SNP
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఇంగ్లండ్‌పై సెంచరీ బాదాడు. అయితే.. ఈ మ్యాచ్‌లో జైస్వాల్ ఆటతో టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్‌ను గుర్తుకు తెచ్చాడు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఇంగ్లండ్‌పై సెంచరీ బాదాడు. అయితే.. ఈ మ్యాచ్‌లో జైస్వాల్ ఆటతో టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్‌ను గుర్తుకు తెచ్చాడు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
SNP
టీమిండియా యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్.. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో సత్తా చాటుతున్నాడు. రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ లాంటి స్టార్లు విఫలమైన చోట ఏకంగా.. సెంచరీతో చెలరేగాడు. విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో జైస్వాల్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. 149 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సులతో సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ స్టైల్‌ను ఫాలో అయ్యాడు జైస్వాల్. ఇది చూసిన ఫ్యాన్స్.. హేయ్.. సెహ్వాగ్ మళ్లీ వచ్చాడంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అసలు సెహ్వాగ్‌ను జైస్వాల్ ఎలా గుర్తుకు తెచ్చాడో ఇప్పుడు చూద్దాం..
99 పరుగుల వద్ద ఉన్న సమయంలో కూడా మెల్లగా ఆడి సెంచరీ పూర్తి చేసుకోకుండా.. రిస్క్ తీసుకుని మరీ సిక్స్‌తో సెంచరీ పూర్తి చేయడం సెహ్వాగ్ స్టైల్. 99 అనే కాదు.. సిక్స్‌తో సెంచరీ మార్క్ అందుకోవడం సెహ్వాగ్‌కు అలవాటు. ఏం మాత్రం భయం లేకుండా ఆడే సెహ్వాగ్ ఆట అంటే భారత క్రికెట్ అభిమానులందరికీ పిచ్చి. సెంచరీ మిస్ అవుతామేమో అనే భయం కానీ, సెంచరీ పూర్తి చేసుకోవాలనే ఆశకానీ అస్సలు ఉండదు. బాల్ మన స్లాట్‌లో పడిందా..అది సిక్స్‌కు పంపాలనే కసి మాత్రమే ఉంటుంది సెహ్వాగ్‌లో. ఇప్పుడు జైస్వాల్ కూడా సేమ్ అదే ఫాలో అయ్యాడు. 94 పరుగులు వద్ద ఉన్న సమయంలో.. టామ్ హార్ట్లీ వేసిన ఇన్నింగ్స్ 49వ ఓవర్ మూడో బంతికి భారీ సిక్స్ బాది.. సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
ఆ తర్వాత స్పెషల్ సెలబ్రేషన్స్‌తో మరింత ఆకట్టుకున్నాడు జైస్వాల్. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి మ్యాచ్‌లో విఫలమైన కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో కూడా ఫెయిల్ అయ్యాడు. కేవలం 14 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన శుబ్‌మన్ గిల్ సైతం 34 పరుగులు మాత్రమే చేసి నిరాశపర్చాడు. ఇప్పటికే తొలి మ్యాచ్ ఓటమితో టీమిండియా తీవ్ర విమర్శలు వస్తున్న క్రమంలో రెండో మ్యాచ్‌లో ఎలాగైన గెలవాలన కసిలో రోహిత్ సేన ఉంది. జైస్వాల్ ఒక్కడే అందుకు తగ్గట్లు ఆడుతున్నాడు. జైస్వాల్ సెంచరీతో అతని చూసి మిగతా బ్యాటర్లు నేర్చుకోవాలనే విమర్శలు వస్తున్నాయి. మరి ఈ మ్యాచ్‌లో సెహ్వాగ్ స్టైల్లో సిక్స్‌తో సెంచరీ పూర్తి చేసుకున్న జైస్వాల్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
A TEST HUNDRED WITH A SIX…!!! 🤯
– Yashasvi Jaiswal special in Vizag.pic.twitter.com/C3QuPjjRBQ
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 2, 2024