iDreamPost
android-app
ios-app

శ్రీలంక క్రికెట్ బోర్డు రద్దు.. ఆ దేశ క్రీడా శాఖ మంత్రి కీలక నిర్ణయం! ఎందుకంటే?

  • Author singhj Published - 12:49 PM, Mon - 6 November 23

అసలే వరుస ఓటములతో దిక్కుతోచని స్థితిలో ఉన్న లంక క్రికెట్​లో ముసలం రేగింది. ఆ దేశ క్రికెట్ బోర్డును క్రీడా మంత్రిత్వ శాఖ రద్దు చేసింది. అసలు ఆ దేశ స్పోర్ట్స్ మినిస్ట్రీ ఎందుకిలా చేసిందంటే..

ఛాంపియన్ టీమ్ అయిన శ్రీలంక ఈ వరల్డ్ కప్​లో ఘోరంగా విఫలం అవుతోంది. ఆ జట్టు పెర్ఫార్మెన్స్ రోజురోజుకీ మరింతగా దిగజారుతోంది. అసలు ఆడుతోంది లంకేనా అన్నట్లుగా ఉంది ఆటతీరు. వరుస వరల్డ్ కప్స్​లో ఫైనల్ చేరుకొని.. ఐసీసీ టోర్నీల్లో అందర్నీ గడగడలాడించిన లంక టీమ్ ఇప్పుడు దారుణ ఆటతీరుతో ఛాంపియన్స్ ట్రోఫీకి క్వాలిఫై అవ్వడం కోసం ఫైట్ చేస్తోంది. ఒకవైపు దారుణమైన ఆటతీరు, మరోవైపు కీలక ప్లేయర్లకు ఇంజ్యురీలు కావడంతో ఎటూ తోచని స్థితిలో లంక క్రికెట్​లో పెను సంచలనం. ఒక వార్త ఆ దేశ క్రికెట్​ను కుదిపేసింది. ఇటీవల టీమిండియా చేతుల్లో ఘోర ఓటమి పాలైన శ్రీలంక.. వరల్డ్ కప్ సెమీస్ చేరడంలో ఫెయిల్ అయిన విషయం తెలిసిందే.

వరల్డ్ కప్-2023 సెమీస్​కు చేరడంలో తమ టీమ్ ఫెయిలైన నేపథ్యంలో శ్రీలంక క్రీడా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న క్రికెట్ బోర్డు (ఎల్​ఎల్​సీబీ)ని తొలగిస్తున్నట్లు లంక స్పోర్ట్స్ మినిస్టర్ రోషన్ రణసింఘే ప్రకటించారు. అలాగే వెంటనే ఒక తాత్కాలిక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. 1996 వరల్డ్ కప్​ను నెగ్గిన టీమ్​కు కెప్టెన్​గా వ్యవహరించిన అర్జున రణతుంగను నూతన తాత్కాలిక బోర్డు ఛైర్మన్​గా నియమించారు. రణతుంగ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన ప్యానెల్ ఏర్పాటైంది. ఇందులో సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి, మాజీ బోర్డు అధ్యక్షుడు కూడా ఉన్నారు. ఈ కమిటీని 1973లోని స్పోర్ట్స్ లా నంబర్ 25 అధికారాల ప్రకారం నియమించామని శ్రీలంక క్రికెట్ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. మరి.. లంక క్రికెట్​లో ముసలంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: కోహ్లీ 49వ సెంచరీ చేయడంపై స్పందించిన సచిన్‌! 365 రోజులు పట్టిందంటూ..