iDreamPost

Hardik Pandya: పాండ్యా క్రేజీ ఫీట్.. ఏకంగా సౌరవ్ గంగూలీ రికార్డ్ నే బద్దలు కొట్టాడు!

SRHతో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అరుదైన ఘనతను సాధించాడు. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజం సౌరవ్ గంగూలీ క్రేజీ రికార్డ్ ను బద్దలు కొట్టాడు. ఆ వివరాల్లోకి వెళితే..

SRHతో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అరుదైన ఘనతను సాధించాడు. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజం సౌరవ్ గంగూలీ క్రేజీ రికార్డ్ ను బద్దలు కొట్టాడు. ఆ వివరాల్లోకి వెళితే..

Hardik Pandya: పాండ్యా క్రేజీ ఫీట్.. ఏకంగా సౌరవ్ గంగూలీ రికార్డ్ నే బద్దలు కొట్టాడు!

IPL 2024 సీజన్ లో ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపుగా కోల్పోయిన ముంబై ఇండియన్స్.. వేరే జట్లను ఇంటికి పంపించే పనిలో పడినట్లుగా ఉంది. తాజాగా సన్ రైజర్స్ తో జరిగిన కీలక మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బంతితో రాణించి, ఆ  తర్వాత బ్యాట్ తో విజృంభించింది ముంబై. ఇక ఈ మ్యాచ్ ద్వారా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు ఎంఐ కెప్టెన్ పాండ్యా. ఈ క్రమంలోనే టీమిండియా దిగ్గజం సౌరవ్ గంగూలీ రికార్డ్ ను బద్దలు కొట్టాడు. ఆ వివరాల్లోకి వెళితే..

ముంబై  ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా రేర్ ఫీట్ ను సాధించాడు. సన్ రైజర్స్ తో జరిగిన ఈ మ్యాచ్ లో ఈ రికార్డ్ ను నమోదు చేశాడు. ఈ క్రమంలోనే భారత దిగ్గజం, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆల్ టైమ్ రికార్డ్ ను బ్రేక్ చేశాడు పాండ్యా. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక మ్యాచ్ లకు సారథ్యం వహించిన ఆటగాళ్ల జాబితాలో గంగూలీని ఓవర్ టేక్ చేశాడు హార్దిక్. ఇక కెప్టెన్ గా హార్దిక్ కు ఇది 43వ మ్యాచ్ కాగా.. గంగూలీ ఇప్పటి వరకు 42 ఐపీఎల్ మ్యాచ్ లకు కెప్టెన్ గా వ్యవహరించాడు. 2008 నుంచి 2012 వరకు దాదా కేకేఆర్, పూణే వారియర్స్ టీమ్స్ కు సారథ్యం వహించాడు. ఈ మ్యాచ్ ద్వారా దాదా రికార్డ్ బ్రేక్ చేశాడు హార్దిక్.

Pandya broke Dada's record!

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 రన్స్ చేసింది. జట్టులో ట్రావిస్ హెడ్(48), కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్(35*) రాణించారు. ముంబై బౌలర్లలో పియూష్ చావ్లా, హార్దిక్ తలా మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం 174 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబైని.. సూర్యకుమార్(102*) అజేయ శతకంతో గెలిపించాడు. ఓపెనర్లు ఇషాన్(9), రోహిత్(4), నమన్ ధీర్(0) విఫలం అయిన వేళ.. ముంబై విజయంపై ఆశలు వదులుకుంది. కానీ క్రీజ్ లోకి సూర్య రావడంతో.. ఆట పూర్తిగా ముంబై వైపు తిరిగింది.  51 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సులతో 102 పరుగులతో అజేయంగా నిలిచి, తిరుగులేని విజయాన్ని అందించాడు మిస్టర్ 360. అతడికి తోడు తిలక్ వర్మ(37*) అండగా నిలబడటంతో.. 17.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మరి హార్దిక్ పాండ్యా ఏకంగా దిగ్గజం సౌరవ్ గంగూలీ రికార్డ్ నే  బ్రేక్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి