iDreamPost
android-app
ios-app

కోహ్లీ నుంచి ఆ టెక్నిక్​ను యంగ్ ప్లేయర్లు నేర్చుకోవాలి: గంభీర్

  • Author singhj Published - 09:12 AM, Mon - 9 October 23
  • Author singhj Published - 09:12 AM, Mon - 9 October 23
కోహ్లీ నుంచి ఆ టెక్నిక్​ను యంగ్ ప్లేయర్లు నేర్చుకోవాలి: గంభీర్

వన్డే వరల్డ్ కప్-2023ని టీమిండియా విక్టరీతో మొదలుపెట్టింది. మెగా టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ ఆడిన రోహిత్ సేన ఇందులో విజయం సాధించింది. చెన్నైలోకి చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్​లో భారత్ 6 వికెట్ల తేడాతో నెగ్గింది. టాస్ గెలిచి బ్యాటింగ్​కు దిగిన ఆసీస్​ను టీమిండియా బౌలర్లు తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. భారత పేసర్లతో పాటు స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో కంగారూ బ్యాట్స్​మెన్ ఒక్కో రన్ చేసేందుకు ఆపసోపాలు పడ్డారు. ఎట్టకేలకు కమిన్స్ సేన 49.3 ఓవర్లలో 199 రన్స్​ మాత్రమే చేయగలిగింది. ఆసీస్​ను ఆలౌట్ చేయడంలో స్పిన్నర్లు కీలక పాత్ర పోషించారు. భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ కలసి 6 వికెట్లు తీశారు.

ఆసీస్ తర్వాత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఛేజింగ్ ఏమంత ఈజీ కాలేదు. స్కోరు బోర్డు మీదకు 2 పరుగులు చేరకుండానే ముగ్గురు బ్యాటర్లు పెవిలియన్​కు చేరారు. ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్​ కిషన్​తో పాటు వన్​ డౌన్​లో వచ్చిన శ్రేయస్ అయ్యర్​ గోల్డెన్ డక్​గా వెనుదిరిగారు. దీంతో గెలిపించాల్సిన భారం విరాట్ కోహ్లీ (85), కేఎల్ రాహుల్ (97 నాటౌట్) పై పడింది. కానీ వాళ్లు ఏమాత్రం తడబడలేదు. ఆసీస్ పేసర్లను సంయమనంగా ఎదుర్కొన్నారు. ఒక్కో రన్ జోడిస్తూ, చెత్త బంతుల్ని బౌండరీలకు తరలించారు. ఈ క్రమంలో విరాట్ ఔటైనా.. హార్దిక్ పాండ్యా (11 నాటౌట్)తో కలసి రాహుల్​ టీమ్​కు విజయాన్ని అందించాడు.

ఈ మ్యాచ్​లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన కోహ్లీ, రాహుల్​ను అందరూ మెచ్చుకుంటున్నారు. వీళ్లిద్దరిపై టీమిండియా లెజెండ్ గౌతం గంభీర్ కూడా ప్రశంసల జల్లులు కురిపించాడు. ‘కోహ్లీ-రాహుల్ తీవ్ర​ ఒత్తిడిలోనూ చాలా బాగా బ్యాటింగ్ చేశారు. ఫిట్​నెస్​ లెవల్స్ మెయింటెయిన్ చేయడం, వికెట్ల మధ్య పరుగులు తీయడం ఎలాగో కోహ్లీని చూసి యంగ్ క్రికెటర్లు నేర్చుకోవాలి. డాట్ బాల్స్​ను తగ్గించడం, స్ట్రైక్ రొటేట్ చేస్తూ బౌలర్లపై ఒత్తిడి పెంచడం ఎలాగో విరాట్​ బ్యాటింగ్​ను చూస్తే అర్థమవుతుంది’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు. విరాట్ ఎక్కువగా రిస్క్ తీసుకోడని.. కానీ అతడి డాట్ బాల్ పర్సంటేజీ తక్కువగా ఉంటుందన్నాడు గంభీర్. స్ట్రైక్ రొటేట్ చేయడమే కోహ్లీ సక్సెస్ సీక్రెట్ అని గౌతీ పేర్కొన్నాడు. మరి.. కోహ్లీపై గంభీర్ చేసిన వ్యాఖ్యల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: సచిన్ రికార్డును బ్రేక్ చేసిన కోహ్లీ.. అందుకే ఛేజ్ మాస్టర్ అనేది!