iDreamPost

లక్ష మంది నోళ్లు మూయించిన కమిన్స్​కు మోడీ షాక్.. ప్రధాని దెబ్బకు నోరెళ్లబెట్టాడు!

  • Author singhj Published - 11:13 AM, Mon - 20 November 23

ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్​కు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఊహించని షాక్ ఇచ్చారు. ప్రధాని దెబ్బకు కంగారూ కెప్టెన్​కు ఏం చేయాలో తోచలేదు.

ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్​కు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఊహించని షాక్ ఇచ్చారు. ప్రధాని దెబ్బకు కంగారూ కెప్టెన్​కు ఏం చేయాలో తోచలేదు.

  • Author singhj Published - 11:13 AM, Mon - 20 November 23
లక్ష మంది నోళ్లు మూయించిన కమిన్స్​కు మోడీ షాక్.. ప్రధాని దెబ్బకు నోరెళ్లబెట్టాడు!

క్రికెట్​లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే వరల్డ్ కప్ నెగ్గాలంటే మరొక్క మ్యాచ్​లో విజయం సాధిస్తే చాలు. ఈ నేపథ్యంలో కోట్లాది మంది ఆశలను మోస్తూ గ్రౌండ్​లోకి అడుగపెట్టింది భారత్. కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్నంత వరకు ఊపు వేరే లెవల్లో ఉంది. అతను ఔటవ్వడం, ఆ తర్వాత వచ్చిన వాళ్లు రన్స్ చేసేందుకు ఇబ్బందులు పడటం, వరుసగా వికెట్లు పడటం, తక్కువ స్కోరుకే ఆలౌట్ కావడంతో మ్యాచ్​ గెలవడం కష్టమనే అభిప్రాయానికి అందరూ వచ్చేశారు. అయితే పేసర్లు జస్​ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి చకచకా 3 వికెట్లు తీసి ఆశలు రేకెత్తించారు. కానీ ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మార్నస్ లబుషేన్​తో కలసి ఓపెనర్ ట్రావిస్ హెడ్ మ్యాచ్​ను ముందుకు తీసుకెళ్లాడు. ఒక్కో రన్ జోడిస్తూ, క్రీజులో సెటిలయ్యాక బౌండరీలతో విరుచుకుపడ్డాడు. లాస్ట్​కు మ్యాచ్​ను వన్ సైడ్ చేసేశాడు. దీంతో భారత ప్లేయర్లతో పాటు ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ అయింది.

ఎన్నో ఆశలు పెట్టుకున్న వరల్డ్ కప్ మిస్సవ్వడం, ఫైనల్లో ఓడిపోవడంతో టీమిండియా క్రికెటర్లు ఫుల్ ఎమోషనల్ అయిపోయారు. వరుసగా విజయాలు సాధిస్తూ ఫైనల్ వరకు చేరుకుంటే.. డేంజరస్ ఆసీస్ కప్పును తన్నుకుపోవడాన్ని తట్టుకోలేకపోతున్నారు. టోర్నీ మొత్తం బెస్ట్​ గేమ్​తో అలరించినా ఆఖరి మెట్టుపై బోల్తా పడటాన్ని తట్టుకోలేక కన్నీటి పర్యంతం అయ్యారు. మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకోలేక ఏడ్చేశాడు. హిట్​మ్యానే కాదు మిగిలిన ఆటగాళ్లు కూడా ఎమోషనల్ అయిపోయారు. వెక్కి వెక్కి ఏడుస్తున్న సిరాజ్​ను కంట్రోల్ చేయలేకపోయాడు బుమ్రా. సిరాజ్​ను హగ్ చేసుకొని ఓదార్చాడతను. ఇంత బాగా ఆడినా టీమ్ గెలవకపోవడం, కప్పు మిస్సవ్వడంతో విరాట్ కోహ్లీ ఎంతో నిరాశతో కనిపించాడు.

ఎప్పుడూ ఎంతో ఎనర్జీతో నవ్వుతూ, నవ్విస్తూ, కేరింతలు కొడుతూ, ఫుల్ జోష్​లో కనిపించే విరాట్ కోహ్లీ ముఖం నిన్న చిన్నబోయింది. భారత క్రికెటర్లను చూసి ఫ్యాన్స్ మరింత ఎమోషనల్ అవుతున్నారు. ఒకవైపు టీమిండియా ప్లేయర్స్ బాధలో మునిగిపోతే మరోవైపు ఆసీస్ క్రికెటర్స్ మాత్రం కప్పు నెగ్గిన సంతోషంలో ఎగిరి గంతులేశారు. ఒకర్నొకరు హగ్ చేసుకొని ఫుల్​గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక, ఈ మ్యాచ్​కు ముందు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చేసిన వ్యాఖ్యలు వైరల్​గా మారిన సంగతి తెలిసిందే. ఫైనల్ మ్యాచ్​ చూసేందుకు వచ్చే 1.3 లక్షల మంది నోళ్లు మెదపకుండా చేస్తానని, అదే తనకు సంతృప్తిని ఇస్తుందని కామెంట్స్ చేశాడు.

ముందు చెప్పినట్లే మ్యాచ్​లో నెగ్గి, టీమిండియాను ఓడించి అక్షరాలా చేసి చూపించాడు కమిన్స్. కానీ అతడికి భారత ప్రధాని నరేంద్ర మోడీ ఊహించని షాకిచ్చారు. కోట్లాది మంది ఫ్యాన్స్ నోళ్లు మూయించిన కమిన్స్​ను నోరెళ్లబెట్టేలా చేశారు మోడీ. కప్ గెలిచిన కమిన్స్​కు మోడీ చేతుల మీదుగా ట్రోఫీని అందజేశారు. ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్సెస్​తో కలసి మోడీ పోడియం పైకి వచ్చారు. కమిన్స్​కు షేక్ హ్యాండ్ ఇచ్చి.. రెండు మాటలు మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోయారాయన. అలాగే తనతో పాటు రిచర్డ్​నూ తీసుకెళ్లారు. అయితే మోడీతో కలసి ఫొటోలకు పోజులిద్దామనుకున్న కమిన్స్.. ఆయన వైపు తిరిగేలోపు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఒంటరిగా దిక్కుతోచని స్థితిలో ఉండిపోయాడు. దీంతో లక్షమంది నోళ్లు మూయించిన కమిన్స్​కు మోడీ భలే షాక్ ఇచ్చారని భారత అభిమానులు అంటున్నారు. మరి.. కమిన్స్​కు మోడీ ఇచ్చిన షాక్​పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఆస్ట్రేలియా అహంకారం.. వరల్డ్ కప్​ను ఇలాగేనా గౌరవించేది?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి