iDreamPost
android-app
ios-app

వరల్డ్​ కప్ టీమ్ సెలెక్షన్​పై యువీ అసంతృప్తి.. అతడ్ని ఎందుకు తీసుకోలేదంటూ..!

  • Author singhj Published - 09:39 AM, Sat - 30 September 23
  • Author singhj Published - 09:39 AM, Sat - 30 September 23
వరల్డ్​ కప్ టీమ్ సెలెక్షన్​పై యువీ అసంతృప్తి.. అతడ్ని ఎందుకు తీసుకోలేదంటూ..!

వన్డే వరల్డ్ కప్​కు అంతా రెడీ అయింది. ఇప్పటికే వామప్ మ్యాచ్​లు కూడా మొదలయ్యాయి. ప్రతిష్టాత్మక టోర్నీలో పాల్గొనేందుకు ఒక్కో జట్టు భారత్​కు చేరుకుంటోంది. ఇటీవలే ఇండియాకు వచ్చిన పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య శుక్రవారం ఉప్పల్ వేదికగా వామప్ మ్యాచ్ జరిగింది. ఇంగ్లండ్ టీమ్ కూడా ఇండియాకు చేరుకుంది. శనివారం ఈ రెండు జట్ల మధ్య గువాహతి వేదికగా వామప్ మ్యాచ్ జరగనుంది. వరుసగా ఆసియా కప్-2023, ఆస్ట్రేలియాపై సిరీస్ విజయాలతో ఫుల్ జోష్​లో ఉన్న భారత్.. తమ వరల్డ్ కప్ వేటను పాజిటివ్​గా ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. అన్ని విభాగాల్లోనూ జట్టు బలంగా కనిపిస్తోంది.

బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాల్లోనూ టీమిండియా పవర్​ఫుల్​గా కనిపిస్తోంది. ప్లేయర్లు అందరూ మంచి ఫామ్​లో ఉన్నారు. గాయపడిన స్పిన్ ఆల్​రౌండర్ అక్షర్ పటేల్ స్థానంలో వచ్చిన సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రాకతో బౌలింగ్ అటాక్​ మరింత బలోపేతం అయింది. స్పిన్​కు అనుకూలించే స్వదేశీ పిచ్​లపై అశ్విన్ అనుభవం టీమ్​కు పెద్ద ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. అయితే అశ్విన్ సెలెక్షన్​పై టీమిండియా దిగ్గజం యువరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అశ్విన్ బదులు యుజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్​ను జట్టులోకి తీసుకుంటే బాగుండేదన్నాడు. చాహల్​ను వరల్డ్ కప్​లో ఆడించకపోవడం సరికాదని మండిపడ్డాడు యువీ.

చాహల్​ను ఆడించకపోవడం తప్పు. ప్లేయింగ్ ఎలెవన్​లోకి తీసుకోకపోయినా 15 మంది స్క్వాడ్​లోనైనా అతడ్ని ఉంచాల్సింది. లెగ్ స్పిన్నర్లు కీలక టైమ్​లో వికెట్లు తీయడంలో ఎంతో ఉపయోగపడతారు. కుల్దీప్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. అయితే టర్నింగ్ ట్రాక్​ల పైనా, స్లో వికెట్ల మీదా చాహల్​ను ఎదుర్కోవడం చాలా కష్టం. మూడో పేసర్ స్థానాన్ని హార్దిక్ పాండ్యాతో భర్తీ చేయొచ్చు. కాబట్టి చాహల్​ను తీసుకోవాల్సింది. స్పిన్​ బౌలింగ్​తో పాటు బ్యాటుతోనూ రాణించే వాషింగ్టన్ సుందర్​ను కూడా తీసుకొని ఉండాల్సింది. ఇక, పేసర్ జస్​ప్రీత్ బుమ్రా కమ్​బ్యాక్ ఇవ్వడం సంతోషం. ఆసియా కప్ గెలిచినంత మాత్రాన వరల్డ్ కప్ మనదేనని చెప్పలేం. కానీ భారత్ మంచి ఫామ్​లో ఉంది’ అని యువరాజ్ చెప్పుకొచ్చాడు.

ఇదీ చదవండి: ఇంగ్లండ్​ టీమ్​కు చేదు అనుభవం.. BCCIపై బెయిర్​స్టో సీరియస్!