iDreamPost

రోహిత్​పై కోహ్లీకి అసూయ? పాక్​తో మ్యాచే ఎగ్జాంపుల్!

  • Author singhj Updated - 04:18 PM, Mon - 16 October 23
  • Author singhj Updated - 04:18 PM, Mon - 16 October 23
రోహిత్​పై కోహ్లీకి అసూయ? పాక్​తో మ్యాచే ఎగ్జాంపుల్!

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. ఈ ఇద్దరూ భారత టీమ్​కు వెన్నెముకగా చెప్పొచ్చు. వీళ్లలో ఒకరు ప్రస్తుత కెప్టెన్ అయితే, మరొకరు మాజీ సారథి. గ్రౌండ్​లోకి దిగితే కూల్​గా తన పని తాను చేసుకోవడం ఒకరి స్టైల్. మైదానంలోకి దిగితే ఫుల్ అగ్రెషన్​తో అపోజిషన్​నను కోలుకోలేకుండా చేయడం మరొకరి పద్ధతి. ఎన్నో ఏళ్లుగా టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు రోహిత్-విరాట్. అయితే వీళ్లిద్దరి మధ్య గొడవలున్నాయని, ఒకరంటే ఒకరికి పడదని ఎన్నోసార్లు వార్తలు వచ్చాయి. రోహిత్​కు మద్దతుగా ఓ వర్గం ఒకవైపు.. కోహ్లీకి సపోర్టుగా మరో గ్రూప్ ఒకవైపు టీమ్​లో ఉన్నాయని చాలా సార్లు రూమర్స్ వినిపించాయి.

రాహుల్ ద్రవిడ్ టీమిండియా కోచ్​గా పగ్గాలు చేపట్టాక పరిస్థితుల్లో మార్పు వచ్చింది. రోహిత్-విరాట్​లు మునుపటి కంటే మరింత ఫ్రెండ్లీగా కనిపిస్తున్నారు. భారత ఫీల్డింగ్ టైమ్​లో కీలక డెసిషన్స్​లో హిట్​మ్యాన్​కు కోహ్లీ అండగా ఉండటాన్ని, విలువైన సూచనలు ఇవ్వడాన్ని గమనించే ఉంటారు. ఆసియా కప్ నెగ్గడం, ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్​లో విక్టరీ.. ఇప్పుడు వరల్డ్ కప్​లో వరుస విజయాలతో భారత జట్టు ఫుల్ జోష్​లో ఉంది. ఈసారి కప్పు మనదే అనే ధీమా ప్లేయర్లందరిలో కనిపిస్తోంది. అయితే రోహిత్-విరాట్ మధ్య బయటకు కనిపించని పోటీ నడుస్తున్నట్లు అనిపిస్తోంది. ఇందుకు శనివారం జరిగిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎంగ్జాపుల్ అని చెప్పొచ్చు.

పాక్​తో మ్యాచ్​లో ఫీల్డింగ్ టైమ్​లో రోహిత్​తో మాట్లాడుతూ, అతడికి సలహాలు ఇస్తూ కనిపించాడు కోహ్లీ. కానీ బ్యాటింగ్​లో మాత్రం ఇద్దరి మధ్య పోరు కనిపించింది. రోహిత్ విషయంలో విరాట్ అసూయతో ఉన్నట్లు అనిపించిందని సోషల్ మీడియాలో నెటిజన్స్ కూడా అంటున్నారు. దానికి కారణం.. అవసరం లేకున్నా హిట్​మ్యాన్​కు పోటీగా విరాట్ హిట్టింగ్​కు దిగడమే. వన్డేల్లో ముఖ్యంగా ఛేజింగ్ టైమ్​లో క్రీజులో కుదురుకున్నాకే కోహ్లీ షాట్స్ ఆడతాడు. కానీ పాక్​తో మ్యాచ్​లో ఒకవైపు రోహిత్ వరుసగా ఫోర్లు, సిక్సులతో దాయాది బౌలర్లను చీల్చిచెండాడుతున్నాడు.

రోహిత్ బ్యాట్​తో రెచ్చిపోతున్న టైమ్​లో విరాట్ కొట్టిన షాట్లు సరిగ్గా కనెక్ట్‌ కాలేదు. దీంతో సింగిల్స్, డబుల్స్​తో సరిపుచ్చుకోవాల్సిన పరిస్థితి. కానీ రోహిత్ మాత్రం నీళ్లు తాగినంత సులువుగా బాల్​ను బౌండరీకి తరలిస్తున్నాడు. గ్రౌండ్ మొత్తం రోహిత్.. రోహిత్ అంటూ ఒకటే అరుపులు, కేకలు. దీంతో రోహిత్​లాగే తానూ హిట్టింగ్ చేయాలని ప్రయత్నించి ఫెయిలయ్యాడు కింగ్ కోహ్లీ. చెత్త షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. ఆ టైమ్​లో అతడ్ని చూస్తే ఏదో కొత్తగా ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు అనిపించింది. రోహిత్​తో పోటీపడాలనే తాపత్రయమే విరాట్​ను ఔట్ చేసిందని చెప్పొచ్చు. అనవసరంగా హిట్​మ్యాన్​కు పోటీగా వెళ్లి వికెట్ పారేసుకున్నాడు గానీ కోహ్లీ క్రీజులో ఉంటే మ్యాచ్ ఎప్పుడో ముగిసేది.

అటాకింగ్ చేయడం రోహిత్ శర్మ న్యాచులర్ గేమ్. స్ట్రయిక్ రొటేట్ చేయడం, గ్యాప్స్​లోకి బంతిని తరలించడం, అదును చూసి చెత్త బంతుల్ని శిక్షించడం, అవసరమైన టైమ్​లో గేమ్​ స్పీడ్​ను పెంచడం కోహ్లీ శైలి. కానీ నిన్న దీనికి పూర్తి భిన్నంగా అతడి ఆట సాగింది. ఒకవేళ కోహ్లీ తర్వాత రోహిత్, అయ్యర్ కూడా వెంటవెంటనే అవుటైతే భారత్ పరిస్థితి ఏమయ్యేదో? దీన్ని చూసి నెటిజన్స్ కూడా ఆందోళన చెందుతున్నారు. అనవసరమైన పోటీలు పెట్టుకోకుండా టీమ్ కోసం గెలిపించే దాకా క్రీజులో ఉండాలని, ఎవరి గేమ్ వాళ్లు ఆడితే జట్టుకు కప్పు ఖాయమని టీమిండియా ఫ్యాన్స్ అంటున్నారు. మరి.. పాక్​తో మ్యాచ్​లో కోహ్లీ బ్యాటింగ్​ తీరుపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: శుబ్​మన్​ గిల్​కు ICC అవార్డు.. తొలి టీమిండియా ప్లేయర్​గా రికార్డు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి