iDreamPost
android-app
ios-app

హార్దిక్ విషయంలో టీమిండియా కొత్త ప్లాన్.. వర్కౌట్ అయ్యేనా?

  • Author singhj Published - 10:46 AM, Wed - 25 October 23

ఇంజ్యురీతో బాధపడుతున్న హార్దిక్ పాండ్యా విషయంలో భారత టీమ్ మేనేజ్​మెంట్ కొత్త ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుందో అనేది చెప్పలేని పరిస్థితి.

ఇంజ్యురీతో బాధపడుతున్న హార్దిక్ పాండ్యా విషయంలో భారత టీమ్ మేనేజ్​మెంట్ కొత్త ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుందో అనేది చెప్పలేని పరిస్థితి.

  • Author singhj Published - 10:46 AM, Wed - 25 October 23
హార్దిక్ విషయంలో టీమిండియా కొత్త ప్లాన్.. వర్కౌట్ అయ్యేనా?

వన్డే వరల్డ్ కప్-2023లో టీమిండియా బ్రేకుల్లేని బుల్డోజర్​లా దూసుకెళ్తోంది. అడ్డొచ్చిన ప్రతి ప్రత్యర్థిని చిత్తు చిత్తుగా ఓడిస్తూ మెగా టోర్నీలో డామినేషన్ ప్రదర్శిస్తోంది. భారత్​తో మ్యాచ్ అంటేనే ఇతర టీమ్స్ భయపడేలా ఉంది రోహిత్ సేన పెర్ఫార్మెన్స్. ఎక్కువ రన్స్ చేయనీయకుండా ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయడం, అటాకింగ్ గేమ్​తో టార్గెట్​ను ఉఫ్​మని ఊదేయడం టీమిండియాకు అలవాటైపోయింది. ఇదే ఊపు, జోష్​ను కంటిన్యూ చేస్తే ఈసారి ఛాంపియన్లుగా నిలిచేది రోహిత్ సేనేనని ఫ్యాన్స్ సహా అనలిస్టులు కూడా అంటున్నారు. వరుసగా ఐదు మ్యాచుల్లో విజయం సాధించిన భారత్.. ఇప్పుడు ఇంగ్లండ్​తో తలపడేందుకు రెడీ అవుతోంది.

టీమిండియా, ఇంగ్లండ్​కు మధ్య అక్టోబర్ 29 (ఆదివారం)న కీలక ఫైట్ జరగనుంది. ఈ వరల్డ్ కప్​లో ఇంగ్లీష్ టీమ్​కు ఏదీ కలసి రావడం లేదు. న్యూజిలాండ్, ఆఫ్ఘానిస్థాన్, సౌతాఫ్రికా చేతుల్లో ఓటమితో సెమీస్ ఛాన్సులను ఆ జట్టు సంక్లిష్టం చేసుకుంది. సెమీస్ చేరాలంటే ఇప్పటి నుంచి ఆడే ప్రతి మ్యాచ్​లో బట్లర్ సేన గెలవాలి. నెట్​రన్ రేట్ మెరుగుపడాలంటే భారీ మార్జిన్​తో నెగ్గాలి. అయినా సెమీస్ బెర్త్ దక్కుతుందని చెప్పలేం. ఈ పరిస్థితుల్లో వరుస విజయాలతో ఊపు మీదున్న భారత్​తో మ్యాచ్​ అంటే ఇంగ్లండ్​ టెన్షన్ పడుతోంది. ఎలాగైనా ఈ మ్యాచ్​లో నెగ్గాలని వ్యూహాలు పన్నుతోంది. మరోవైపు టీమిండియా కూడా ఈ మ్యాచ్​ను సీరియస్​గా తీసుకుంటోందని తెలుస్తోంది.

గాయం కారణంగా న్యూజిలాండ్​తో మ్యాచ్​కు దూరమైన ఆల్​రౌండర్​ హార్దిక్ పాండ్యా కమ్​​బ్యాక్​కు అంతా రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్​తో మ్యాచ్​లో పాండ్యాను ఆడించాలని భారత టీమ్ మేనేజ్​మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. పాండ్యాను స్పెషలిస్ట్ బ్యాటర్​గా ఆడించే ఛాన్స్​ను మేనేజ్​మెంట్ పరిశీలిస్తున్నట్లు టాక్. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్న హార్దిక్ స్పీడ్​గా రికవర్ అవుతున్నాడని తెలిసింది. ఒకవేళ ఇంగ్లండ్​తో మ్యాచ్ నాటికి అతడు కోలుకుంటే స్పెషలిస్ట్ బ్యాటర్​గా ఆడించాలని ద్రవిడ్, రోహిత్ అనుకుంటున్నారట. అయితే ఈ టైమ్​లో అనవసరంగా రిస్క్ ఎందుకని క్రికెట్ అనలిస్టులు అంటున్నారు.

భారత్ ఆడిన ఐదు మ్యాచుల్లోనూ గెలిచిందని.. మరో ఒకట్రెండు మ్యాచుల్లో నెగ్గితే సెమీస్ బెర్త్ ఖాయం అవుతుందని అనలిస్టులు చెబుతున్నారు. టీమిండియా నెక్స్ట్ ఆడాల్సిన మ్యాచుల్లో ఒకటి నెదర్లాండ్స్​తో, మరొకటి శ్రీలంకతో ఉందని.. ఇప్పుడున్న ఫామ్​లో వాటిపై నెగ్గడం ఏమంత కష్టం కాదు. ఈ నేపథ్యంలో పాండ్యాను దింపి రిస్క్ తీసుకోవడం అవసరమా? అని సోషల్ మీడియాలో నెటిజన్స్ కూడా ప్రశ్నిస్తున్నారు. సెమీఫైనల్, ఫైనల్ లాంటి మ్యాచుల వరకు టైమ్ ఇస్తే.. పాండ్యా పూర్తిగా కోలుకొని స్ట్రాంగ్​గా కమ్​బ్యాక్ ఇస్తాడని చెబుతున్నారు. సెమీస్, ఫైనల్స్ కోసం పాండ్యాను కాపాడుకోవాలని.. అతడు లేకపోతే టీమ్ బ్యాలెన్స్ ఎలా దెబ్బతింటుందో మొన్న న్యూజిలాండ్​తో మ్యాచ్​లో చూశామని గుర్తుచేస్తున్నారు. ఒకవేళ ఇంగ్లండ్​తో లేదా ఇతర లీగ్ మ్యాచుల్లో ఆడి పాండ్యా మళ్లీ గాయపడితే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరి.. పాండ్యా విషయంలో మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: World Cup 2023: అలాంటోడు ఒక్కడు కూడా లేడు! అక్తర్‌ షాకింగ్‌ కామెంట్స్‌