iDreamPost

రషీద్ ఖాన్ వెరైటీ బౌలింగ్ యాక్షన్.. ఇలాంటిది ఎప్పుడూ చూసుండరు!

  • Author singhj Published - 10:33 AM, Wed - 25 October 23

ఆఫ్ఘానిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఎప్పుడూ తన బౌలింగ్, బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్​తో వార్తల్లో నిలుస్తుంటాడు. అయితే ఈసారి తన బౌలింగ్ యాక్షన్ కారణంగా వైరల్ అయ్యాడు.

ఆఫ్ఘానిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఎప్పుడూ తన బౌలింగ్, బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్​తో వార్తల్లో నిలుస్తుంటాడు. అయితే ఈసారి తన బౌలింగ్ యాక్షన్ కారణంగా వైరల్ అయ్యాడు.

  • Author singhj Published - 10:33 AM, Wed - 25 October 23
రషీద్ ఖాన్ వెరైటీ బౌలింగ్ యాక్షన్.. ఇలాంటిది ఎప్పుడూ చూసుండరు!

వన్డే వరల్డ్ కప్​-2023లో రెండు చిన్న టీమ్స్ అదిరిపోయే ఆటతీరుతో అందర్నీ ఇంప్రెస్ చేస్తున్నాయి. తమ గేమ్​తో ఫ్యాన్స్ మనసులు దోచుకుంటున్న ఈ రెండు జట్లు.. పెద్ద టీమ్స్​కు మాత్రం వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ఆ రెండు టీమ్స్ మరేవో కాదు.. ఒకటి నెదర్లాండ్స్, ఇంకొకటి ఆఫ్ఘానిస్థాన్. సౌతాఫ్రికాకు షాకిచ్చిన డచ్ జట్టు.. ఆ విజయం గాలివాటం కాదని నిరూపిస్తూ మిగిలిన మ్యాచుల్లోనూ శక్తికి, స్థాయికి మించిన పెర్ఫార్మెన్స్ ఇస్తోంది. ఆఫ్ఘానిస్థాన్ అయితే తాము పసికూనలం కాదని ప్రూవ్ చేసుకునేందుకు కసితో ఆడుతూ రెండు పెద్ద టీమ్స్​పై విక్టరీ కొట్టింది.

తొలుత డిఫెండింగ్ ఛాంపియన్​ ఇంగ్లండ్​ను ఓడించిన ఆఫ్ఘానిస్థాన్.. రీసెంట్​ మ్యాచ్​లో పాకిస్థాన్​ను చిత్తు చేసింది. ఇంగ్లీష్ టీమ్​పై తాము అదృష్టంతో గెలవలేదని.. పాక్​పై గెలుపు ద్వారా ప్రూవ్ చేసింది. పాకిస్థాన్​తో మ్యాచ్​లో ఆఫ్ఘాన్ ఆడిన తీరు అద్భుతమనే చెప్పాలి. ఆ మ్యాచ్​లో ఆఫ్ఘాన్ కాదు.. పాక్ పసికూన టీమ్​లా కనిపించింది. స్పిన్​కు అనుకూలించే పిచ్​ మీద యంగ్ స్పిన్నర్ నూర్ అహ్మద్ (3/49) పాక్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. బ్యాటింగ్​లో రహ్మత్ షా (77 నాటౌట్), గుర్బాజ్ (65), ఇబ్రహీం జాద్రాన్ (87), హష్మతుల్లా (48 నాటౌట్)లు అదరగొట్టారు. ఎలాంటి బెరుకు, ఆందోళన లేకుండా అటాకింగ్ గేమ్ ఆడుతూ టార్గెట్​ను కూల్​గా ఛేదించారు.

ఇంగ్లండ్​తో మాదిరిగానే సాధికారికంగా ఆడి పాకిస్థాన్​ను చిత్తు చేసింది ఆఫ్ఘానిస్థాన్. ముఖ్యంగా ఆ టీమ్ బ్యాటర్లు బౌండరీలు, సిక్సుల మీదే ఆధారపడకుండా సింగిల్స్, డబుల్స్​తో స్ట్రైక్ రొటేట్ చేశారు. పాక్ బౌలర్లకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా టార్గెట్​ను ఛేజ్ చేశారు. ఆ దేశ క్రికెట్ హిస్టరీలో ఈ వరల్డ్ కప్ ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెప్పొచ్చు. ఇక, పాక్​తో మ్యాచ్​లో స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (0/44) వికెట్ తీయలేకపోయాడు. కానీ అతడు బౌలింగ్ వేస్తున్న టైమ్​లో ఏ బంతికి వికెట్ పడుతుందో అన్నంత ఉత్కంఠ రేగింది. ముజీబ్​తో కలసి రషీద్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. దీంతో పాక్ బ్యాటర్లు ఒత్తిడిలో పడి యంగ్ స్పిన్నర్ నూర్ అహ్మద్​కు వికెట్లు అప్పగించారు.

ఇక, పాక్​తో ఆఫ్ఘాన్ మ్యాచ్​ స్టార్ట్ అయ్యేందుకు ముందు రషీద్ ఖాన్ వెరైటీ బౌలింగ్ యాక్షన్​తో బాల్స్ వేస్తూ ఆకట్టుకున్నాడు. ఏకంగా రెండు బంతుల్ని తన చేతిలో బిగించి బౌలింగ్ వేయడగమే గాక స్పిన్‌ చేశాడు. ఇది చూసిన నెటిజన్స్.. ఇలాంటి బౌలింగ్ ఎప్పుడూ చూడలేదని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇదెక్కడి మాస్ బౌలింగ్​ రా మావా అంటున్నారు. రషీద్​.. అవి చేతులా? లేదా ఇనుప రాడ్లా? అలా ఎలా బౌలింగ్ చేశావ్ బ్రో అని ప్రశ్నిస్తున్నారు ఫ్యాన్స్. బౌలింగ్ మిషన్ మాదిరిగా రెండు బంతుల్ని హోల్డ్ చేసి ఒకేసారి ఎలా వేశావని క్వశ్చన్ చేస్తున్నారు. మరి.. రషీద్ వెరైటీ బౌలింగ్​పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: World Cup 2023: ఇంగ్లండ్‌ కంటే పాక్‌పై గెలుపు ఆఫ్ఘాన్‌కు ఎందుకంత స్పెషల్‌? ఫుల్‌ స్టోరీ

 

View this post on Instagram

 

A post shared by Nandan Singh Negi (@nsnegi_)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి