ప్రపంచ కప్‌లో తమకు తిరుగులేదని భారత్ మరోమారు ప్రూవ్ చేసింది. విజయాల్లో డబుల్ హ్యాట్రిక్ సాధించిన టీమిండియా.. లంకతో ఇవాళ జరిగిన మ్యాచ్‌లోనూ నెగ్గి సెమీస్ బెర్త్‌ను అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసుకుంది.
ప్రపంచ కప్‌లో తమకు తిరుగులేదని భారత్ మరోమారు ప్రూవ్ చేసింది. విజయాల్లో డబుల్ హ్యాట్రిక్ సాధించిన టీమిండియా.. లంకతో ఇవాళ జరిగిన మ్యాచ్‌లోనూ నెగ్గి సెమీస్ బెర్త్‌ను అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసుకుంది.
వన్డే వరల్డ్ కప్-2023లో టీమిండియా మరో విజయాన్ని అకౌంట్లో వేసుకుంది. విజయాల్లో డబుల్ హ్యాట్రిక్‌ను పూర్తి చేసుకున్న రోహిత్ సేన.. తాజాగా లంకపై మరో విక్టరీని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో 302 రన్స్ తేడాతో భారీ విక్టరీని నమోదు చేసింది. లంకపై గెలుపుతో మెగా టోర్నీలో సెమీఫైనల్‌కు అధికారికంగా చేరుకున్న ఫస్ట్ టీమ్‌గా టీమిండియా నిలిచింది. ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 357 రన్స్ చేసింది. భారత ఇన్నింగ్స్‌లో శుబ్‌మన్ గిల్ (92), విరాట్ కోహ్లీ (88), శ్రేయస్ అయ్యర్ (82) అదరగొట్టారు. ఆఖర్లో రవీంద్ర జడేజా (35) విలువైన్ రన్స్ చేశాడు. ఛేజింగ్‌కు దిగిన లంక 19.4 ఓవర్లలో 55 రన్స్‌కే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయం వెనుక ఉన్న 5 ప్రధాన కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
శ్రీలంకతో మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగింది టీమిండియా. అయితే మంచి స్టార్ట్ లభించలేదు. కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ (4) తక్కువ స్కోరుకే ఔటై పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ (88)పై ఒత్తిడి పడింది. కానీ మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ (92)తో కలసి ఆదుకున్నాడు. వీళ్లిద్దరూ కలసి సెకండ్ వికెట్‌కు 189 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు. ఇద్దరూ భారీ ఇన్నింగ్స్ ఆడటం భారత్‌ను నిలబెట్టింది. వీళ్లిద్దరి పార్ట్నర్షిప్ భారత్ విజయంలో ప్రధాన కారణాల్లో ఒకటిగా చెప్పొచ్చు. గిల్, కోహ్లీతో పాటు శ్రేయస్ అయ్యర్ (82), రవీంద్ర జడేజా (35) కూడా బ్యాట్‌తో మెరిశారు. ఇలా బ్యాటర్లు అందరూ రాణించడంతో భారత్ భారీ స్కోరును లంక ముందు ఉంచింది. వరుసగా ఏడో విక్టరీ సాధించడంలో ప్రధాన కారణాల్లో ఇదొకటిగా చెప్పొచ్చు.
లంకతో మ్యాచ్‌లో గిల్, కోహ్లీ ఔటయ్యాక క్రీజులోకి వచ్చాడు శ్రేయస్ అయ్యర్. వరుసగా ఫెయిల్ అవుతున్న అయ్యర్ ఈ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 56 బంతుల్లో 82 రన్స్ చేసి లంక బౌలర్లను బెదరగొట్టాడు అయ్యర్. అతడి మెరుపు బ్యాటింగ్ వల్లే టీమిండియా 350 ప్లస్ స్కోరు చేసింది. కాబట్టి ఈ మ్యాచ్‌లో భారత్ గెలుపులో అయ్యర్ బ్యాటింగ్ ఒక కారణంగా చెప్పొచ్చు. ఇక, లంకను త్వరగా ఆలౌట్ చేసిన పేస్ బౌలర్ల ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే. బుమ్రా (1 వికెట్), సిరాజ్ (3 వికెట్లు), షమి (5 వికెట్లు) తమ పేస్ మ్యాజిక్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను పోయించారు.
పేసర్లు వరుసగా వికెట్లు తీయడం టీమిండియా గెలుపులో ప్రధాన కారణాల్లో ఒకటిగా చెప్పొచ్చు. ఇక ఆఖరిగా చెప్పుకోవాల్సిన కారణం టాస్ ఓడిపోవడం. భారత్ టాస్ ఓడిపోవడంతో మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోరు చేసింది. తర్వాత ప్రత్యర్థిని 55 పరుగులకే కుప్పకూల్చింది. టాస్ నెగ్గిన లంక కెప్టెన్ కుశాల్ మెండిస్ బ్యాటింగ్‌కు ఆహ్వానించడం రోహిత్ సేనకు బాగా కలిసొచ్చింది. మరి.. భారత్ వరుసగా 7వ విజయం సాధించడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: కోహ్లీ, గిల్ కోసం ఇషాన్ సాహసం.. వాళ్ల ఫ్రెండ్షిప్ అలాంటిది!
– Defeated Australia by 6 wickets.
– Defeated Afg by 8 wickets.
– Defeated Pakistan by 7 wickets.
– Defeated Ban by 7 wickets.
– Defeated NZ by 4 wickets.
– Defeated England by 100 runs.
– Defeated Sri Lanka by 302 runs.The most dominating World Cup for India….!!!! pic.twitter.com/l73Yd65NUW
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 2, 2023