ శతకం తర్వాత యశస్వీ మీడియాతో మాట్లాడుతూ.. భావోద్వేగానికి గురైయ్యాడు. తన ఫస్ట్ సెంచరీని తన తల్లిదండ్రులకు అంకితం ఇస్తున్నట్లుగా తెలిపాడు. సెంచరీ తర్వాత యశస్వీ జైస్వాల్ మాట్లాడుతూ..”సెంచరీ చేసిన తర్వాత నేను చాలా ఎమోషనల్ కు గురైయ్యాను. నా కెరీర్ లో నాకు సహాయం చేసినవారందరికి ధన్యవాదాలు. ఈ శతకాన్ని నా తల్లిదండ్రులకు అద్భుతమైన ప్రేమతో అంకితం ఇస్తున్నాను. నా సుదీర్ఘ ప్రయాణంలో వారి సహకారం మర్చిపోలేను. ఇది ప్రారంభం మాత్రమే. భవిష్యత్ లో మెరుగ్గా రాణిస్తాను” అంటూ ఎమోషనల్ అయ్యాడు జైస్వాల్.
ఇక ఈ భారీ శతకంతో దాదాపుగా ఒక పది రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు జైస్వాల్. క్రికెట్ చరిత్రలో మరే ఇతర ఆటగాడు కూడా.. తన డెబ్యూ మ్యాచ్ లో ఇన్ని రికార్డులు నెలకొల్పలేదు అంటే అతిశయోక్తి కాదేమో. ఏది ఏమైనప్పటికీ తన తొలి సెంచరీని తన తల్లిదండ్రులకు అంకితం ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదికూడా చదవండి: కొనసాగుతున్న జైస్వాల్ రికార్డుల జైత్రయాత్ర! మరో ఘనత..