iDreamPost
android-app
ios-app

కొనసాగుతున్న జైస్వాల్ రికార్డుల జైత్రయాత్ర! మరో ఘనత..

  • Author Soma Sekhar Published - 08:55 PM, Fri - 14 July 23
  • Author Soma Sekhar Published - 08:55 PM, Fri - 14 July 23
కొనసాగుతున్న జైస్వాల్ రికార్డుల జైత్రయాత్ర! మరో ఘనత..

వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో దుమ్మురేపుతున్నాడు అరంగేట్ర ప్లేయర్ యశస్వీ జైస్వాల్. ఆడిన తొలి టెస్ట్ లోనే భారీ శతకంతో కదంతొక్కాడు ఈ నయా సంచలనం. ఇక సెంచరీతో పలు రికార్డులను కొల్లగొట్టిన జైస్వాల్.. మూడో రోజు ఆట ప్రారంభం కాగానే 150 పరుగుల మార్క్ ను అందుకున్నాడు. దాంతో మరికొన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు ఈ యంగ్ ప్లేయర్. దాంతో తన రికార్డుల జైత్రయాత్రను కొనసాగిస్తూనే ఉన్నాడు. కాగా.. జైస్వాల్ ఊపుచూస్తే సింపుల్ గా డబుల్ సెంచరీ చేస్తాడనిపిస్తోంది. మరి తాజాగా జైస్వాల్ కొల్లగొట్టిన రికార్డు లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

యశస్వీ జైస్వాల్.. క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు ఈ పేరు ఓ సంచలనం. తొలి టెస్ట్ మ్యాచ్ లోనే రికార్డుల మోత మోగిస్తున్నాడు ఈ యువకెరటం. తన డెబ్యూ మ్యాచ్ లోనే సెంచరీ బాది ఇప్పటికే పలు రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు జైస్వాల్. కాగా.. మూడో రోజు ఆట ప్రారంభం కాగానే 150 మార్క్ ను అందుకున్నాడు. దాంతో మరో రెండు రికార్డులను తన పేరిట నమోదు చేసుకున్నాడు. ఇందులో మెుదటి రికార్డు ఏంటంటే? డెబ్యూ మ్యాచ్ లోనే 150 పరుగులు చేసిన ఐదో అతిపిన్న వయస్కుడిగా జైస్వాల్ రికార్డుల్లోకి ఎక్కాడు. యశస్వీ 21 సంవత్సరాల 196 రోజుల వయసులో ఈ ఘనత సాధించగా.. ఈ లిస్ట్ లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు పాక్ దిగ్గజం జావిద్ మియాందాద్. జావిద్ ఈ రికార్డును 19 ఏళ్ల 119 రోజులకే సాధించాడు.

ఇక రెండో రికార్డు విషయానికి వస్తే.. తొలి మ్యాచ్ లోనే 150 పరుగులు చేసిన 3వ ఇండియన్ బ్యాటర్ గా రికార్డు సృష్టించాడు యశస్వీ జైస్వాల్. జైస్వాల్ కంటే ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ఈ ఘనత సాధించారు. ఇక ఈ మ్యాచ్ లో డబుల్ సెంచరీ సాధిస్తాడని అనుకున్న జైస్వాల్ 387 బంతులు ఎదుర్కొని 171 పరుగులు చేసి అల్జారీ జోసెఫ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. అందులో 16 ఫోర్లు, ఓ సిక్స్ కూడా ఉంది. మరి తొలి మ్యాచ్ లోనే రికార్డుల జైత్రయాత్ర కొనసాగిస్తున్న యశస్వీ జైస్వాల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.